Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రీస్తు సాతానుల మధ్య మహా సంఘర్షణా దర్శనము

    అమెరికా ప్రాచ్యభాగమునందలి ఒక పల్లెలోని చిన్న పాఠశాల, 1858 సంవత్సరము మార్చి నెల మధ్య భాగములో ఒక ఆదివారము మధ్యాహ్నము కూటమునకు హాజరైన , స్త్రీ పురుషులతో క్రిక్కరిసి యుoడెను. ఎల్డర్ జేమ్సు వైట్ గారు ఒక యువకుని భూస్థాపన కార్యక్రమము జరిపిoచుచు ప్రసంగించిరి ఆయన మాటలాడిన పిదప శ్రీమతి ఇ. జి. వైటమ్మగారు దుఃఖించు వారికీ. కొన్ని మాటలు చెప్పవలయునని తలంచేను. ఆమె లేచి ఒకటి రెండు నిమిషఘులు మాట్లాడిని పిదప కొoతతడవు ఆగెను. ఆమె యింక ఏమి చేప్పునోయని ప్రజలు అర్రులు సాచుకొని యునారు. “దేవునికి మహిమ,దేవునికి మహిమ” అని ముమ్మారు పలుకబడిన మాట విని వారు ఆశ్చర్యచకితులయ్యిరి. శ్రీమతి వైటమ్మగారు దర్శనమందున్నారు. CChTel 16.1

    వైటమ్మ గారికి ఇయ్యబడిన దర్శనములను గూర్చి ఎల్డర్ వైటుగారు ప్రజలకు చెప్పిరి. ఆమెకు పదిహేడు సంవత్సరముల ప్రాయము ను౦డి దర్శనములు వచ్చుచున్నవిని ఆయన వారికి ఎరుక పరచెను ఆమె కండ్లు తెరువబడి దూరముగానున్న ఒక వస్తువును చూచుచున్నట్ల గపడినను పరిసరములను గూర్చి దేహజ్ఞప్తి లేనిదై ఆమె చుట్టును జరుగుచున్న సంగతులను గూర్చి ఏమియు ఎరుగదని వారికి స్పష్ట పరచెను. సంఖ్యా కాండము 24:4,16 వచనమూలలోని ఈ దిగువ మాటలను చదివెను. “దేవవాక్కులను వినినవాని వార్త. మహోన్నతుని విద్య నెరిగివవాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను.”CChTel 16.2

    దర్శనమందున్నప్పుడు ఆమె గాలి పీల్చుకొనలేదని ప్రలకు విశదముచేసి, దాని. 10:17 తీసి దర్శనమందున్నప్పుడు ధానియేలు అనుభవమును వారికిట్లు చదివి చెప్పెను. CChTel 16.3

    “నా బలము తొలగిపోయెను,ఊపిరి పిడువకయున్నాన” ని ఆయన చెప్పెను. దర్శనమండుండగా శ్రీమతి వైటమ్మగారిని పరీక్షించుటకు ఇష్టమున్నవారు ముందుకు రావచ్చునని ఎల్డర్ వైట్ గారు ఆహ్వనించిరి. అఅట్టి పరిక్ష చేయుటకు ఆయన ఎల్లప్పుడును వారికి అవకాశమిచ్చెను. దర్శనమందున్నపుడు ఆమెను ఒక వైద్యుడు పరీక్షించుటకుకూడ ఆయన సమ్మతించెను. CChTel 16.4

