Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తల్లిదండ్రులు అనమతించవలెను.

    పిల్లలు స్వాభావికముగా మృదు హృదయలు. ప్రేమా శీలురు. వారిని సునాయాసముగా సంతోషపర్చవచ్చును. లేక దుంఃఖపర్చవచ్చును. ప్రేమతో కూడిన మాటలతోను, క్రియలతోను తల్లులు వారిని క్రమపర్చి వారి ప్రేమను చూరగొనవచ్చును. పిల్లల యెడల కఠినముగాను, క్రూరముగాను ప్రవర్తించుట పెద్ద పొరపాటు. నిష్పాక్షిక మయిన పట్టుదల, కోపోద్రిక్తము కాని నిగ్రహము ప్రతి కుటుంబ శిక్షణకును అవసరము. యోజనాపురస్సరముగా వర్తించుడి. మీరనుకొన్న దానిని తప్పక నెరవేర్చుడి. 73T 532;CChTel 365.3

    తల్లిదండ్రులు తమ బాల్య దశను విస్మరింపరాదు. ప్రేమ, సానుభూతుల కొరకు తామెంతగా తహ తహ లాడినది, విమర్శించబడినపుడును, గద్దించబడినపుడును తామెంతగా నిస్సంతోషతులైరో మరువరాదు. అయినను ప్రేమతో మిశ్రితమయిన ధృఢత్వముతో వారు తమ బిడ్డల యొద్ద నుండి విధేయతను కోరవలెను. తల్లిదండ్రుల మాటను పిల్లలు మారాడక శిరసావహించవలెను. 8IT 383;CChTel 366.1

    కుటుంబ పాలన మందు ధృడత లేనిచో నది గొప్ప హానికి హేతు భూతమగుము. వాస్తవముకది క్రమ రాహిత్యములో సమానమే. మంకుతనము, అవిధేయత కలిగి సంచరించుకు కారణమేమను ప్రశ్న తరుచుగా వేయబడుచున్నది. దానికి గృహ శిక్షణయే కారణము. CChTel 366.2

    ఒక విషయముపై తల్లిదండ్రులు కలిసి కట్టుగా నిర్వహించినచో తాను చేయవలసిన పనిని పిల్లవాడు గురుతించును. కాని తల్లి యిచ్చు క్రమశిక్షణను అంగీకరించకున్నట్లు తండ్రి వాలకము అగపడినచో; ఆమె చాల కఠినముగ నున్నది గనుక పిల్లవానిని గారాము పెట్టి తద్వారా ఆనష్టమును పరిహరించవలెనని తండ్రి తలంచినచో, బాలుడు పాడగుట తథ్యము. తాను యధేచ్చగా వర్తించగలవని పిల్లవాడు తలంపడును. ఈ పాపము చేయు తల్లి దండ్రులు తమ బిడ్డల నాశనమునకు జవాబుదారులయ్యెదరు. 9AH 310— 315; CChTel 366.3

    ముందు తల్లిదండ్రులు తమ్మును తాము అదుపు చేసి కొనుటకు నేర్చుకొనవలెను. అప్పుడు వారు తమ పిల్లలను విజయవంతముగా అదుపుచేయగలరు. ఆత్మ నిగ్రహము కోల్పోయి అసహనములో మాటలాడి ప్రవర్తించినపుడెల్ల వారు దేవునికి విరోధముగా పాపము చేసిన వారగుదురు. ముందు తమ బిడ్డలతో శాంతముగా చర్చించి వారి దోషములను స్పష్టముగా బయలుపరచి, వారి పాపములను వారికి చూపి వారు తల్లిదండ్రులకు విరోధముగా పాపము చేయుట మాత్రమే కాక దేవునికి విరోధముగా కూడ పాపము చేసితిరని వ్యక్త పరచవలెను. మీ స్వీయ హృదయమును అధీనమందుంచుకొని దోసకారులగు మీ బిడ్లపట్ల దయ, విచారములు కలిగి వారిని సరిదిద్దుబాటు కారణముగా మిమ్మును మీ బిడ్డలు ఏవగించరు. మిక్కుటముగా వారు మిమ్మును ప్రెమించెదరు. మిమ్మును చిక్కునందు పెట్టిన హేతువు చేత గాని మీ అక్కనును తీర్చుకొనుటకు గాని వారిని దండించక పాపము నందు పెరుగకుండ దేవుని యెడల వారికి గల భాధ్యత దృష్టి యందుంచుకొని తమ మేలు కొరకే దండించు చున్నారని వారు గ్రహించెదరు. 10IT 398CChTel 366.4