Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దేవుని కాపుదల నుడి తొలగుట యందలి అపాయము

    దైవ ప్రజలు బాధ్యతామార్గమంద నడచినచో దూతల వారిని కాపాడెదరు. కాని వారు బహిరంగముగా సాతాను ఆవరణలో తిరుగుటకు సాహసించినచో వారికట్టి కాపుదల ఉండదు. తన లక్ష్యమును సాధింఉటకు సాతాను ప్రతినిధి దేనినైనను చెప్పును. దేనినైనన చేయును. “భూతవైద్యుడు”, “విద్యుత్ వైద్యుడు”, “అయస్కాంత వైద్యుడు” ఇట్టి ఏ పేర్లతో పిలిపించుకొన్నను ఏమంత పట్టింపు లేదు గాని ఆకర్షకములగు అభినయములలో నతడ అజాగ్రత్తగా నున్న వారిని తన ప్రక్క నేర్చుకొనును. తన చెంతకు వచ్చు వారి జీవిత చరిత్రను పరిశీలించి వారి కష్టములను బాధలన గ్రహించుచున్నట్లు నటించును. వెలుగుదూత వేషము క్రింద దుర్మార్గ హృదయమును దాచుకొని తన హితవు నపేక్షించు స్త్రీల యందాసక్తి యున్నవానివలె నటించును. తమ బాధలన్నియు అసంతోషదాయకమగు వివాహ ఫలితముగా వచ్చినవని వారితో చెప్పును ఇది నిజమే కావచ్చును. కాని అట్టి హితవరి వారి పరిస్థితిని బాగుపరచలేడు. తమకు ప్రేమాదరములవసరమని వారికతడు చెప్పును. వారి క్షేమమందు గొప్ప ఆసక్తి యున్నట్లు నటించుచు వణకుచున్న పిట్టను సర్పమాకర్షించునట్లు అనుమానింని యీ అమాయకులను ఆకర్షించుచు వారిపై తన తండ్రి ప్రభావముంచును. అనతి కాలములో వారతనికి పూర్తిగ పశులగుదురు, పాపము, అగౌరవము, నాశనమ దీని భయానక ఫలితములు. CChTel 476.1

    దుర్మార్గుల సంఖ్య చిన్నది కాదు. వారి మార్గములు శూన్యగృహములతోడను, అపకీర్తితోడను, భగ్న హృదయములతోడను నిండియుడును. కాని దీనిని గూర్చి లోకమునకేమియు తెలియదు. వారింకను క్రొత్త వ్యక్తులను బలిగొనుచునే యుందురు. తాను కలుగజేసిన నాశనమ విషయము సాతానుడానందించును. 25T 198; “అహజ్యా షోమ్రోనులో నున్న మేడగది కిటికిలో నుండి క్రిందపడి రోగిjైు మీరు ఏక్రోను దేవత యగు బయల్జేబూబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము`ఇశ్రాయేలు వారిలో దేవుడున్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతjైున బయల్జెబూబు నొద్దకు మీరు విచారింపబోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చునదేవమనగా నీ వెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండ నీవు నిశ్చయముగా మరణమగుదువు అని ఏలియాతో చెప్పి వెళ్ళిపోయెను.” 2 రాజులు 1:2`4. CChTel 476.2

    అహజ్యారాజు చేసిన పాపము తత్పరయవసానముగా వచ్చిన శిక్ష ఒక హెచ్చరికjైు యున్నది. దీనిని అలక్ష్యము చేసినవారికి శిక్ష తప్పదు. మనము అన్యదేవతలను పూజింపకపోయినను ఇశ్రాయేలీయుల రాజువలె ననేకులు సాతానుని ఆలయమందు అర్చనలు చేయుచున్నారు. CChTel 477.1

    విజ్ఞానము విద్య ప్రభావము క్రింద అది నాజూకయిన, ఆకర్షణీయమైన రూపమును ధరించినను అన్య విగ్రహారాధన స్వభావము నేడు హెచ్చరిల్లుచున్నది. నిశ్చయమైన ప్రవచన వాక్యమందలి విశ్వాసము దిన దినము క్షీణించుచున్నది. దాని స్థానమున మూక విశ్వాసము, సాతాను సంబంధమగు మంత్రశక్తి మానవుల మనస్సుల నాకర్షించుచున్నవి. లేఖనమును పట్టుదలతో పరిశోదించి ఆ నిర్దుష్ట ప్రమాణమునకు తమ కోర్కెలను జీవితోద్దేశములను లొంగునట్లు చేయు వారందరు, తన చిత్తము నిమిత్తము దేవునికి ప్రార్థించని వారందరు మంచి మార్గము నుండి తొలగి తప్పక సాతానుని మోసమునకు గురియగుదురు. CChTel 477.2

    నిజమయిన దేవుని గూర్చిన జ్ఞానము హెబ్రీయులకే యియ్యబడును. ఇశ్రాయేలు రాజు అన్యమత దేవత కడకు సేవకుల నంపుట ద్వారా భూమ్యాకాశములను సృజించిన దేవునియందుకంటే తమ దేవుండ్లయందే తనకెక్కువ నమ్మకమున్నదని అన్యులకు వ్యక్తమొనరించెను. అట్లే బలమునకు, జ్ఞానమునకు, నిధిjైున దేవుని విడచి సహాయ సదుపాయముల కొరకు చీకటి సంబంధమయిన శక్తులనాశ్రయించినపుడు దైవ వాక్య జ్ఞానము మాకున్నదని చెప్పుకొనువారు ఆయనను అగౌరపరచుచున్నారు. దుర్మార్గుడు విగ్రహారాధికుడనైన రాజు అవలబించిన మార్గము విషయము దేవుని కంత కోపము కలిగినపుడు తన సేవకుల మని చెప్పుకోను వారట్టి మార్గమును అవలబించినచో ఆయన ఏమనుకొనును ?35T 191,192,196;CChTel 477.3