Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    బేధాభిప్రాయములు తలచూపునపుడు

    తమ వివిధ బాధ్యతల విషయము భార్యభర్తలు ఒక పరిష్కారమునకు వచ్చినను దేవునికి తమ హృదయమును సమర్పించకున్నచో కుటుంబ కష్టనిష్టూరములను సంబాళించుకొనుట కష్టము. తమ కుటుంబ జీవితాసక్తులను వేర్వేరుగా నుంచుకొని భార్యభర్తలు ఒకరియందొకరు బలవత్తరమైన ప్రేమ నెట్లు చూపుకొనగలరు? తమ కుటుంబమునకు సంబంధించిన సమస్తమందును వారేకాభిప్రాయులై యుండవలెను. భార్య క్రైస్తవురాలైనచో తన ఆసక్తిని తన భర్తయందే నిలుపును. ఏలయనగా భర్త గృహనాయకుడుగా నుండవలెను. CChTel 278.4

    నీ స్వభావము తప్పిదమైనది. ఒక నిర్ణయము చేయవలసి వచ్చినప్పుడు నీవు ఆ విషయమును బాగుగ ఆలోచించి నీ దృక్పధములు ఫలితమేమై యుండునో యోచించవు. నీకున్న దృక్పధములు నీ భార్యకు లేవని నీకు తెలిసియు పర్యవసానమును ఆలోచించక నీ ఇష్ట ప్రకారము నీ దృక్ఫధమును గూర్చి ప్రార్థించుచు, చర్చించుచు వానిని సాధింపజూతువు. నీ భార్య ఉద్ధేశములను గౌరవించి దయా పూర్వకంగా మర్యాదస్థునివలె వానిని తొలగించుటకు బదులు నీకు సమ్మతి కుదురని అంశములలోని వివాదమునకు ఆస్కారము గల విషయములను ప్రస్తావించుటకు వెనుదీయక నీ చుట్టునున్న వారిని లెక్కచేయక నీ యుద్దేశ్యములను వెల్లడిరచుటకు పట్టుదల చూపితివి. ఆ విషయముపట్ల నీతో భేదించుటకు ఇతరులకు హక్కులేదని నీవు తలంచితివి. ఇవి క్రైస్తవ వృక్షము ఫలించవలసిన ఫలములు కావు. CChTel 279.1

    నా సహోదరా, సహోదరీ క్రీస్తును చేర్చుకొనుటకు మీ హృదయ ద్వారమును తెరువుడి. ఆత్మాలయములోనికాయ నను ఆహ్వానించుడి. పెండ్లిjైున అందరి జీవితములలోను ప్రవేశించు అవరోధములను అధిగమించుటకు ఒకరినొకరు సహాయము చేసికొనుడి. మీ శత్రువగు సాతానుని జయించుటకు మీరు భయానక సంఘర్షణలమందు పాల్గొనవలెను. ఈ యుద్ధమందు దేవుడు మీకు సహాయము చేయవలెనని కోరినచో జయించుటకు, దుర్భాషలాడకుండ మీ పెదవులను మూసికొనుటకు మీరు ఏకగ్రీవముగా నిర్ణయించుకొనవలెను. ప్రభువా, నా ఆత్మ విరోధిని గద్దించుము అని మోకాళ్ళూని ప్రార్థించవలసిన వచ్చినను ఆ నిర్ణయమును చేయవలెను. CChTel 279.2

    దైవ చిత్తమును నెరవేర్చుచు భార్యభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమా విశ్వాసములతో జీవించెదరు. కుటుంబ శాంతిని ఐకమత్యమును చెరచునదేది తలచూపినను దానిని అణగద్రొక్కవలెను. కనికరము, దీర్ఘశాంతము, ప్రేమ కనపరచువాడు అట్టి వానినే యితరులకడనుండి పొందును. దైవాత్మయున్నచోట వివాహసంబంధమును గూర్చిన భేదాభిప్రాయములతో నొప్పు సంభాషణుండవు. మన మహిమా నిరీక్షణకు హేతువగు క్రీస్తు హృదయమందు నివశించినచో గృహమందు ప్రేమా ఐక్యతలుండును భార్య హృదయమందు నివశించుచున్న క్రీస్తు భర్త హృదయవాసి యగు క్రీస్తుతో నేకీభవించును. ప్రేమించువారి కొరకు క్రీస్తు సిద్ధము చేయ వెళ్ళిన భవనముల కొరకు వారు కలిసికట్టుగా కృషి చేసెదరు. CChTel 279.3

    దేవుని పరిశుద్ధ ఉపదేశముచే కాపాడబడుచున్న ఆచారములలో నొకటిగా వివాహమును పరిగణించువారు వివేచన అదుపాజ్ఞలకు లొంగియుందురు. CChTel 279.4

    పెండ్లియైన కొనదరు స్త్రీ పురుషులు క్రమ శిక్షణలేని అల్లరి పిల్లలవలె ప్రవర్తించెదరు. భర్త ఒక మార్గమును భార్య వేరొక మార్గమును అవలంబింప జూతురు. వారికి సమ్మతి కుదురదు. అట్టి పరిస్థితి గొప్ప విచారమును తెచ్చి పెట్టును. భార్య భర్త లిరువురును ఒకరి విధానములతో నొకరు లేక ఒకరి ఉద్దేషములతో ఒనకురు ఏకీభవించవలెను. వారిరువురును యదేచ్చగా వర్తించ గోరినచో సంతోషమునకు ఆస్కార ముండనేయుండదు. 2AH 118-121; CChTel 280.1

    అన్యోన్య దీర్ఘశాంతము ,ప్రేమ లేకున్నచో నిన్నును ,నీ భర్తను క్రైస్తవ ఐకమత్య మునందుచగల శక్తీని భూలోకమందెచ్చటను లేదు. మీ దంపత్యము సన్నిహితముగను ఉండి దైవ వాక్యనుగుణ్యముగా మీరొకరి నొకరు సర్వస్వమైయుండునట్లు మీ జీవితములలోనికి ఆధ్యాత్మికశక్తిని సంతరించుకొనిడి. దేవుడు కోరు స్థితికి మీరు పరలోకమునకు భూమిపై చూచెదరు. మీ జీవితమునందు దేవుని కనుగొందురు. CChTel 280.2

    నా ప్రియ సహోదరా,సహోదరి,దేవుడు ప్రేమా స్వరుపియనియు మీరొకరినొకరు సంతోషపరచుటలో ఆయన కృపద్వారా జయము పొందగలరనియు జ్ఞాపకముంచుకొనుడి. మీ వివాహ ప్రమాణము అట్లు చేసెదమని మీరు వాగ్దానము చేసిరి. 3AH 112;CChTel 280.3

    క్రీస్తు కృపద్వారా మీరు మిమ్మును,మీ స్వార్దమును జయిశీచగలరు. ఆయన వలే జీవించు ప్రతి కార్యమందును ఆత్మార్పణను ప్రదర్శించుచు సహాయము అవసరమై న వారికి నిత్యమూ సానుభూతి చూపుట ద్వారా మీకు జయము పరంపరగా వచ్చును. స్వార్దమును జయిశీచి మీ ప్రవర్తన యందలి బలహీనతలను సరిచేసికొనుట యెట్లో దినదినము మీరు నేర్చుకోనగలరు. ఆయన చిత్తమునకు మీ చిత్తము లొంగియుండును. గనుక యేసు ప్రభువు మీకు వెలుగు ,బలము ,ఆనందకిరీటమునై యుండును. 47T 49. CChTel 280.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents