Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 32 - తల్లి, తన పిల్లలు

    కేవలం గృహకృత్యములలో నిమగ్నురాలై యుండుటకు బదులు చదువుటకు, జ్ఞానము సంపాదించుటకు, తన భర్తకు స్నేహితురాలై యుండుటకు, పెరుగుచున్న తన బిడ్డలతో స్నేహించుటకు తల్లి యెక్కువ సమయము గడపవలెను. ఉన్నత జీవితము కొరకు తన ప్రియులను నడుపుటకు తన కిప్పుడున్న అవకాశములను ఆమె తెలివితేటలతో వినియోగించుకొనవలెను. ప్రియరక్షకుడు ఒక అనుదిన స్నేహితుడుగను సుపరిచిత మిత్రమగను ఉండునట్లు చేయుటకామె ఎక్కువ సమయమును గడుపవలెను. ఆయన వాక్యము పఠించి ఆమె తన పిల్లలతో కలిసి పంట పొలములోనికి వెళ్లి దేవుని సుందర సృష్టి కార్యముల నుండి ఆయనను గూర్చి వారితో కలిసి నేర్చుకొనవలెను. CChTel 288.1

    ఆమె సంతోషము ఉద్రేకము కలిగి యుండవలెను. ప్రతి నిమిషమును కుట్టుపనికి వినియోగించుటకు బదులు సాయంకాలమును ఒక ఆనందదాయకమగు సమయముగను, దినకృత్యముల అనంతరము కుటుంబ పునస్సంయోగ సమయముగను చేయుట మంచిది. ఇట్లు చేసినచో అనేకులు క్లబ్బులకు, వినోద గృహములకు, పోవుటకు బదులు తమ కుటుంబ సాంగత్యమును ఎన్నుకొనెదరు. చాలామంది బాలురు వీధులలోను దుకాణముల ప్రక్కను తిరుగుట మానెదరు. చాలా మంది బాలికలు దుస్సాంగత్యము నుండి రక్షించబడగలరు. తల్లిదండ్రులకు, పిల్లలకు గృహ ప్రధానము దేవుడు సంకల్పించిన విధముగా జీవితాంతము వరకు ఆశీర్వాదముగ నుండును. CChTel 288.2

    “భార్యకు స్వతంత్రబుద్ది లేదా?” యను ప్రశ్న తరచుగా వేయబడుచున్నది. భర్త కుటుంభాధిపతియని బైబిలు స్పష్టముగా చెప్పుచున్నది. “స్త్రీలారా.. . మీ స్వపురుషులకు లోబడియుండుడి”. ఈ సలహా దీనితో అంతమొందిన పక్షమున స్త్రీల స్థితి ఆసించతగినది కాకుండును. కాని యిదే సలహాను అంతమొందిన పక్షమున స్త్రీల స్థితి ఆసించతగినది కాకుండును. కాని యిదే సలహాను ఇట్లు చదువగలము: “ప్రభువునకు వలె”. CChTel 288.3

    మనము దైవాత్మను కలిగి యుండవలెను. లేనిచో గృహమునందు ఐక్యముండదు. భార్యకు క్రీస్తు వంటి స్వభావమున్నచో తాను పలుకు మాటలయందు ఆమె జాగ్రత్తగా నుండును. తన స్వభావమును ఆమె అదుపు చేసికొనును. ఆమె లొంగి యుండును. అయినను తాను తన భర్తకు దాసి యని తలంచక అతనికి స్నేహితురాలనని తలంచును. భర్త దైవ సేవకుడైనచో తన భార్యపై అధికారము చెలాయించడు. అతడు కఠినముగను కరకుగను ప్రవర్తించడుÑ విచారములు బాధలు ఉన్న కుటుంబములో ప్రేమ వృద్ధికాదు. దైవాత్మ గల కుటుంబము భూతల స్వర్గము. ఒక వ్యక్తి తప్పిదము చేసినచో తక్కిన వ్యక్తి క్రీస్తు యొక్క దీర్ఘ శాంతమును చూపును గాని ఆ వ్యక్తి పట్ల విముఖత్వము చూపడు. 1AH 110-118;CChTel 288.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents