Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 3 - దేవుని సంధించుటకు సిద్ధపడుడి

    ప్రభువు ఇంతలో రాడులేయని తలంచరాదని నేను దర్శనమందు చూచితిని. “భూమి పైకి రానున్న దానిని గూర్చి సిద్ధ పడుడి, సిద్ధపడుడి. మీ విశ్వాసమునకు అనుగుణ్యముగా మీ కార్యముల నుండనీయుడి” అని దూత సెలవిచ్చును. మనస్సు దేవునియందు నిలుకడ గలిగి యుండవలెననియు దేవుని గూర్చియు ఆయన సత్యమును గూర్చియు మనర పలుకుబడి సాక్ష్యమీయవలెననియు నేను చూచితిని. ఆషామాసీగను లెక్కలేనట్లుగను నుండుట వలన మనము ప్రభువును ఘనపరచ జాలము. నిరాశ చెందుట ద్వారా ఆయనను మహిమపరచజాలము. స్వరక్షణను సంపాదించుకొని యితరులనుకొని యితరులను రక్షించుటకు మనము ఆత్రుత కలిగి యుండవలెను. ఇదియే అత్యంత ప్రాముఖ్యము కలిగిన విషయము. తక్కినవన్నియు వీని తరువాతనే. CChTel 64.1

    నేను పరలోక సౌందర్యమును చూచితిని. యేసుకు స్తుతి, గౌరవము, మహిమ కలుగునట్లు దూతలు సంతోషగానములు చేయుట నేను వింటిని. దైవ కుమారుని ఆశ్చర్యకరమగు ప్రేమను గూర్చి అప్పుడు నేను కొంత గుర్తించగలిగితిని. పరోలోకమందు తనకున్న మహిమను, గౌరవమును విడిచి మనలను రక్షించుట యందు ఆసక్తుడైమానవులాయనపై మోపిన అవమానమును చూపిన ఉపేక్షను ఓరిమితోను శాంతముతోను ఆయన భరించెను. ఆయన గాయపరచబడెను, మొత్తబడెను, నలుగగొట్టబడెను. కల్వరి సిలువపై ఆయన వ్రేలాడ దీయబడెను. మనలను మరణము నుండి రక్షించుటకు గాను ఆయన అతి వేదనకరమగు మరణము పొందెను. ఆయన రక్తమందు కడుగబడి మనకొరకాయన సిద్ధము చేయుచున్న భవనములలో ఆయనతో కలిసి మనము నివసించుటకును, పరలోక మహిమా తేజస్సులలో నానందించుటకును, దూతగణముల కీర్తనల నాలకించి వారితో కలిసి మనము పాడుటకును ఆయన మరణించెను. CChTel 64.2

    పరలోకమంతయు మనము రక్షించబడుటయందాశ గొనియున్నట్లు నేను చూచితిని. మనము ఈ విషయమై నిర్లక్ష్యముగా నుందమా? మనము రక్షించబడినను నాశనమైనను నిది యేమంత పెద్ద సంగతిగాదని నిరసనగా నుండుట భావ్యమా? మన కొరకు చేయబడిన ప్రాణ త్యాగమును చులకనగా భావించుదమా? ఉచితముగా నీయబడిన కృపను కొందరు లకన చేసిరి. ఆ కారణముగా దైవానుగ్రహము వారిపై పడినది. దేవుని యాత్మ నిత్యమును దుఃఖంచబోదు ఎక్కువసేపు దుఃఖపరచబడినచో ఆత్మ విడిచిపోవును. మానవులను రక్షించుటకు దేవుడు చేయగలిగినదంతయు చేయగా, తమ జీవితముల వలన క్రీస్తు అనుగ్రహించు కృపను చులకన చేయుచున్నట్లు మనుజులు బయలుపరచుచో, వారికి మరణమే శరణ్యము. అది గొప్ప నష్టము అది భయంకర మరణము. ఏలయనగా వారు నిరాకరించిన విమోచనను వారి నిమిత్తము సంపాదించుటకు క్రీస్తు సిలువపై పొందిన వేదనను వారు పొందవలెను. అప్పుడు తాము పోగొట్టుకొన్నది ` నిత్య జీవము, అనంత స్వార్థ్యము, అని వారు గుర్తించగలరు. ఆత్మలను రక్షించుటకు చేయబడిన ఆ గొప్ప సమర్పణ ఆత్మల విలువను మనకు వ్యక్తపరచుచున్నది. ప్రశస్తమగు ఒకసారి తప్పిపోయినచో అది నిత్య నాశనము పొందినట్లే. CChTel 64.3

