Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యయము 36 - కుటుంబ ఆర్ధిక వ్యవస్థ

    తన ప్రజలు ఆలోచన పరులు, జాగరూకులునై యుండవలెనని ప్రభువు కోరుచున్నాడు. వారు ప్రతి విషయమందును పొదుపు కలిగి దేనిని వ్యర్ధము చేయకుండ వలెనని ఆయన వాంఛ. CChTel 310.1

    ఎప్పుడు దాయవలేనో ఎప్పుడు ఖర్చు చేయవలెనో మీరు నేర్చుకొన వలెను. స్వార్ధమును పేక్షించి సిలువును పైకెత్తకున్నచో మనము క్రీస్తు ననుచరులము. మనము ఇతరులకు ఋణపడ జీవించ వలెను. పొదుపు నలవడుడి. ప్రతి చిన్న వ్యయములోను జాగ్రత్తగా నుండి యెంత నిల్వ చేయగలరో చూడుడి. స్వతృప్తి కొరకు వ్యయించ బడిన చిన్న చిన్న మొత్తములను మీరు లెక్క చేయ వలెను. స్వభిరుచుల కొరకు వెచ్చించబడు ధనము అత్యవసరమైన కుటుంబ సౌఖ్యముల కొరకు ,వసతుల కొరకు వినియోగించబడ వచ్చును. మీరు లోభులు కారాదు. మీరు మీ యెడల మీ సహోదరుల యెడల నమ్మకముగా నుండవలెను. దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన వానిని దుర్వినియోగ పరచుటయే లోభత్వము. దుర్వ్సయము కుడా దిర్వినియోగమే. లెక్కింపరానిదిగా మీరు పరిగనించు చిన్న ఖర్చులే తుదకు పెద్ద వియగును. CChTel 310.2

    వినోద వస్తువులకొరకు ద్రవ్యమును ఖర్చుచేయ వలెనను శోధనవచ్చినపుడు ప్రతి మానవుని రక్షించుటకు క్రీస్తుచేసిన ఆత్మార్పణను ,చూపిన అత్మోపేక్షను జ్ఞాపకముచేసికొనుడి. అత్మోపెక్ష ,ఆత్మ నిగ్రహము కలిగి యుండునట్లు మన పిల్లలు శిక్షణ పొందవలెను. ఆశలను, అభిరుచులను,ఆసక్తులను నిగ్రహించక పోవుటయే చాల మంది భోధకుల ఆర్ధిక దురవస్థలకు కారణము. అనేకులు దివాలా తీసి ద్రవ్యమును అపహరించుటకు ,వారి యొక్కయు బిడ్డలా యోక్కయో దుర్వ్యసనములను తిర్పజూచుటయే కారణము. కనుక తల్లి దండ్రులు ఉపదేశ ఆదర్శముల ద్వారా తమ బిడ్డలకు మితవ్యయము నేర్పుటలో నెంత జాగ్రత్తగా నుండ వలెను !CChTel 310.3

    ధనికినివలె నటించుట లేక మన స్థితికన్నా ---అనగా సాత్వికము అణుకువ గల రక్షకుని అనుచరుల మనుటకన్న ---అధికులముగా నటించుట మంచిది కాదు. మనము కట్టకూడని విధముగ మన పొరుగు వారు గృహములను కట్టుకొని వానిని ఉపకరణములతో నింపుట చూచి మనము వ్యసనపడరాదు. మన స్వకీయెచ్చలను తిర్చుకోనుటకు ,అతిధులను సంతోష పరచుటకు మనము చేయు స్వార్ధపూరిత చర్యలను యేసు ఎట్లు పరిగణించ వలెను !మనము గాని మన ఆధీన మందున్న పిల్లలు గాని దాంబికముగా నుండుట యనునది మనకొక వురియై యున్నది. 1 AH 379-384;CChTel 311.1

    ఉపయోగించ వీలున్న దానిని పారవేయరాదు. దీనికి వివేకము,దీర్ఘలోచన అప్రమత్తత. అవసరము తక్కువ దానిలో నిల్వ చేయజాలకుండుటయే అనేక కుటుంబములు జీవితావసర విషయములు నిమిత్తము బాధపడుటకు హేతువని నాకు వ్యక్తము చేయబడినది. 2CG 135; CChTel 311.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents