Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మత్తు కలిగించు ద్రాక్షారసము

    మత్తు పుట్టించు ద్రాక్షారసము వాడుకను పరిశుద్ధ గ్రంథమెచ్చటను అనుమతించుట లేదు. కానాలోని వివాహవిందులో క్రీస్తు చేసిన ద్రాక్షారసము ద్రాక్ష పండ్ల నుండి తీయబడిన స్వచ్ఛమయిన రసము. “ద్రాక్షగెలలో క్రొత్తరసము” ఇదే. దీనిని గూర్చియే లేఖనములు “అది దీవెన కరమైనది దానిని కొట్టివేయకుము” అని చెప్పుచున్నవి. యెషమా 65:8. CChTel 437.1

    ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును. మద్యము అల్లరిపుట్టించును. దాని వశమైన వారందరు జ్ఞానములేనివారు”. CChTel 437.2

    “అది బహు మంచిని విశ్వాస ఘాతుకులను చేయును. ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి చింత? ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి? ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదాÑ కలిపిన ద్రాక్షా రసము రుచి చూడ చేరువారికే గదా. ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తళ తళలాడు చుండగను త్రాగుటకు రుచిగా నుండగను దాని వైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును. కట్ట పాము వలె కాటు వేయును.” సామెతలు 20:1Ñ 23:29`32.”CChTel 437.3

    మత్తిల్లజేయు మద్యమును పానమును చేయు మానవుని అవినీతిని, దాస్యమును గూర్చి యే మానవుడు ఇంతకన్న సుస్పష్టమగు పటమును చిత్రించి యుండలేదు. అతడు నికృష్టమగు స్థితియందుండును. తన దుస్థితిని గూర్చిన జ్ఞానమున్నను ఆ ఉరిని త్రెంచుకొనుట కతనికి శక్తియుండదు. అతడు మరల దాని వెదక”ను. సామెతలు 23:35:CChTel 437.4

    ఇతర మత్తు పదార్థములందు వలె ద్రాక్షరసము, బీరు, రమ్ములయందు కూడ మత్తు ఉంచు గుణము కలదు. వీనిని వాడుట ద్వారా ఎక్కు మత్తును కలిగించు మధ్యమును పానము చేయవలెనను ఇచ్ఛ జనించును. ఇట్లు సారా అలవాటు స్థిరపడును. ముందు తగు మాత్రము త్రాగుటయను పాఠంలో త్రాగుబోతులు తయారగుచున్నారు. ఉద్రేక పదార్థముల పని నిగూడమయినది. అందలి యపాయమును గుర్తించకముందే యాతనికి త్రాగుడు అలవడును. CChTel 437.5

    మత్తు పదార్థముల వలన త్రాగుబోతుకు కలుగు నష్టమును గూర్చి వివాదము అవసరము లేదు. ఎక్కడ చూచినను వంచిత కుటుంబములే; కుటుంబ విచ్చేదనలే. ఈ యాత్మల కొరకు క్రీస్తు మరణించెను. వీరిని గూర్చి దేవదూతలు దు:ఖించెదరు. మన మింతగా కానియాడుచున్న సంస్కృతికి వీరు కళంకము నాపాదించు చున్నారు. ప్రతి దేశములోను వీరు సిగ్గును, శాపమును, అపాయమును కలిగించు చున్నారు. 7MH 330-333;CChTel 438.1