    దైవ ప్రజల యొక్క, ముఖ్యముగా యువజనుల యొక్క, తలంపులను ఆసక్తిని తూచుటకు త్రాసును చేత పట్టుకొని యొక దేవదూత నిలిచియున్నట్లు నేను చూచితిని. పరలోక విషయమైన తలంపులను ఆశలును కడమ ప్రక్కను పెట్టబడి తూచబడినవి. ఈ వైపున కథల పుస్తకములు, బడాయి, దుస్తుల విషయమైన ఆలోచనలు, అహంకారము మున్నగునవి వేయబడినవి. దేవదూతలు త్రాసుపట్టుకొని నిలబడి ప్రపంచము పట్ల మృతులు, దేవుని పట్ల జీవితులు నగు దేవుని పిల్లలమని చెప్పుకొను వారి తలంపులను తూచుటయును నది ఎంతటి గంభీర ఘడియ! ప్రాపంచికమైన తలంపులతోను, వ్యర్థ విషయములతోను, గర్వముతోను నింపబడినవై ఎంత బరువు తీసివేయబడినప్పటికిని త్వరితముగా క్రిందికి వెళ్ళిపోయెను. పరమువైపునకు తూగు ఆలోచనలు ఆసక్తియుగల CChTel 65.1

    ప్రక్క పైకి వెళ్ళెను. అది ఎంత తేలికగానున్నది! నేను చూచితిని గనుక చెప్పగలిగితిని; కాని దైవ ప్రజల ఆలోచనలను ఆసక్తిని తూచుచున్న దైవదూతను చూడగా నా మనస్సునందు పాదుకొనిన సుస్పష్ట, పవిత్ర ఉద్రేకమును చెప్పజాలనుకున్నాను. దూత ఇట్లు సెలవిచ్చెను: “అట్టివారు పరమందు ప్రవేశింపగలరా? ముమ్మాటికిని ప్రవేశించలేరు. సత్వరము పశ్చాత్తాపపడి రక్షణ సంపాదించు కొనిననే గాని వారికి ఇప్పుడున్న నిరీక్షణ వ్యర్థమనియు వారికి నాశనము తథ్యమనియు చెప్పుము”. CChTel 65.2

    క్రియలు లేని భక్తి ఎవరిని రక్షింపజాలదు. అందరును గాఢమైన, సజీవమైన అను భవము కలిగియుండవలెను. శ్రమ కాలమందు ఇదే వారిని రక్షించును. ఆతరి వారు నిర్వహించు పని ఏ విధమైనదో పరిశోధించబడును. అది బంగారము, వెండి ప్రశస్తమైన రాళ్ళు అయినచో దేవుని గుడారపు రహస్య స్థలిలో వారు దాచబడుదురు. కాని వారి పని చెక్క, ఎండుగడి, కొయ్యకాలు అయినచో యెహోవా ఆగ్రహాధిక్యత నుండి వారిని ఏదియు కాపాడజాలదు. CChTel 65.3

    కొందరు వారిలో వారిని ప్రమాణములుగా గొని ఒకరితోనొకరు సరిచూచుకొని తమ జీవితములను ఇతరుల జీవితముల తో పోల్చుకొనుట నేను చూచితిని. ఇది మంచిది కాదు. క్రీస్తు వినా ఎవరును మనకు మాదిరి కాజాలదు. ఆయనే మనకు స్వచ్ఛమగు ఆదర్శము, ఆయనను అనుకరించుటలో ఒకరినొకరు మించుటకు అందరును ప్రయాసపడవలెను. మనమెల్లరము క్రీస్తు జతపనివారము కావలెను. లేనిచో అపవాది తోడిపనివారము అగుదము. మనము క్రీస్తుతో సమకూర్చువారమగుదుము. అట్లుకాని యెడల చెదరగొట్టువారమగుదుము. మనము నిజ క్రైస్తవులము కానిచో క్రైస్తవులమే కాదు. క్రీస్తిట్లు వచించుచున్నాడు: “నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినమేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను”. ప్రకటన 3:15, 16. CChTel 66.1

    తన్ను తాను ఉపేక్షించుకొనుట లేక సమర్పించుట యనగానేమో లేక సత్యము కొరకు బాధించబడుట యననేమో కొందరికి తెలియక పోవుట నేను చూచితిని. త్యాగము చేయకుండ నెవరును పరమందు ప్రవేశింపజాలరు. ఆత్మపేక్ష, త్యాగబుద్ది ఆచరణీయమైనవి. కొందరు తమ్మును తమ స్వకీయ శరీరములను, దేవుని బలిపీఠముపై సమర్పించలేదు. వారు కోపోత్రిక్తులై వారి ఇచ్ఛలను తీర్చుకొనుచు దైవ సేవా తత్పరత వీడి దైవ కార్యమును లెక్కచేయక తమ స్వకీయాశలను సాధించుకొందురు. నిత్యజీవము కొరకు ఏ దైవ త్యాగము చేయ నిష్టపడువారికి అది లభించును. దీనిని సంపాదించుటకు బాధపడుట, స్వార్థమును సిలువ వేయుట, ప్రతి విగ్రహమును సమర్పించుట సమంజసమే, అత్యధికమును నిత్యమునైన మహిమా భారము ప్రాపంచికమైన ప్రతినిధ ఆనందమును మ్రింగివేయును. CChTel 66.2