Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “మీరు మీ సొత్తుకారు”

    క్రీస్తు త్వరలో వచ్చుచున్నాడని మనము నిస్సందేహముగా నమ్ముచున్నాము. ఇది మనకు కట్టుకథ కాదు. కేవలము సత్యము. మన పాపములు పరిహరించులకు, మన శీలమునందలి దోషములను తొలగించుటకు లేక మన స్వభావ దౌర్బల్యములను సంస్కరించుటకు ఆయన రాకడకు జరిగించబడినచో అది ఆయన రాకడకు ముందే పూర్తి చేయబడును. CChTel 400.1

    ప్రభువు వచ్చునపుడు పరిశుద్దులు ఇంకను పరిశుద్ధులుగనే యుందురు. తమ శరీరాత్మలను పరిశుద్దముగాను, పవిత్రముగాను, గౌరవముగాను ఉంచుకొన్నవారు అప్పుడు అమర్త్యతమును పొందెదరు. కాని అన్యాయస్థులు, అపరిశుద్ధులు, అపవిత్రులు ఇంకను అట్లే యుందురు. వారి లోపములను తొలగించి వారికి పరిశుద్ద శీలముల నిచ్చుటకు అది సమయము కాదు. ఇదంతయు ఈ కృపకాల గడియలలోనే జరుగవలెను. మనకొరకు ఈ కార్యము జరిగించబడవలసిన సమయమిదే. CChTel 400.2

    నీతిని పవిత్ర శీలమును కృపయందు పెరుగుదలను ప్రతిఘటించు ప్రపంచములో నేడు మనము వసించుచున్నాము. మనమెక్కడ చూచినను అవినీతి, అపవిత్రము, అధ్యాత్మిక మయిన లోపము, పాపము గోచరించుచున్నవి. అమర్త్యత్వము పొందక పూర్వము ఇక్కడ మనము చేయవలసిన పని యేమొ? ఈ కడవరి దినములలో మన చుట్టు చిత్తుబిత్తుగా ఉన్న పాపముల మధ్య నిష్కళంకముగా నిలువబడు మనము మన శరీరాత్మలను పరిశుద్ధముగా కాపాడుకొనవలెను. CChTel 400.3

    “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీ రెరుగరా? మీరు మీ సొత్తు కారు. మీరు విలువపెట్టి కొన బడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ”1 కోరింథీ 6:19,20. CChTel 400.4

    మనము మన సొత్తు కాదు. మనము గొప్ప విలువపెట్టి కొనబడిన వారము. దేవా కుమారుని మరణము ,శ్రమలే మన కొరకు చెల్లించబడిన క్రయధనము. దీనిని మనము పూర్తిగ గ్రహించ గలిగినచో దేవుని కొరకు సంపూర్ణ సేవ చేయుటకు గాను మనము మన శరీరారోగ్యమును కాపాడుకొనుట మన బాధ్యతయని గుర్తించెదము. CChTel 401.1

    మన బలమును వ్యర్ధ పుచ్చి ,దార్డ్యము తగ్గించి యోచన ను మభ్య పరచు కార్యమును చేసినపుడు మనము దేవునికి వ్యతిరేకముగా పాపము చేసిన వారమగుదము. ఈ విధానము నవలంబించుట ద్వారా ఆయన పైన మన శరీరత్మల ద్వారా మనము ఆయనకు మహిమ పరచక ఆయన దృష్టిలో గొప్ప నేరము చేయుచున్నవారమగుదుము. 32T 354-356;CChTel 401.2