Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    హితవు నిరాకరించు వారి పట్ల సంఘము యొక్క కర్తవ్యము

    క్రీస్తిచ్చిన ఉపదేశము నమ్మకముగా అనుసరించువరకు ఒక అపరాధి పేరు సంఘము పట్టికల నుండి తీసివేయవలెనని యేసంఘమును సూచించదు; ఏ కమిటీ సిఫారసు చేయరాదు; ఏ సంఘము ఓటు చేయరాదు. ఈ ఉపదేశమును అమలులో పెట్టిన పిదప సంఘము దేవుని ముందు నిర్దోషిగా నుండును. తప్పిదము ఉన్నదున్నట్లు ప్రదర్శితమై ఆ మీదట తొలగించబడవలెను. అదీ ఎక్కువగా వ్యాపించకుండునట్లు ఇట్లు చేయవలెను. క్రీస్తు యొక్క నీతి వస్త్రములను ధరించుకొని సంఘము దేవుని ముందు నిష్కళంకముగా నుండుటకు గాను దాని సౌఖ్యమును, సానిత్య్రమును కాపావలెను. CChTel 175.3

    అపరాధి పశ్చాత్తప్తుడై క్రీస్తు క్రమ శిక్షణకు లొంగియుండుచో అతనికి మరియొక తరుణము యీయవలెను. అతడు పశ్చాత్తాపపడకున్నను, సంఘము వెలుపల నున్నను, అతని కొరకు దైవ సేవకులు బద్దులై యున్నారు. అతడుపశ్చాత్తాపపడునట్లు వారు పట్టుదల కలిగి యతని కొరకు పనిచేయవలెను. అతని తప్పిందమెంత ఘోరమైనదయినను అతడు పరిశుద్దాత్మ కృషికి లొంగి, తన పాపమును ఒప్పుకొని దానిని విడనాడుట ద్వారా పశ్చాత్తాపము పొందినట్లు నిదర్శనము చూపినచో ఇతరులు తమపట్ల ఎట్టు వర్తించవలెనని వారు కోరెదరో అట్లే సహోదరులాతని యెడల వర్తించుచు సన్మార్గమందు నడచుటలో నతనికి ప్రోత్సాహమియ్యవలెను. తాము కూడ శోధింపబడకుండునట్లు వారు తమ్మును గూర్చి యోచించుకొనవలెను. CChTel 175.4

    “భూమి మీద మీరు నేటికిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును; భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని నిశ్చమముగా మీతో చెప్పుచున్నాను” అని సెలవిచ్చెను. 18 వచనము. CChTel 176.1

    ఈ వాక్యము అన్ని యుగములలోను సార్థకమైనదే. క్రీస్తు స్థానమందు వ్యవహరించుటకు అధికారమీయబడినది. దైవజనులలో క్రమము, క్రమశిక్షణలను నిలుపుటకు సంఘము దేవుని సాధనము. తన శ్రేయస్సుకు, పవిత్రతకు, క్రమమునకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుటకు ప్రభువు సంఘమునకు అధికారమిచ్చెను. క్రీస్తును పోలిన ప్రవర్తన వలన సత్యమునకు అపకీర్తి తెచ్చు అయోగ్యలను విడనాడు బాధ్యతల సంఘముపై గలదు. దైవ వాక్యముందీయబడిన ఉపదేశానుసారము సంఘమేది చేయునో అది పరమందు ఆమోదించబడును. CChTel 176.2

    ప్రాముఖ్యముగల విషయములు సంఘముచే పరిష్కరింపబడును. ప్రజలకు మార్గదర్వకులుగా నుండు నిమిత్తము అభిషేకించబడిన దైవబోధకులు తమ భాగమును నిర్వహించిన పిదప తీర్మానము ఏకగ్రీవముగా నుండుటకు గాను ఆ విషయమును సంఘమునకు అప్పగించవలెను. CChTel 176.3

    తన అనుచరులు ఒకరితో నొకరు మెలగుటలో జాగరూకులై యుండవలెనని ప్రభువు కాంక్షించుచున్నాడు. స్వస్తపర్చుటకు ఉద్దరించుటకు, యధా సూర్వస్థితికి తెచ్చుటకు వారు ఉపక్రమించవలెను. కాని సంఘమందు సరియై న క్రమశిక్షణ యుండవలెను. వీనిని అశ్రద్ధ చేయరాదు. తాము ఒక పాఠశాలయందలి విద్యార్థులనియు తమ పిలుపునకు తగినట్టి శీలములను సాధించుకొనుటకు శిక్షణ పొందుచున్నారనియు సభ్యులు తలంచవలెను. మీది సంఘముతో తిరిగి ఐక్యపడుటకు ఇక్కడి సంఘమందు దేవుని పిల్లలు సిద్ధపడవలెను. ఇక్కడ క్రీస్తును పోలి జీవించువారు విమోచింపబడినవారి కుటుంబములో అనంతకాలము నివసించుటకు ఎదురుచూడవచ్చును. 57T 262-264;CChTel 176.4