Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రమముగాను శ్రద్ధగాను పఠించుడి

    తల్లిదండ్రాలారా, మీ బిడ్డలు దేవుని సేవజేసి ప్రపంచములో మేలు చేయుటకు శిక్షణ నీయగోరిన యెడల బైబిలును పాఠ్య గ్రంథముగా నుపయోగించుడి. ఇది సాతాను యొక్క దుష్ట భావములను బహిరంగపర్చును. అది జాతి భేదములను మటుమాయము చేయును. జనాంగమును ఉన్నత స్థాయికి దెచ్చును. నైతిక దుర్మార్గతను గర్హించి సంస్కరించును, నిజానిజములను కనుగొనుటకది మనకు సామర్ధ్యము కలుగజేయును. గృహమందుగాని, పాటశాలయందుగాని, దేనిని బోధించుటకైనను బైబిలు అధ్యాపకునిగానుపయోగించి దానికి ప్రధమ స్థాన మీయుడి. ఈ స్థానము బైబిలును నీయబడినచో దేవుడు గౌరవించబడును. మీ పిల్లల మార్పు కొరకు ఆయన మీ పక్షమున పనిచేయును. ఈ పరిశుద్ధ గ్రంథమందు సత్యమును సౌందర్యమునకు గొప్ప గని యున్నది. పిల్లలకిది ఆశాజనకముగా లేకున్నచో తల్లిదండ్రులే నిందార్హులు. 65T 322;CChTel 215.3

    శోధకుడు మోసములతో తన చెంతకు వచ్చినపుడు క్రీస్తు “ఇట్లు వ్రాయబడెను” అను నాయుధము మాత్రమే ఉపయోగించెను. బైబిలు సత్యమును బోధించుటయను ఉత్తమ కార్యమును ప్రతి తల్లియు, తండ్రియు చేయవలెను. దేవుడు పలికిన సత్యమును ఆనంద సంతోషములుట్టిపడు ముఖములతో పిల్లలకు బోధించుడి. ఓర్పు, దయ, ప్రేమలను మీ దైనందిన జీవితమునందు కనపర్చును, తండ్రులు, తల్లులు, అయిన మీరు మీ బిడ్డలకు ఆదర్శప్రాయులుగా నుండవలెను. పిల్లలను తమ చిత్త ప్రకారము వర్తింపనీయకుడి. కాని దైవ వాక్య ప్రకారము జీవించి వారిని ప్రభువు ఆదేశముల ప్రకారము పెంచుటయే మీ పని యని వారికి వ్యక్తము చేయుడి. CChTel 216.1

    మీ కుటుంబములలో లేఖన పఠనము ఒక పద్ధతి ననుసరించి సాగించుడి. ఐహికమైన దానిని నిర్లక్ష్యము చేసిననను జీవాహారముతో ఆత్మను తృప్తిపరచుట మరువకుడి. దైవవాక్యపఠనముకొరకు అనుదినము ఒక గంట లేక అరగంట సణగక సంతోషముతో వినియోగించుట వలన కలుగు సత్ఫలితములు ఊహింపశక్యముగానివి. ఒక అంశముపై ఆయాకాలమునదు ఆయా పరిస్థితులలో నీయబడిన విషయములను పొందుపరచుచు బైబిలుకు బైబిలునే వ్యాఖ్యానముగా ఉపయోగించుడి. అతిథుల రాకవలన మీరు వేదపఠన నియమును విడువవద్దు. అతిథులు ప్రార్థన జరుగుచున్న సమయమున వచ్చినచో వారిని అందు పాల్గొన వలసినదిగా ఆహ్వానించుడి. లోక సంబంధములైన లాభములకన్న, లోకభోగములకన్న దైవ వాక్య పరిజ్ఞాన సముపార్జనమునకు మీరెక్కువ ప్రాముఖ్యత నిచ్చెదరని కనపర్చుడి. CChTel 216.2

    అనుదినము బైబిలు శ్రద్ధతోను, ప్రార్థన పూర్వకముగాను, మనము చదువుదుమేని దినదినము మనమేదోయొక నూతనమైన, సుస్పష్టమైన శక్తియుతమైన వెలుగును కనుగొందుము. 7CG 510, 511;CChTel 216.3

    మీ బిడ్డలను దేవుని శిక్షణ హితోపదేశముల క్రింద పెంచవలెనని కోరినచో మీరు బైబిలు మార్గదర్శికత్వము నవలంబించవలెను. క్రీస్తు పవిత్ర జీవితమును శీలమును వారనుకరించుటకుగాను, దానిని ఆదర్శముగా వారిముందుంచుడి. వారు తప్పిదము చేసినప్పుడు అట్టి పాపమునుగూర్చి ప్రభువేమి సెలవిచ్చెనో వారికి చదివి వినిపించుడి. ఈ కార్యనిర్వహణకు సర్వదా శ్రద్దాసక్తులు కావలెను. ఒక్క దుర్గుణమును తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు సవరించకున్నచో దానివలన శీలమంతయు వికలమగును; దోషభూయిష్టమగును. నూతన హృదయమును కలిగియుండవలెననియు నూతన లబిరుచులు నూతన లక్ష్యములు వారికి ఉండవలెననియు, పిల్లలకు నేర్పుడి. వారు క్రీస్తు వద్దనుండి సహాయము పొందవలెను. ఆయన వాక్యమందు ప్రత్యక్షపర్చబడిన రీతిగా దైవశీలముతో వారు పరిచితి కలిగియుండవలెను. 8CG 515;CChTel 216.4