Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆధ్యాయము 45 - మన బిడ్డల క్రమశిక్షణ ,చదువు

    యువజనులు తమ స్వకీయ స్వభావమును అనుసరించుటకయి వారిని విచ్చల విడిగా తల్లిదండ్రులు విడచు నలవాటు కలదు. యౌవనమందు వారు అవిధేయులుగా నున్నచో కొన్ని సంవత్సరములో వారు గుణపడెదరనియు పది హేడు ,పద్దెనిమిది సంవత్సరముల వయస్సు వచ్చు సరికి తమకై తాము యోచన చేసే వారు తమ చెడ్డ అలవాటులను విడిచి పెట్టి తుదకు మంచి స్త్రీ పురుషులగుదురనియు తల్లిదండ్రులనెదరు. ఇది యెంత పొరపాటు !సంవత్సరముల తరబడి శత్రువు తమ హృదయ క్షేత్రమునందు విత్తనములను చల్లనిచ్చెదరు. చెడ్డ సూత్రమును ఏపుగా పెరగనిచ్చెదరు. అనేక సందర్భములో ఆ క్షేత్రమును చేయబడు కృషి యంతయు వ్యర్ధమగునుసాతానుడు నైపుణ్యము, ఓర్పుకల పనివాడు. అతడు మన ప్రాణ శత్రువు. యువజనులకు హాని కలిగించు అలక్ష్యపు మాట ఉచ్చరించబదినపుడు అది వారికి ఆత్మ సంస్తుతి కలిగించుటయే కావచ్చును లేక ఒక పాపము అంత హేయమైనది కాదని వారు తలంచు నట్లు చేయుట కావచ్చును. దాని సహాయమున సాతానుడు పాపము విత్తనమును విత్తును. ఆ విత్తనము నేరుపారి సమృద్దిగా ఫలించును. కొందరు తల్లి దండ్రులు తమ బిడ్డలకు దురభ్యాసముల దెప్పించిదిరి. ఆ దురఖ్యాసముల జాడలు వారి జీవితము పొడుగున కాన్పించును. ఈ పాపము తల్లిదండ్రులపై నున్నది. ఈపిల్లలు క్రైస్తవులమని చెప్పుకొన వచ్చును. అయినను వారి హృదయములలో కృపయోక్క ప్రత్యేక కృషి జరుగదు ; వారి జీవితమందు యధార్ధమైన సంస్కారము జరుగదు. కనుక వారి జీవితము పొడుగున తమ ప్రాచీన దురభ్యాసములే కాననగును. తమ తల్లిదండ్రులు ఏర్పడనిచ్చిన శిలములనే వారు కనపర్చెదరు. 1IT 403; CChTel 363.1

    తలిదండ్రులు తమ పిల్లలను అదుపులో నుంచవలెను. వారి ఆశలను సంస్కరించి వారిని స్వాధీనపరచుకొన వలెను. లేకున్నచో ప్రతి దండన దినమందు దేవుడు వారి బిడ్డలను నాశనము చేయును. తమ బిడ్డలను అడుపుచేయని తల్లిదండ్రులు నిర్దోషులుగా నెం చబడరు. మరి ముఖ్యముగా దైవ సేవకులు తమ స్వకీయ కుటుంబములను అదుపు క్రింద నుంచి పాలన చేయవలెను. మన గృహమును సరిగా అదుపు చేయకున్నచో సంఘ విషయములను తీర్మానించుటగాని సంఘమునకు తీర్పు తీర్చుటకు గాని అట్టివారు సిద్ధపడలేరని నాకు చూపబడెను. CChTel 363.2

    ముందు వారి గృహమందు క్రమముండవలెను. అప్పుడు సంఘమందు వారి తీర్మానములు పలుకుబడి సమధికములై యుండవలెను. 2IT 119;CChTel 364.1

    ప్రతి కుమారుని, కుమార్తెను రాత్రి యింటి వద్ద లేకున్నచో తల్లిదండ్రులు ఆరాతీసి యుండవలెను. తమ బిడ్డలెవరి స్నేహము పట్టుచున్నారో, వారే గృహమందు సాయంకాలమును గడుపుచున్నారో తల్లిదండ్రులు తెలిసికొనవలెను. 34T 651; CChTel 364.2

    దేవునికి తెలియుదానికన్న మానవతత్వశాస్త్రము ఎక్కువ కనుగొనజాలదు. లేక పిల్లలను అదుపు చేయుటలో దేవుడిచ్చిన విదానము కన్న ఉత్తమ విధానమును కనుగొనజాలదు. పిల్లల అక్కరలను, తమ సృష్టికర్తకన్నా బాగుగా గ్రహింపగలవారెవరు? వారిని తన స్వకీయమయిన రక్తముతో కొన్న ప్రభువు కంటే పురోగతియందు సమధికాసక్తిని చూపగలవారెవరు? దైవ వాక్యమును శ్రద్ధగా చదివి దాని ప్రకారము చేసినచో పిల్లలు దుర్మార్గులై తన్మూలమున ఆత్మకు వేదన కలిగించుట తగ్గును. CChTel 364.3

