Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    కాయకష్టము యొక్క గౌరవము

    కాయకష్టము యొక్క నిజమైన గౌరవమును గుర్తించుటకు యువజనులను నడిపించవలెను. దేవుడు నిత్యము పనిచేయువాడని వారికి చూపించుడి. ప్రకృతి యావత్తు తనకు నియమించబడిన కార్యములను నిర్వర్తించుచున్నది. సర్వ సృష్టి యందును పని గోచరించుచున్నది. మన కర్తవ్యమును నెరవేర్చుటకు మనముకూడా పనిచేయవలెను. 34Ed. 214;CChTel 393.2

    మానసికమైన పనితో మిళితము చేయబడిన కాయకష్టము ప్రయోజనకరమైన జీవితమందొక శిక్షణయై యున్నది. ఆయా శాఖలలో మానవులు చేయవలెనని దేవుడు సంకల్పించిన పనిని బాగుగా నిర్వర్తించుటకు మనస్సును, శరీరమును, తర్పీతు చేసి బలపరచునను తలంపు ఆనందదాయకము. 35FE 229;CChTel 393.3

    ఎంత అల్పమైనది, నీచమైనదిగ కనబడెనను మనలో నెవరును పని విషయము సిగ్గుపడరాదు. చేతిపని గౌరవనీయమైనది. తలతోగాని చేతులతోగాని పనిచేయువారెల్లరును కార్యనిర్హాకులే. గుడికి వెళ్లు వారెట్లో అట్లె బట్టలు ఉతుకువారును. పాత్రలు తోమువారును తమ విధిని నిర్వహించుచు మతమును గౌరవించుచున్నారు. సామాన్యమైన పని చేయుచున్నను పవిత్రమైన, పరిశుద్ధమైన తలంపుల ద్వారా మనస్సును సమున్నత పరచి ఉదాత్తము చేయవచ్చును. 364T 590;CChTel 393.4

    కాయకష్టము అసహ్యించబడుటకు గొప్ప హేతువేమనగా తరుచు పనిని అశ్రద్ధగా అలక్ష్యభావముతో చేయుటయే. గత్యంతరములేక చేసెదను గాని యిష్టపూర్వకముగా ప్రజలు పనిచేయరు. పనివాడు తన పనిని మనఃపూర్వకముగా చేయుటలేదు. అతడు ఆత్మ గౌరవమును కాపాడుకొనలేడు. ఇతరుల గౌరవమును సంపాదించలేడు. ఈ తప్పిదములను చేతిపనులు తర్బీతు సవరించవలెను. నిర్దుష్టత, సంపూర్ణత మున్నగు నలవాటులనది వృద్ది చేయవలెను. విద్యార్థులు నైపుణ్యమును నేర్చుకొనవలెను. వారు తమ సమయమును పాడుచేయరాదు. ప్రతి ప్రయత్నము లాభదాయకముగా నుండవలెను. ఉత్తమ పద్దతులను వారికి నేర్పుటయే గాక వృద్దిగాంచవలెనను ఆశను వారికి కలిగించవలెను. మానవ హస్తములు మేధస్సులకు సాధ్యమయినంత సంపూర్ణముగా తమ పనిని చేయవలెనను లక్ష్యమును వారు కలిగి యుండవలెను. 37Ed 222;CChTel 393.5

    పిల్లలను సోమరులుగా పెరగనీయుట పాపము. ఆయాసము వచ్చినను వారు తమ కాలుసేతులను కండరములను సాధకము చేయవలెను. మీకు అధిక శ్రమ హాని చేయని యెడల వారికెట్లు హాని చేయగలదు? అలసటకు బడలికకు మధ్య చాలా బేధమున్నది. పెద్దలకన్న పిల్లలకు పనిమార్పు, విరాము ఎక్కువ అవసరము. చిన్నపిల్లలుగా నున్నప్పుడు సయితము వారు పనిచేయుట నేర్చుకొనవచ్చును. మేము ప్రయోజకలగుచున్నామని తలంచుచు వారు సంతసించదరు. పని చేసిన తరువాత వారికి చక్కగా నిద్రపట్టును. 38AH 289;CChTel 394.1