Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నేడు ధైర్యముగా జీవించండి

    మీరు నమ్మిన సత్యము మీకు రక్షణ జ్ఞానము కలుగజేయును. దానిని నమ్మి అనుకరించుట ద్వారా బాద్యతలు నెరవేర్చుటకు, బాధలను సహించుటకు చాలినంత కృప మీకు లభ్యమగుట. రేపటి నిమిత్తము కృప మీకు అవసరములేదు. మీకు నేటితోనే సంబంధమున్నదని గ్రహించవలెను. ఈ దినము దేవుని యందు జయము సాధించుడి. నేడు స్వార్థమునుపేక్షిం చుడి. నేడు మెళకువగా నుండి ప్రార్థించుడి. మన పరిస్థితులు, పరిసరములు, మనచుట్టు పట్ల సంఘటిల్లుచున్న దైనందిన పరివర్తనలు వీనిని సాకల్యముగా గ్రహించి ఋజువు చేయుచున్న దైవ లేఖనము మనకు మన ధర్మము నెరుకపరచి మన దిన దిన కర్తవ్యమును బోధపరచుటకు ఇవి చాలును. వ్యర్థ విషయములను గూర్చి గాఢముగా యోచన చేయుటకన్న దినదినము మీరు లేఖనములను పరిశోధించి ఆ బాధ్యతలను మీ దైనందిన జీవితములందు నిర్వహించుట మేలు. వీనిని చేయుట మీకు యిప్పుడు బాధకరముగా నుండవచ్చును. కాని ఎవరో ఒకరు వీనిని నిర్వర్తించవలెను. 53T 333;CChTel 199.4

    అనేకులు తమ చుట్టుపట్ల ఉన్న దుర్మార్గముపై తమ దృష్టిని నిల్పెదరు. సర్వత్రా ఉన్న మత భ్రష్టతను, బలహీనతను, వారు లక్షించి తమ హృదయములు విచారముతోను, సంశయములతోను నిండు వరకు వీనిని గూర్చి చర్చించెదరు. ప్రధాన వంచకుని మహత్తర కార్యములను గూర్చి యెక్కువగా తలచి తమకు వాటిల్లిన నిరాశా నిస్పృహలను మననము చేసికొనుచు పరలోక జనకుని శక్తిని, అనన్య ప్రేమను మరతురు. ఇదియే సాతానుని కోర్కె. నీతి విరోధిjైున వాని శక్తిని గూర్చి యెక్కువగా తలంచి దైవ ప్రేమను, శక్తినిగూర్చి తక్కువ తలంచుట పొరపాటు. క్రీస్తు శక్తినిగూర్చి మనము మాటలాడవలెను. సాతాను పట్టునుండి మనము తప్పించుకొనుటకు మనము శక్తిహీనులము. కాని తప్పించుకొను మార్గము ఒక దానిని ఆయన ఏర్పరచెను. మన నిమిత్తము యుద్ధము చేయుటకు మహోన్నతుని కుమారినికి శక్తి కలదు. “మనము ప్రేమించిన ఆయన ద్వారా” మనము “అత్యధిక విజయులము” కాగలము. CChTel 200.1

    బలహీనత, తిరోగతులను గూర్చి సర్వదా ఆలోచించి సాతాను శక్తిని గూర్చి ఖేదపడుటలో ఆధ్యాత్మిక బలము లేదు. మన కొరకు చేయబడిన త్యాగము యొక్క సార్థకతయు, తన వాక్యమందు నిర్దేషించబడిన షరతులను నెరవేర్చువారిని దేవుడు సంపూర్ణముగా రక్షించుననెడి సత్యము మన హృదయములందును మనస్సులలోను ఒక సజీవ నియమముగా స్థాపించబడవలెను. మన చిత్తమును దైవ చిత్తపు ఆధీనమందుంచుటయే మన కర్తవ్యము. అప్పుడు ప్రాయశ్చిత్త రక్తము ద్వారా మనము దైవ స్వభావమమందు పాలివారమగుదము. క్రీస్తు ద్వారా మనము దేవుని పిల్లలలము తన కుమారుని ప్రేమించునట్లు దేవుడు మనలను ప్రేమించునను నిశ్చత మనకు గలదు. మనము క్రీస్తుతో ఏకస్థులము. క్రీస్తు నడుపు మార్గమందు మనము నడచెదము. మన మార్గమందు సాతానుడు కలుగజేయు చీకటి నీడలను పటాపం చలు చేయుటకు ఆయన శక్తిమంతుడు, చీకటి, అధైర్యములస్థానే ఆయన మహిమాతేజములు మన హృదయములలో ప్రజ్వలించును. CChTel 200.2

    సోదరీ, సోదరులారా, వీక్షించుటద్వారానే మనము మార్పు చెందుదుము. మన రక్షకుడైన దేవుని ప్రేమనుగూర్చి ధ్యానించుటద్వారా దైవశీలసంపూర్ణతనుగూర్చి ధ్యానించి, విశ్వాసమూలముగా, క్రీస్తు నీతిని పొందుటద్వారా ఆన స్వరూపమునకు మనముమార్పుచెందవలసి యున్నాము, దుర్మార్గము, అవినీతి, అశౌభంగములు, ఇవి సాతాను శక్తిని బయలుపరచు చెడ్డ పటములు. మన హృదయములు నిరాశా నిస్పృహలతో నిండుకొను వరకు వీనిని గూర్చి ప్రస్తావించరాదు. దు:ఖించరాదు. మన స్మృతి మందిరములో వీనిని వ్రేలాడనీయరాదు. అధైర్యము చెందిన ఆత్మ చీకటికొన వంటిది. అతడు దేవుని వెలుగును పొందజాలడు సరిగదా, ఇతరులకును ఆ వెలుగు అందకుండజేయును. తన విజయ సూచిక చిత్రముల ఫలితములను చూచుట సాతానుకు అమిత ప్రీతి, సాతానుడు తన జయ చిత్రముల ద్వారా మానవులను విశ్వాస రహితులుగాను, ధైర్యశూన్యులుగాను చేయుటయందు సంతోషించును.” 65T 741—745;