    పిల్లలకు కొన్ని హక్కులు కలవు. వానిని తల్లిదండ్రులు గుర్తించి గౌరవించవలెను. వారిని ప్రయోజనము కలవారిగను మర్యాదపరులుగను ఇచ్చటి సంఘమందు ప్రేమింపబడు సభికులుగను తీర్చిదిద్ది ఆ మీదట భావి పవిత్ర సంఘమునందు ప్రవేశించుటకు నైతిక యోగ్యత నీయగల విద్య నభ్యసించుటకు వారికి హక్కు కలదు. బాల్యము నందును యౌవనము నందును తామలవరుచకొను అభ్యాసముపై తమ భావి ప్రస్తుత భావి సుక్షేమము ఆధారపడి యుండునని యువజనులకు నేర్పబడును. 4AH 306;CChTel 364.4

    బైబిలును గౌరవించి దాని బోధనలను అవలంభించుచున్నామని చెప్పుకొను స్త్రీ పురుషులు దాని విధులను జరిగించుటలో ననేక విధముల తప్పిపోవుచున్నారు. తమ బిడ్డలను తర్పీదు చేయుటలో వారు తమ స్వకీయ దుస్స్వభావములనే అవలంబింతురుగాని దైవ చిత్తము నవలంబించరు. ఈ బాధ్యతా నిర్లక్ష్యము వలన వేల కొలది ఆత్మలు నాశనమగు చున్నవి. పిల్లల క్రమశిక్షణ విషయము బైబిలులో నియమములను ఏర్పరచినది. ఈ దైవ నియమములను తల్లిదండ్రులు పాటించినచో నేడు కార్యరంగమున వ్యత్యస్త వర్గమునకు చెందు యువజనులు ప్రవేశించుట మనము చూతుము. కాని బైబిలు పాఠకులమనియు బైబిలు ననుసరించువారమనియు చెప్పుకొను తల్లిదండ్రులు దాని బోధలకు విరుద్ధముగా నడచుచున్నారు. తమ బిడ్డల ప్రవర్తనను గూర్చి వేదనతోడను, విచారముతోడను కూడిన శోకమును మనము విందుము. ఈ విచారమును, బాధను తమ పైకి తమ బిడ్డలపైకి తామే తెచ్చుకొనుచున్నారని వారు గురుతించరు. దురభిప్రాయముతో కూడిన తమ ప్రేమ వలన నాకు తమ బిడ్డలను పాడు చేయుచున్నారని గ్రహించరు. తమ బిడ్డలకు బాల్యము నుండియు మంచి అలవాటులను అబ్బునట్లు తర్పీతు చేయు దైవ దత్త బాద్యతను ఆరు గ్రహించరు. 54T 313:CChTel 364.5

    క్రైస్తవులైన పిల్లలు ఏ ప్రాపంచిక ఆశీస్సుకన్న దైవ భీతిగల తమ తల్లిదండ్రుల ప్రేమను అభివందనలను కాంక్షించెదరు. వారు తమ తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించెదరు. తల్లిదండ్రులను సంతోష పెట్టుల యెట్లు అనునది వారి ప్రధాన పాఠ్యాంశములలో నొకటిగా నుండును. తిరుగుబాటుతో నిండిన యీ యుగమందు సరియై న ఉపదేశము శిక్షణ పొందని పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల తమ ధర్మములను సరిగా నిర్వర్తించుట లేదు. తమ తల్లిదండ్రులు తమ కొరకెక్కువ శ్రమపడు కొలది పిల్లలకు కృతఘ్నత యెక్కువై తల్లిదండ్రులను సమ్మానించుట తగ్గుట తరచుగా సంభవించుచున్నది. CChTel 365.1

    ఎక్కువ భాగము బిడ్డలయొక్క భవితవ్యానందము తల్లిదండ్రుల చేతులలోనే యున్నది. ఈ పిల్లల శీలము రూపొందించుటయను బృహత్తర కర్తవ్యమును దేవుడు వీరి కొసంగియున్నాడు. బాల్యమందు వీరికీయబడు ఉపదేశములు వారి జీవితాంతము వరకు వారిని వెంబడిరచును. తల్లిదండ్రులు విత్తనములు విత్తుచున్నారు. అవి మంచి ఫలములనో చెడ్డ ఫలములనో ఫలించును. వారు తమ కొడుకులను కూతులను సంతోషమునకో దుఃఖమునకో సన్నద్దపరచుచున్నారు. 6IT 392, 393;CChTel 365.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents