Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అపవిత్రమైన పఠనము యొక్క ప్రభావము

    పఠనము మనః ప్రవృత్తిని కొంత వరకు మార్చునని సాతానుకు ఆకళింపే. చిన్నలను పెద్దలను కధల పుస్తకములు,నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను. ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు. భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ప్రబలమైన,యదార్ధమైన వాంఛను పుట్టించుటకు కావలసిన శక్తిని కోలుపోవును. CChTel 331.3

    ప్రచురితములైన పుస్తకములలో నెక్కువ భాగము తగుల బెట్టబడినచో మనస్సుకు హృదయమునకు గొప్ప హాని కలిగించుచున్న వ్యాధి నిరోధించబడును. ప్రేమ గాధలు తుచ్ఛమైన ఉద్రేకమును రెచ్చగొట్టు కథలు, నీతి ప్రధానములని పిలువబడు మత విషయక నవలలు కూడా పాఠకులకు శాపకరములే. ఒక కథయందు ఆది నుండి అంతము వరకు మత ప్రసక్తితో నిండిన వచనములుండ వచ్చును. మోసగించుటకును, ఆకర్షించుటకును, సైతానుడు దేవ దేతల వస్త్రాలంకృతుడై యున్నట్లు కన్పించును కాని ఈ కథలను చదువుట ద్వారా, మాకు కీడు చేకూరదని చెప్పగలిగినంతగా నీతి సూత్రములయందు స్థాపించబడి శోధనకతీతులైన వారెవరును లేరు. CChTel 331.4

    కల్పిత గాధలను పఠించుట, పాఠకుల అధ్యాత్మికతను నాశనము చేసి పరిశుద్ధ లేఖనముల మాధుర్యమును మరుగు చేయును. అది ఒక నికృష్టమైన ఉద్రిక్తతను ప్రేరేపించును. ఊహను కలుష పరచి మనస్సును బలహీనపరచును. ప్రార్థన చేయకుండా ఆత్మను అవాంతరము కలిగించి, ఆథ్యాత్మిక విషయములలో పాల్గొనుటకు ఆత్మకు అర్హత లేకుండ చేయును. CChTel 332.1

    పెక్కు మంది యువజనులకు దేవుడు గొప్ప సామర్థ్యముల ననుగ్రహించిఎను. కాని తరుచుగా వారి శక్తులను బలమీనము చేసి వారి మనస్సులను ఉక్కిరి బిక్కిరి చేసి వానికి దుర్భలమును ఆపాదించుచున్నవి. తత్పర్యవసానముగా వారు సంవత్సరముల తరబడి కృపయందును మన విశ్వాసమునకును సంబంధించిన జ్ఞానమునందును పెరుగుదల పొందుట లేదు. దీనికంతటికిని కారణము వారి అవివేక పఠనమే. ప్రభుని త్వరితాగమనము కొరకు ఎదురు చూచుచున్న వారు అనగా “క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు” ఆ మహత్తర పరివర్తన కొరకు ఎదరు చూచుచున్న వారు ఈ కృపకాలములో ఉన్నత కార్యరంగమున నిలువబడవలెను. CChTel 332.2

    నా ప్రియ యువ స్నేహితులారా, ఉత్రిక్తత కలిగించు కథలను పఠించుట ద్వారా మీ యనుభవమెట్లున్నదో ఆలోచించుడి. అట్టి పఠనమైన పిదప మీరు బైబిలు తెరచి ఆసక్తితో నందలి జీవ వాక్యమును చదువగలరా? దైవ గ్రంథము ఆసక్తి పుట్టించనిదిగా మీకగపడదా? ఆ ప్రేమ గాథ మనస్సులో నెలకొని మానసికారోగ్యమును నాశనము చేసి నిత్యజీవమునకు సంబంధించిన ప్రముఖ గంభీర సత్యములపై మీరు ద్యానించుటకు వీలు లేకుండ చేయును. CChTel 332.3

    అపసవ్య సాహితీ పఠనమును పట్టుదలతో వర్ణించుడి. అది మీ ఆధ్యాత్మికతకు సాయము చేయజాలదు. కాని ఉద్దేశములను చెరచు ఆశయములను కలుగజేసి మీరు యేసును గూర్చియు ఆయన ప్రశస్త పాఠములను గూర్చియు చులకన చేయునట్లు చేయును. అపమార్గమునకు దారితీయు తలంపులు తలంచకుండ మనస్సును స్వాధీనముందుంచుకొనిడి. అవినీతి కధలతో మనస్సును భారము కలిగించకుండ. అవి మానసిక శక్తులకు బలము నీయజాలవు. మీ తలంపులు మీరు పటించు సాహిత్యము ననుసరించి యుండును. 2MYP 271—273. CChTel 332.4