Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మందుల (డ్రగ్సు) వాడకము

    విషపూరితములగా మందుల వాడకము వ్యాదికి, ఘోరమయిన పెక్కు కీడులకు పునాదియగు చున్నది. వ్యాది సోకినపుడు పెక్కురు వ్యాది కారణము కనుగొనుటకు యత్నించరు. బాధను, దుస్థితిని తొలగించుకొనులకు తాపత్రయ పడెదరు. CChTel 441.4

    విషపూరితొషధముల వాడకము వలన అనేకులు జీవింతాంతము వరకు నుండు వ్యాదులను తెచ్చిపెట్టు కొనుచున్నారు. ప్రకృతిని నివారణ పద్ధతుల వలన బాగుపడుటకు వీలున్న అనేకులు తమ ప్రాణములను పొగొట్టుకొనుచున్నారు. మందులు అనబడు వానిలోని విషము శరీరాత్మలను శిధిలముచేయు నలవాటులను, అభిరుచులను కలుగజేయు చున్నవి. పేటెంటు మందులు అని పిలువబడు అనేక మర్మౌషధములు, తుదకు వైద్యులిచ్చు కొన్ని మందులు, సారాయి అలవాటును, నల్లమందు అలవాటును, నిద్రమందు అలవాటును కలిగించు చున్నవి. ఈ యలవాట్లు సమాజమునకు కంటక ప్రాయములు. 20MH 126, 127;. CChTel 441.5

    సాధారణముగా వాడబడుచున్న మందులు హానికరమయినవి. మందుల వాడకమును నర్జించుట అలవరచు కొనుడి. మందుల వాడకము తగ్గించి ఆరోగ్య సాధకములపై నెక్కువ ఆధారపడుడి. అప్పుడు దైవ వైద్యులగు నిర్మల జలము, వ్యాయామము, స్వచ్ఛమయిన మనస్సాక్షి ` వీరికి ప్రకృతి దోహదము చేయును. టీ కాఫీలను మాంసమును ఉపయోగించు వారికి మందులు (డ్రగ్సు) అవసరము. అయితే ఆరోగ్య సూత్రములను అనుసరించినచో అనేకులు ఆవగింజంత మందును కూడ నుపయోగించకుండగనే స్వస్థత పొందవచ్చును. మందులను తరచుగ వాడనక్కరలేదు. 21CH 261;CChTel 442.1