Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 20 - సంఘమునకు సాక్ష్యములు

    అంతము సమీపించు కొలది లోకమునకు అంతిమ హెచ్చరిక నందించు పని వృద్ధియగుకొలది దయామయుడగు దేవుడు మూడవ దూత వర్తమానముతో జతపరచిన సాక్ష్యముల స్వభావ, ప్రభావములను ప్రస్తుత కాల సత్యము నంగీకరించు వారు సుస్పష్టముగా గ్రహింపవలసిన ఆవశ్యకత అధికమగు చున్నది. CChTel 204.1

    పూర్వకాలమందు దేవుడు ప్రవక్తలద్వారా ప్రజలతో మాటలాడెను. ఈ దినములలో ఆన వారితో తన ఆత్మయిచ్చు సాక్ష్యములద్వారా మాట్లాడుచున్నాడు. తన చిత్తమును గూర్చియు తన ప్రజలకు దేవుడు ముంద్నెడును ఇంత పట్టుదలగా ఉపదేశమీయలేదు. సెవెంతుడే ఎడ్వంటిస్టులలో అపరాధులకు హెచ్చరికలు, గద్దింపులు ఈబడుటకు కారణము వారు నామ మాత్ర సంఘములకు చెందు క్రైస్తవులకన్న నిందార్హులని కాదు.. . వారి హృదములందు దేవుని దర్మశాస్త్రము వ్రాయబడియున్నది. కనుక వారికి ఎక్కువ వెలుగున్నది. అంతిఏకాక వారు తమ విశ్వాసమునుబట్టి దేవుని ప్రత్యేక జనాంగమును ఎన్నుకొనబడిన ప్రజానీకముగను రూపొందిరి. CChTel 204.2

    ఆయా వ్యక్తుల కొరకు నాకీయబడిన వర్తమానములనుతరుచుగా నేను అనేక సందర్భములలో వారి కోరికపై వ్రాసెడిదానను. నా కర్తవ్యము విస్తృతమయిన కొలది ఇది నా కార్యకలాపములలో నొక ప్రాముఖ్యమైన భారభరితమైన భాగమాయెను. CChTel 204.3

    సుమారు ఇరువది సంవత్సరముల క్రిందట (1871) నా కీయబడిన దర్శనమందు మాటలాడుటలోను, వ్రాయుటలోను సామాన్య సూత్రముల రూపొందించి అందరికి హెచ్చరిక, గద్దింపు, సలహా గలుగుటకు గాను అపాయములను, తప్పిదములను, కొందరి పాపములను ప్రత్యేకముగా పేర్కొన వలెనని నేను ఆదేశింప బడితిని. ఇతరులు చేసిన పొరపాట్లనే తాము కూడ చేసితిరేమో!, ఇతరులకీయబడిన హెచ్చరికలు తమకు కూడ వర్తించునేమో! తెలసి కొనుటకు అందరును ఆత్మ పరీక్ష చేసికొన వలెనని నేను చూచితిని. అట్లు అయి నచో ఈ హితవు, గద్దింపులు ప్రత్యేకముగా తమకే ఇవ్వబడినవని గ్రహించి వీనిని ఆచరణలో పెట్టవలెను. CChTel 204.4

    క్రీస్తు అనుచరుల మని చెప్పుకొను వారి విశ్వాసమును పరీక్షించుట దేవుని సంకల్పము, తమ బాధ్యతను గ్రహింప వలెనని మనశ్శుద్దితో కాంక్షించు వారి నిజాయితీని ఆన పరీక్షించును. వారి ధర్మము నాన స్పష్టపరచును. ఎల్లరకు తమతమ హృదయములలో నున్న దానిని వృద్ధిచేసుకొనుటకు తరుణము నిచ్చును. CChTel 205.1

    తన ధర్మశాస్త్రమును కాపాడు చున్నామని చెప్పుకొను వారిని ప్రభువు గద్దించి సంస్కరించును. వారు తనయందు భయము గలిగి సంపూర్ణ పరిశుద్ధతను సాధించుటకుగాను ఆన వారి పాపములను చూపించి వానిని బయలుపరచును. ఏలయనగా వారిని పాపము నుండియు, దుర్మార్గము నుండియు దూరముగా నుంచుటే ఆన ఆ కాంక్ష వారు సంస్కారమును, పరిశుద్ధతను, ఔన్నత్యమును పొంది తుదకు ఆన సింహాసనమును అథిస్ఠించుటకు గాను దేవుడు వారిని గద్దించి, మందలించి సంస్కరించును. 15T 654-662;CChTel 205.2