Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రైస్తవ యథార్ధత

    ప్రతి వర్తన వ్యవహార కార్యమందును యథార్ధముగా నుండుడి. ఎంత శోధింపబడినను స్పల్ప విషయముల యందు సైతము మోసము చేయకుడి. కొన్నిసార్లు తిన్ననైనయథార్ధమార్గము నుండి తొలగుటకు మీ పాప మానసము మిమ్మును శోధింపవచ్చును. కాని తలవెంట్రెకంత తావు కూడ దానికియ్యకుడి. ఒక విషయమును గూర్చి మాట యిచ్చిన పిదప నష్టము మీకు కలగనై యుండినను నియమము నుండి లేశమైనను తొలగకుడి, మీ ఒడంబడిక ప్రకారము చేయుడి. 2CG 154;CChTel 222.3

    అసత్యపు ఒడబాటులను, అసత్యపు చర్యలను అపనమ్మకమును బైబిలు గ్రంథము నిశితముగా ఖండిరచు చున్నది. తప్పొప్పులు సృష్టముగా వ్యక్తము చేయబడినవి. అయినను దైవప్రజలు తమ్ముడు తాము అపవాది అధీనమందుంచు కొనునట్లు నాకు చూపబడెను. వారు అపవాది శోధినలకు లొంగి తమ వివేచనా శక్తులు మొద్ధుబడు వరకు ఆతని చెప్పుచేతలలో నుండిరి. ఆర్దిక సంబంధమైన లాభనష్టములున్నచోట సత్యమునుండి కొంచెము తొలగుట, దైవ విధులను కొద్దిగా మీరుట ఏమంత పెద్దపాపము కాదని వారు పరిగణించెదరు. లక్షాధికారి చేసినను, వీధులలోని భిక్షాధికారి చేసినను పాపము పాపమే. అబద్ధపు విధానముల వలన ఆస్థి సంపాదించువారు తమ ఆత్మల మీదికి శిక్షావిధి తెచ్చుకొనుచున్నారు. మోసము వలన అన్యాయము వలన ఆర్జింప బడిన దంతయు ఆర్జించువానిపట్ల శాపదాయకముగా పరిణమిల్లును. 34T 311;CChTel 222.4

    అబద్ధికులు, మోసగాండ్రు ఆత్మగౌరవమును కోల్పోవుదురు. దేవుడు తనను చూచుచున్నాడనియు, తన వ్యవహారములన్నింటిని ఆయన ఎరుగుననియు, దేవదూతలు తన ఉద్దేశ్యములను తూచి మాటలను ఆలకించుచున్నారనియు, తనకు ప్రతి పలము తన కార్యములను బట్టి కలుగుననియు అతడు గుర్తించక పోవచ్చును. కాని తన పొరపాటు పనులను మానవుల దృష్టి నుండియు, దేవుని దృష్టి నుండియు దాచ యత్నించినను ఆ విషయములు అతనికి తెలసే యున్నవి. గనుక తన మనస్సును, శీలమును అవి నీచ పర్చుచున్నవి. ఒక మోసపు క్రియ శీలమును నిర్ణయించదు గాని తరువాత శోధనకు సులభముగా లొంగుటకు దారి తీయును. తుదకు వ్యాపారమందు మోసము చేయుట, అపనమ్మకముగా వ్యవహరించుట అలవడును. ఆ మనుజుని ఎవరును నమ్మరు. 45T 396;CChTel 223.1

    తన ధ్వజము క్రింద నుండి తన సేవ చేయుచున్న మనుజులు నమ్మకముగాను, ప్రవర్తన విషయము ఆనింద్యులుగాను, తమ నాలుకలతో ఏమాత్రము అసత్యము చెప్పని వారిగను నుండవలెనని దేవుడు కోరుచున్నాడు. నాలుక, కండ్లు యధార్థములుగా నుండవలెను. దేవుని ఆవేశము ప్రకారము సమస్త కార్యములు జరుగవలెను. మనము పరిశుద్ధ దేవుని దృష్టియందు నివసించు చున్నాము. “నీ క్రియలు నేనెరుగుదును” అని ఆయన గంభీర స్వరముతో పలుకు చున్నాడు. దేవుని నేత్రము సర్వదా మనపై నున్నది. ఒక అసత్య కార్యమును మనము ఆయనకు మరుగుపర్చలేము. మన ప్రతికార్యమును దేవుడు చూచుచున్నాడను విషయమును గ్రహించు వారు లేరు. 5CG 152;CChTel 223.2