Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దుర్వర్తనము

    హృదయములను అలక్ష్యభావముతో చూచుట దేవుని దృష్టిలో స్వల్పాపరాధముగా నెంచబడదు. అయినను కొందరు యువతులపై నిష్టము చూపి వారి ప్రేమలను చూరగొని ఆ మీదట తమ దారిని తాము పోయి చేసిన బాసలను వాని పర్యవసానములను విస్మరించెదరు. వారిని క్రొత్త ముఖము ఆకర్షించును. మరల అవే బాసలు చేసి అదే ఆసిక్తిని మరియొకరి యందు చూపెదరు. CChTel 261.1

    వివాహమైన పిదప కూడా ఈ నైజము తలచూపును. వివాహము అన్ని సందర్భములలోను చంచల మనస్సుకు నిలకడను, సంకోచించు మనస్సుకు స్థిరబుద్ధిని చేకూర్చి నియమమునకు కట్టుబడునట్లు చేయజాలదు. ఏకరీత్య జీవితమునందు వారికి విసుగు పుట్టును. నీచాలోచనలె ఉత్పన్నమై నీచకార్యములు సంధిల్లును. తమ్మును నీతి మార్గమునుండి సాతానుడు తప్పింప జాలకుండునట్లు యువజనులు తమ మనస్సుల యొక్క నడుములను బిగించి తమ ప్రవర్తన విషయము జాగరితులై యుండుట యెంతయో ప్రాముఖ్యము. CChTel 261.2

    ఒక యువకుడు ఒక యువతితో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండ స్నేహము చేసి ఆమె ప్రేమను చూరలాడినచో అతడు ఆమె యెడల, ఆమె తల్లిదండ్రుల యెడల సత్ క్రైస్తవ ధర్మమును నెరవేర్చుటలేదు. రహస్య ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా సమావేశముల ద్వారాను ఆమె నతడు వశపరుచుకొనవచ్చును. కాని యట్లు చేయుట ద్వారా దేవుని ప్రతి బిడ్డయు కలిగి యుండవలసిన సౌజన్యమును, నమ్మకమును అతడు కనపరుచుట లేదు. తమ లక్ష్యమును సాధించుటకు వారు గూఢముగాను, బైబిలు ప్రమాణమునకు విరుద్ధము గాను ప్రవర్తించి తమ్మును ప్రేమించి నమ్మకముగా సంరక్షించు వారికి అపనమ్మకముగా నున్నట్లు ఋజువు చేసికొనెదరు. ఈ ఫక్కీలో జరుగు వివాహములు దైవవాక్య సమ్మతములు కావు. ఒకరి కుమార్తెను తవ ధర్మము నుండి తప్పించి అప మార్గమున నడిపించువాడు, తల్లిదండ్రులను సన్మానించి వారికి విధేయత చూపవలెనని చెప్పు దైవ వాక్యమును గూర్చి ఆమెకు తికమకలు కలిగించువాడు, వివాహా విధులకు కట్టుబడియుండువాడు కానేరడు. CChTel 261.3

    దొంగిలకూడదు అని రాతి పలకలమీద దేవుని వ్రేలితో వ్రాయబడెను. అయినను లోపాయకారిగా ప్రేమల విషయము ఎంతగా దొంగతనము జరుగున్నది! అయినను ఇది అలక్ష్యము చేయబడుచున్నది. మోసకరమైన ప్రేమ, రహస్యవుటుత్తరములు సాగుచుం డును. ఇవి తుదకు అనుభవము బొత్తుగా లేని, ఈ విషయముల పర్యవసానము గ్రహించలేని యువతి తన తల్లి దండ్రులపై గల ప్రేమను కొంతమట్టుకు ఉపసంహరించుకొని దానిని ఈతనిపై నిలుపునంతవరకు పోవును. ఈ యువకుడు తానవలంబించిన మార్గమును బట్టి చూడగా ఆమె ప్రేమకపాత్రుడని వ్యక్తపడుచున్నది. ప్రతి విధమైన మోసమును బైబిలు ఖండిరచుచున్నది. CChTel 261.4

    యదార్ధ జీవితములు జీవించుచున్నామని చెప్పుకొను క్రైస్తవులు ఈ విషయమందు భయంకరములైన తప్పిదములు చేయుచున్నారు. ఇతర విషయములలో వివేకముకలవారిగనే వారగపడెదరు. వారి నిర్థిష్ట సంకల్పమును ఏ హేతు వాదమును మార్చజాలదు. మానవాలోచనలు, ఉద్రేకములు వారినెంతో ఆకర్షించును. అందుచే వారు బైబిలును పరిశోధించి దేవునితో సన్నిహిత సంబంధము కలిగి యుండుటకు అభిలాష చూపరు. CChTel 262.1

    పది యాజ్ఞలలో నొకటి అతిక్రమించబడినపుడు అధోగమించుట దాదాపు నిశ్చయమే. స్త్రీ మర్యాదకు సంబంధించిన కట్టడలు ఒకసారి అతిక్రమించబడినపుడు నీచాతినీచమైన దుర్వర్తనలో ఘోరపాపముగా అగపడదు. అయ్యో, స్త్రీ అవినీతి వలీన నేడు ప్రపంచములో నెంత భయంకర ఫలితములు కన్పించుచున్నవి. జారస్త్రీల ఆకర్షణ వలన వేలాది ప్రజలు కారా గృహములలో బంధించబడుచున్నారు. అనేకులు ఆత్మహత్య చేసికొనుచున్నారు. అనేకులు ఇతరుల ఆయుర్ధాయమును తగ్గించుచున్నారు. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను. దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అని తెల్పు వేద వాక్కులెంత వాస్తవములు. !CChTel 262.2

    నిషేదించబడిన భయానక భూభాగమును సమీపించకుండ కాపాడుటకు జీవిత మార్గమునందు అన్ని ప్రక్కల హెచ్చరికా జ్యోతులుంచబడినవి. అయినను అనేకులు హేతువును దైవ ధర్మశాస్త్రమును లెక్కచేయక ఆయనకు విరుద్ధముగా మరణ మార్గమును ఎన్నుకొనుచున్నారు. CChTel 262.3

    శరీరారోగ్యమును, బుద్ధిబలమును, నీతిని కాపాడుకొనదలచువారు యౌవనేచ్ఛలను విసర్జించవలెను. మనమధ్య సాహసోపేతముగా తలచూపుచున్న దుర్మార్గమును విసర్జించుటకు దేవుడు వారిని గౌరవించి వారికి ప్రతిఫలము నిచ్చును. 1AH 43-47,70. 75. CChTel 262.4