Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 21 - బైబిలు గ్రంథము

    పైపైని వెదకు వారికు కనపడని అమూల్య సత్యములు లేఖనములలో వేలకొలది ఉన్నవి. సత్యమును గని ఎన్నడును తరుగనిది. వినయ మనస్సులతో లేఖనములను పరిశోధించు కొలది మీ ఆసక్తి అధికరించి “ఆహా దేవుని బుద్ది జ్ఞానముల CChTel 214.1

    బాహుళ్యము ఎంతో గంభీరము, ఆన తీర్పులు శోధింపనెంతో అశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు” అని మీరు పౌలుతో కలిసి పలికెదరు. (రోమా 11:33)15T 266;CChTel 214.2

    క్రీస్తుకును ఆయన వాక్యమునకును సంపూర్ణ సమైక్యత కలదు. వీనిసంగీకరించి అనుసరించినచో ఆయన వెలుగులోనున్న ప్రకారము తాముకూడ వెలుగులో నడవ నిచ్చగించు వారి పాదములకు నిశ్చితమార్గము నివి తెరచును. దైవ ప్రజలు ఆయన వాక్యమును మన్నంచినచో ఈ భూలోక సంఘమందు మనకు పరలోకము అవతరించును. వాక్యమును పరిశోధించుటకు క్రైస్తవులు ఆత్రముతోను, ఆకలితోను ఉందురు. లేఖనముతో లేఖనమును పోల్చి వాక్యధ్యానము చేయుటకు వారు సమయము కొరకు వేచియుందురు. దినపత్రికలు, వారపత్రికలు, నవలులు మొదలగు వానికటె దైవవాక్యపు వెలుగు కొరకు వారెక్కువ ఆశతో కనిపెట్టెదరు. దేవ కుమారుని మాంసము భుజించి, రక్తమును త్రాగుటకు వారు అఖిలషించెదరు. దీని ఫలముగా వాక్యమందలి వాగ్థత్తములు, నిబంధనల ప్రకారము వారి జీవితములు రూపొందును. వారికి దాని ఉపదేశములు జీవకృక్షపు ఆకులవలె నుండును. నిత్య జీవపు టూటలుగల బాని వలె నది వారియందుండును. ప్రశాంతికరమైన కృపాధారలు వారిని తృప్తిపరచి వారి ఆత్మను పునరుజ్జీవింపజేసి వారి శ్రమను, బడలికను, మరిపింపజేయును. లేఖన వాక్యములు వారికి బలము, ధైర్యములను ప్రసాదించును. 28T 193;CChTel 214.3

    చక్కని శైలి కలిగి వైవిధ్యముతో నొప్పుచున్న బైబిలు గ్రంథమునందు అందరిని ఆకర్షించి, అందరి మనసులను వశపరచుకొను విషయములు కలవు. ఆ పుటలలో నతి ప్రాచీన చరిత్ర కలదు; యధార్థ జీవిత చరితము కలదు; రాజ్యనియంత్రణమునకు నియమములు, గృహనిబంధనలు కలవు. ఈ నియమములతో దీటైన నియమములను మానవు డెన్నడును రూపొందించలేక పోయెను. బైబిలునందు గంభీరమైన తత్వము, కమ్మని, గాఢమైన, విషాద పూరితమైన పద్యకావ్యము కలదు. ఇక నేవిధముగా చూచినను ఏ మానవ గ్రంథకర్త రచనలకన్న బైబిలు రచనలు ఎంతో విలువగలవి. ప్రధానాంశము విషయము చూచినచో దాని విస్తృతి అపాయకరమైనది; దాని విలువ నిర్దేశింపరానిది. ఈ యుద్ధేశ్యము దృష్ట్యా చూచినచో ప్రతి అంశమునకు ఔన్నత్య ప్రాముఖ్యత గోచరించుచున్నది. అతి సులభముగా వ్యక్తము చేయబడిన సత్యముల యందు ఆకాశమంత ఉన్నతములు, నిత్యత్వము నావరించగల విస్తృతిగల సూత్రములు ఇమిడి యున్నవి. 3Ed. 125;CChTel 214.4

    దినదినము లేఖనముల నుండి యేదో యొక క్రొత్త విషయమును మీరు నేర్చుకొనవలెను. దాచబడిన ధనము వెదుకునట్లు వానినన్వేషించుడి. ఏలయనగా వానియందు నిత్యజీవపు మాటలున్నవి. ఈ పరిశుద్ధ లేఖనములను గ్రహింప జ్ఞాననివేచనల కొరకు ప్రార్థించుడి. ఇది చేసినచో మీరు దైవ వాక్యమందు నూతన మహిమలను కనుగొందురు. సత్యము నకు సంబంధించిన అంశములపై నూత్నమైన, అమూల్యమైన వెలుగును పొందినట్లు మీరు గ్రహించెదరు. మీ పరిగణనలో లేఖనములు సర్వదా క్రొత్త వెలుగును పొందును. 45T 266;CChTel 215.1

    అంగీకరించబడిన బైబిలు సత్యములు మనస్సును, లోకవ్యామోహమునుండియు దుర్నీతినుండియు ఉద్దరించు ను. దైవ వాక్యము తగు విధముగా మన్నించబడినచో యువజనులు, వృద్దులు శోధనను ప్రతిఘటించుటకు దోహద మిచ్చు అంతఃప్రేరణ శక్తిని కలిగి యుందురు. 58T 319;CChTel 215.2