    ప్రజలు దగ్గరకు వచ్చి చూడగా వైటమ్మ గారు ఊపిరి విడుచుటలేదనియు, అయి నను ఆమె గుండె స్వాభావికముగా కొట్టుకొనుచున్నదినియు ,-బుగ్గల రంగు యధావిధిగా నున్నదనియు వారు తెలిసికొనిరి. వారు అద్దము తెచ్చి దానిని ఆమె ముఖము ఎదుట పెట్టిరి. కాని దాని మీద అవిరి ఏర్పడలేదు. పిదప వారు ఒక క్రొవ్వువత్తి తెచ్చి దానిని వెలిగించి ఆమె ముక్కునకు నోటికిని దగ్గర పెట్టిరి. ఆ దీపకళిక ని-శ్చలముగా నుండుట వలన ప్రజలు ఆమె ఊపిరి విడుచుటలేదని గ్రహించిరి. ఆమె గదియందు ఇటునటు సంచరించి చేతులతో చక్కగా అభినయములు చేయుచు తనకు ప్రత్యక్షపర్చబడిన దానినిగూర్చి ఆశ్చర్యార్ధకవచనములను పలికెను. దానియేలుకువలె ముందు ఆమెకు స్వాభావికమైన బలము తొలగెను. పిమ్మట ఆమెకు మానవాతీతమైన బలము అనుగ్రహింపబడెను. దాని యేలు 10:7,8,18,19 చూడండి. CChTel 17.1

    రెండు గంటలకు శ్రీమతి వైటమ్మ గారు దర్శనమందుండిరి ఆ రెండు గంటలు ఆమెకు శ్వాసక్రియలేదు. దర్శనము ఫూరికాగా ఆమె దిర్ఘశ్వాసము గొని ఒక నిము సము ఆగి మరల ఊపిరి పిల్చుకొన నారంభించెను. అచిరకాలములో పరిసరములను గుర్తించి తన చుట్టుపట్టుల జరుగుచున్న సంగతులను గ్రహించగలిగెను. CChTel 17.2

    శ్రీ మతి మార్తా ఆమడన్ తరచుగా వైటమ్మగారు దర్శనములో నుండుట చూచి ఝా దిగువ వివరము లిచ్చుచున్నది:CChTel 17.3

    “దర్శనమందామె కండ్లు తెరువబడియుండును. ఆమె ఊపిరి విడువదు. కాని తాను చూచిన దానిని వ్యక్తముచేయుటకామె బుజములు, చేతులు,చక్కగా అభినయములు చేయును. ఆమె చేతులను,భుజములను కదుపుట ఎవరికిని సాధ్యముకాదు. తరచు ఆమె విడిమాటలను కొన్నిసార్లు పరలొకముగూర్చి గాని భులొకమునుగూర్చి గాని తనకు కలుగుచున్న దర్శనభావమును తన చుట్టునున్నవారికి వ్యక్తము చేయుచున్నట్లు కొన్ని వాక్యములను పలుకును. CChTel 17.4

    “దర్శనమందామె పలుకు మొదటి మాట ‘మహిమ’ ఈ మాటయొక్క ఉచ్చా రణ బిగ్గరగా ప్రారంభమై హీనస్వరముతో అoతమగును. కొన్నిసార్లిది పదే పదే ఉచ్చరించ బడును.. .. .. .. .. .. .. . CChTel 17.5

    “దర్శనము కలుగుచున్నపుదు ఆమె చుట్టు నున్న వారిలో సంభ్రమము లేదు. భయకరణమేమియు లేదు. అది ఒక గంభీర నిశబ్ద దృశ్యము. .. .. .. .. CChTel 18.1

    “దర్శనము ముగుసిన పిదప పరలోకమునుండి భూమిపైకి పరలోక ప్రకాశము వచ్చు తరి ఆమెకు కాన్పించక,ఒక దీర్ఘ నిశ్వాసము విడిచి ,స్వాభావికముగా గాలి పిల్చుకొననారంభించుచు ,', చీ-క-టి',యని పలుకును. అప్పుడామె కొంతతడవు నిరసముగ నుండి కదల జాలకుండును.”CChTel 18.2

    పాఠశాలలో రెండు గంటల షేపు ఇయ్యబడిన దర్సన వృత్తాంతమును మానమిప్పుడు పూర్తి చేయుదము. ఈ దర్శనమునుగూర్చి వైటమ్మ గారు తరువాత ఇట్లు వ్రాసిరి:CChTel 18.3

    “క్రీస్తు సైతనుకును యుగముల తరబడి జరుగుచున్న పోరాటమును గూర్చి పది సంవత్సరమూల క్రితము నేను చూచిన విషయములలో నెక్కువ భాగము మరల చూపబడినవి. అది వ్రాయవలసినదిగా నేను ఉపదేశించబదడితిని.”CChTel 18.4

    దర్శనమందు తన ముందు చూపబడుచున్న దృశ్యములను కండ్లార చూచుచున్నట్లు ఆమెకు అనిపించెను. ముందు తను పరలోకమండున్నట్లనిపించెను. ఆమెకు పాపమును , లూసి ఫరు పతనము చూచెను. పిదప లోక సృష్టి ని మొదటి తల్లిదండ్రులను ఏదేను గృహమును తిలకించెను. సర్పముయొక్క శోధనకు లొంగి తమ ఏదేను గృహము నుండి వారు బహిష్కరించ బడుట ఆమె చూచెను. బైబిలు చరిత్రా ఘట్టములు వరసుగా ఆమెకు కనపర్చబడెను. ఇశ్రాయేలీయుల యొక్క పితరులు ప్రవక్తల అనుభవము నామె చూచెను. రక్షకుడగు యేసు క్రీస్తు జీవితమును , మరణమును ఆయన ఆరోహణ మును ,అప్పటి నుండి ఆయన ప్రధాన యాజకుడుగా చేయుచున్న సేవను ఆమె చూచెను. తదనంతరము సువార్త ప్రకటించుటకు శిష్యులు భూదిగంతములకు వెళ్ళుట ఆమె చూసును. అచిర కాలములో శర వేగముతో సందిల్లిన మత భ్రష్టతను ఆమీదుట చీకటి యుగములను ఆమె చూచెను. పిదప దర్సనమందామె సంఘసంస్కరణోద్యమమును ప్రాణములు నొడ్డి సత్యము కొరకు నిలబడి స్త్రీ పురుషులను చూచెను. 1844 లో ప్రారంభమైన తీర్పు దృశ్యమును ,మన తీర్పు ను ఆమెకు చూపబడెను. ఆ మీదట ఆమెకు అనాగతము ఎరుకపర్చబడెను. మేఘారూడుడై క్రీస్తు వచ్చుటను ఆమె చూచెను. వెయ్యేండ్ల పరిపాలన దృశ్యములను నూతన భూమిని ఆమె చూచెను. CChTel 18.5

    ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత శ్రీమతి వైటమ్మ గారు దర్శనమందు తాను చూచినవి ,విన్నవి వ్రాయుటకు ఉపక్రమించెను. దాదాపు ఆరు మాసములు అనoతరము 219 పుటులుగల గ్రంధము “ది గ్రేట్ కాంట్రవర్సీ ” (“క్రీస్తు ఆయన దూతలు సైతాను అతని దుతహల మధ్య మహా సంఘర్షణ ”)అను నామముతో ప్రచురించ బడినడి. CChTel 18.6

    ఈ చిన్ని పుస్తకమును అందరు ఆసతో పఠిoచిరి. కారణమేమనగా,సంఘమునకు రానున్న అనుభవమును సుస్పష్టముగా చిత్రించి సాతాను పన్ను గడలను ,ప్రపంచాంతిమ సంఘర్షణలో సంఘమునకు ప్రంచమును తప్పు త్రోవ పట్టించుటకు అతడు సల్పు కృషిని ఆ గ్రంథము బయలు పరచినది. తన వాగ్దానము ప్రకారము ప్రవచన సారము ద్వారా ఈ అంత్య దినములలో దేవుడు తమతో మాట్లాడుచున్నందుకు ఎడ్వటిస్ట్టు లు చాల కృతజ్ఞులు. CChTel 19.1

    “స్పిరిచ్యుయల్ గిఫ్ ట్స్ ”అను ఈ చిన్న పుస్తకమందు క్లుప్తముగా చర్చించ బడిన మహా సంఘర్షణా వృత్తాంతము “ఎర్లి రైటింగ్స్” అను గ్రంథము ఆకరి పునర్ముదరించ బడెను. నేడు మనము దీనిని పై గ్రంథమును చూడగలము. CChTel 19.2

    కాలక్రమేనా సంఘము వృద్ధియగు కొలది మహా సంఘర్షణా వ్రుథన్థమును ప్రభువు అనేక తరువాతి దర్శనములలో సవివరముగా ఎరుక. పరచెను దానిని శ్రీమతి వైటమ్మ గారు 1870,1884 సంవత్సరముల మధ్య “స్పిరిట్ ఆఫ్ ప్రొఫసీ” అను నామముతో నాలుగు సంపుటములలో తిరిగి వ్రాసిరి. “స్టొరీ ఆఫ్ రిడెంప్షన్” అను గ్రంథము ఈ పుస్తకములయందలి మహా సంఘర్షణా చరితముయొక్క ప్రముక ఘట్టములను వ్యక్త పరచుచున్నది. అనేక భాషలలో ముద్రించ బడిన ఎ గ్రంథము మహా సంఘర్షణా దర్శనములలో ప్రత్యక్షపర్చ బడిన విషయములను ప్రజలకు అంద జేయుచున్నది. పిదప “కాన్ఫ్లి ఫ్లి క్ట్ ఆఫ్ ఏజస్” సిరిస్ -అనగా “పేట్రియార్క్స్ అండ్ ప్రొఫెట్స్” “పోఫెట్స్ అండ్ కింగ్స్” “డిజైర్ ఆఫ్ డి అపాస్టల్స్” “డి గ్రేట్ కాంట్రవర్సీ”--లోని యదు సంపుటములలో మహా సంఘర్షణా సవివరముగా సంధాన పర్చబడినది. CChTel 19.3

    సృష్టిలగాయతు లోకాంతము వరకు గల బైబిలు వృత్తాంతమును విపులీకరించు ఈ గ్రంథములు మనకు గొప్ప వెలుగును ప్రోత్సాహమును ఇచ్చుచున్నవి. సేవెంతుడే ఎడ్వతటిస్టుల కు ఈ గ్రంథములు “వెలుగు సబంధులు పగటి సంబంధులు” నై యుండుటకు తోడ్పడుచున్నవి. ఈ యనుభుతియండు ఈ దిగువ వాగ్దత్తము నెరవేరినట్లు మనము చుచున్నాము :CChTel 19.4

    తన “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలు పరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు చేయడు.” ఆమోసు 3:7. CChTel 20.1

    ఈ గ్రంధములలో కూర్చిన మహా సంఘర్షణ వ్రుత్తన్తమునకు సంబంధించిన వెలుగు వచ్చిన విధమును గూర్చి వ్రాయుచు శ్రీమతి వైటమ్మ గారిట్లను చున్నారు:CChTel 20.2

    “ఈ గ్రంధకర్తకు పరిసుద్దాత్ముని వెలుగుద్వారా మంచి చెడ్డల మధ్య దీర్ఘ కాలము నుండి జరుగుచున్న సంఘర్షణా ద్రుస్యములు ప్రత్యక్షపర్చబడెను. అప్పుడప్పుడు ఆయకాలములయందు జీవనాదుడును రక్షణ కర్తయునైన క్రీస్తు కును ,దుర్మార్గమునకు నాదుడును ,పాపమునకు కర్తయు దైవ ధర్మ శాస్త్రము అతిక్రమించిన వారిలో స్రధముడును అగు సైతానుకును మధ్య జరుగుచున్న మహా సంఘర్షణను చూచుటకు నాకు అవకాశ మీయబడెనుCChTel 20.3

    “తన వాక్యమందలి మహత్తరసత్యములను, భుతభవిష్యద్రుస్యములను దేవుని యాత్మ నాకు ఎరుక పరచి నాకు ప్రత్యక్షపర్చబడిన దానిని గూర్చి ఇతరులకు తెలియజేయుటకు గడిచిన యుగాములలోని సంఘర్షణచరిత్రను రచించవలెననియు ముఖ్యముగా అతి త్వరలో రానైయున్న విపత్తును గూర్చి వెలుగునీయవలెననియు అజ్ఞాపించెను.”CChTel 20.4