Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సందేహము, భయము కలిగినను దైవ జనులు ముందుకు సాగి పోవలెను

    వర్తమాన సత్యమును విశ్వసించుచున్న తన ప్రజలతో దేవుడిప్పుడు వ్యవహరించుచున్నాడు. గంభీర ఫలితములను కలిగించవలెనని ఆయన అభిలషించుచున్నాడు. ఈ కార్యసాధనకాయన కృషి చేయుచు తన ప్రజలనిట్లు హెచ్చరించుచున్నాడు; “సాగిపోవుడి.” నిజమే మార్గమింకను తెరువబడలేదు. అయినను విశ్వాసబలము తోడను ధైర్యముతోడను వారు ముందుకు సాగినపుడు దేవుడు వారికి మార్గమును సుప్పష్ట మొనరించును. పురాతన ఇశ్రాయేలీయులవలె నిత్యము సణుకు కొనుచు దేవుడు తన కార్య పురోగతికై ప్రత్యేకముగా వేసిన వ్యక్తుల వలన తమకు కష్టములు కలిగిన వనెదరు. తన హస్తముద్వారా తప్ప మరే విధముగానైనను తప్పించుకొనలేని స్థలములకు వారిని తెచ్చుటలో దేవుడు తమను పరీక్షించుచున్నాడని గుర్తించరు. CChTel 513.3

    క్రైస్తవ జీవితము అపాయములతో నిండియున్నట్లు ,పనిచేయుట కష్టముగ నున్నట్లు ,తోచు సమయములు కలవు. ముందు రానున్న నాశానమును వెనుక దాస్యము ,మరణము గూర్చి ఊహింతురు. అయినను అన్ని అధైర్యముల పయినుండి పర్యవసానమేమైయున్నాను ,మన నేత్రము చీకటిని చీల్చి జాలకున్నప్పటికిని మన పాదములను చలి కెరటములకెరయగు కష్టములు తాకుచున్నను ఈ యాజ్ఞను మనము శిరపాపహించవలెను. 124T26;CChTel 514.1

    వెర్వేరు ఆసక్తులతో కూదిన ,అర్ధంగీకారముగల జీవితమునందు సందేహము. చీకటి మీకు గోచరించును. మాట మొసంగు ఓదార్పు గాని లోకమిచ్చు శాంతి గాని మీరనుభవించ లేరు. సోమరి తనమను రక్కసుని ఒడిలో చతికిలబడక లేచి ఉన్నత ప్రమాణమును చేర యత్నించుడి. అలక్ష్యమును మీరు చేరగలరు. అది మీ ఆధిక్యత క్రీస్తు నిమిత్తము సర్వమును త్యజించుట శుభప్రదమైన ఆధిక్యత. CChTel 514.2

    ఇతరుల జీవితములను చూడక వీరిననుకరించి వారితో సమానముగా నుండుటకు యత్నించుడి. మీకు ఒకే ఒక నిర్దుష్ట ఆదర్శకుడు కలడు. క్రీస్తు ననుకరించుటయే క్షేమము. ఇతర ఆధ్యాత్మిక మాంద్యమను సూత్రము నవలంభించినచో వారిని విడిచి క్రైస్తవ శీలమును ఉన్నతస్థాయిని చేరుటకు ముందుకు సాగిపొయెదమని మీరు నిర్ణయించుకొనుడి. పరలోకమందు చేరుట కర్హమగు శీలమును సాధించు కొనుడి మీ బాధ్యతానిర్వహణమందు అలక్ష్యము చుపకుడి. మీ స్వకీయాత్మ యెడల నమ్మకముగను యాధార్ధముగను వర్తించుడి13IT 241. CChTel 514.3