Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తుఫాను కొరకు సిద్ధపడుడి

    వ్యతిరేకత, ఉగ్రత అను తుఫానును ఎదుర్కొనుటకు తన ప్రజలు సిద్ధముగా నుండునట్లు కడవరి దినములలో నేమి సంభవించుచున్నదో దేవుడు ఎరుకపరచెను. తమ ముం దున్న సంగతుల నిమిత్తము హెచ్చరించబడిన వారు శ్రమ కాలమున ప్రభువు తనను నమ్మిన వారిని సురక్షితముగా నుంచునని తమను తాము ఓదార్చుకొనుచు ప్రశాంతముగా కూర్చుండరాదు. మనము తమ ప్రభువు కొరకు కనిపెట్టుకొని యున్న ప్రజలవలె నుండ వలెను గాని సోమరితనముగా నుండరాదు. పట్టుదలతోను, అచంచల విశ్వాసముతోను మనము పనిచేయవలెను. ఆ ప్రాముఖ్యములైన విషయములయందు ఆసక్తమతులగుటకిది సమయము కాదు. మనుష్యులు నిద్రించుచుండగా దైవ ప్రజలకు కృప, న్యాయము లుండకుండ చేయవలెనని సాతానుడు చురుకుగా ఏర్పాట్లు కావించుచున్నాడు. ఆదివారోద్యమ మిప్పుడు రహస్యముగా సాగుచున్నది. నాయకులు అసలు విషయములను మరుగు పరుచుచున్నారు. ఈ యుద్యమములో పాల్గొను అనేకులు అంత:ప్రవాహమెటుపోవుచున్నదో గుర్తించలేకున్నారు. దాని సిద్ధాంతములు సామాన్యములుగ నుండి పైకి క్రైస్తవ మతమునకు సంబంధించినట్లగపడును. కాని మాటలాడినపుడు అది ఘటసర్పభావమును బయలుపరుచును. CChTel 497.3

    నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు అని దావీదు నడుపుచున్నాడు. కీర్తనలు 76. 10 పరీక్షించు సత్యము ముందుకు తేబడి దానిపై ద్వేషభావమున్నప్పటికి అది పరీక్షకు చర్చకు తేబడునని దేవుని భావము, ప్రజల మనస్సులు ఆందోళనతో నిండవలెను. సత్యమునకు విరోధముగా రేగు ప్రతి వివాదమును, ప్రతి అవమానమును, ప్రతి అపవాదును దేవుడు మానవ మనస్సులను సత్యావేషణ కొరకు ఉద్రేక పరుచుటకుపయోగించని యెడల వారు నిద్రావస్థలో నుందురు. 45T 452,453;CChTel 498.1

    దేవుడు మనకిచ్చిన పనిని మనము ముగించలేదు. ఆదివారశాసనము కలుగజేయు సమస్యను ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా లేము. సమీపించుచున్న ఆపాయమును గూర్చి కన్పించు సూచనల దృష్ట్యా గార్యసాధనకు పూనుకొనుట మన విధి. ఆ కీడును గూర్చి తలంచుచు ప్రవచనములలో చెప్పబడినది. గనుక ఈ పని పురోగమించుననియు దేవుడు తన ప్రజలను కాపాడుననియు నమ్ముచున్న ఎవరును నిర్వచారముగా కూర్చుండరాదు. మనస్సాక్షి స్వాతంత్య్రము కాపాడుకొనుటకు ఏమియు చేయక కూర్చున్నచో మనము దేవుని చిత్తమును జరిగించుటలేదు. చాలా కాలముగా అలక్ష్యము చేయబడుచున్న ఈ పనిని ముగించు వరకు ఈ కీడు రాకుండుటకు మనము బలమైన యదార్ధమైన ప్రార్థన చేయవలెను. పట్టుదలతో ప్రార్థించి ఆ మీదట మన ప్రార్థనలననుసరించి పని చేయవలెను. సైతానుడు జయము పొందినట్లు అసత్యము, దుర్భోధల వలన సత్యము జయించబడినట్లు ఆగ పడవచ్చును. గతమున తన ప్రజలను తమ శత్రు హస్తముల నుండి రక్షించిన విధమును జ్ఞాపకము చేసికొనవలెనని దేవుడు కోరుచున్నాడు. సాతాను క్రియల నుండి తప్పించుకొనుటకు వీలు పడనప్పుడు తన శక్తిని బయలు పరచుటకు దేవుడు సర్వదా క్లిష్ట పరిస్థితులను ఎన్నుకొనెను. మానవుని అగత్యము దేవుని తరుణము. CChTel 498.2

    సహోదరులారా, మనముందున్న శ్రమ నెదుర్కొనుటకు ఇప్పుడు మీ సిద్ధబాటుపై మీ రక్షణ, ఇతరుల రక్షణ ఆధారపడి యున్నదని మీరు గుర్తించచున్నారా? మీరు వ్యతిరేకత నెదుర్కొన్నప్పుడు బలముగా నిలబడుటకు దోహదము చేయు ఆసక్తి, భక్తి, నీతి మీకున్నవా? దేవుడు నా ద్వారా మాటలాడినచో మీరు సభలయుందు హాజరుపర్చబడి మీరు నమ్ముచున్న ప్రతి సత్యము నిశితముగా విమర్శించబడు సమయము వచ్చును. ఇప్పుడనేకులు వ్యర్థపుచ్చుచున్న సమయము దేవుడు మనకిచ్చిన పని కొరకు అనగా రానున్న క్లిష్ట సమయము నెదుర్కొనుటకు వినియోగించబడివలెను. 55T 713-717; CChTel 499.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents