Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సాక్ష్యముల దుర్వినియోగము

    ఇట్లు దైవప్రజల కీయబడిన వెలుగు అవివేకముగా వినియోగించరాదు అని హెచ్చరించుచు సాక్ష్యముల ప్రథమ సంపుటము వెలువడినది. కొందరవివేక మార్గమవలంబించిరని నేనుద్ఘాటించితిని. తమ విశ్వాసులతో ప్రస్తావించినపుడు తాము నమ్ము విషయములను నిరూపణకు వేదగ్రంథమునుపయోగించుటకు బదులు నారచనలనుండి వచనములు చదిఇరి. ఇది అనుచిత మార్గమనియు అవిశ్వాసులకు సత్యముపట్ల ద్వేషభావమును కలిగించుననియు నాకు చూపబడెను. వాని స్వభావమును ఎరుగని వారికి సాక్ష్యములు నిరుపయోగములు. ఇట్టి సందర్భములలోనవి ప్రస్తావనకు రావలదు. CChTel 210.3

    సాక్ష్యముల వినియోగమును గూర్చి యింక అప్పుడప్పుడు ఈ దిగువ హెచ్చరికలు అనుగ్రహించబడినవి. CChTel 210.4

    “కొంతమంది బోధకులింకను చాల వెనుకబడి యున్నారు. అనుగ్రహింప బడిన సాక్ష్యమును వారు నమ్ముచున్నట్లు చెప్పెదరు. కొందరు సాక్ష్యము గూర్చిన జ్ఞానము లేని వారికి వానిని వర్తింపజేసి తాము మాత్రము వాని ప్రకారము నడచుకొనకుండుటద్వారా హాని కలిగించు చున్నారు. వారికి పదే పదే సాక్ష్యములీబడినవిగాని, వానిని వారు విసర్జించిరి. ఇట్టి వారవలంబించు మార్గము నిలకడలేనిది.” CChTel 210.5

    ”ఇతరుల పాపములను, తప్పిదములను గూర్చి దేవుడు బయలు పరచని విషయముల వలన అనేకులు స్వప్రయోజనములను సాధించెదరని నేను చూచితిని. దర్శనమందు చూపబడిన సంగతులకు అపార్థము వచ్చునట్లుగా వానిని మళిపి దేవుడు ప్రత్యేకపరచిన సంగతులయందలి విశ్వాసమును బలహీనపరచి సంఘమునకు అధైర్యము నిరుత్సాహము కలుగజేసెదరు.”95T 669, 670;CChTel 211.1