Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆరోగ్య సంస్కరణ

    మన సేవలో మితభోగ సంస్కరణమందెక్కువ శ్రద్ద చూపబడవలెను. సంస్కరణ అవసరమై ప్రతి విషయమందు పశ్చాత్తాపము, విశ్వాసము, విధేయత ఇమిడి యుండును. ఆత్మను నూత్నమైన సమున్నతమైన జీవితమునకు ఉద్దరించుటయని దాని భావము. ఇట్లు ప్రతి యధార్ద సంస్కారణమునకు మూడవ దూత వర్తమాన కృషియందొక స్థానమున్నది. ముఖ్యముగా మితానుభవ సంస్కారణమున మన గమనము త్రిప్పి దీనిని ప్రధానాంశముగా చేయవలెను. నిజమైన ఆశానిగ్రహ నియమములను ప్రజలకు విశదము చేసి వారిని అశానిగ్రహ వాగ్ధాన పత్రము పై సంతకము పెట్టుటకు ఆహ్వనించవలెను. దురభ్యసములకు దాసులైన వారిని గూర్చి ప్రత్యేక శ్రద్ద వహించవలెను. వారిని మనము క్రీస్తు సిలువ చెంతకు నడిపించవలెను. CChTel 403.5

    మనము లోకాంతమును సమీపించు కొలది ఆరోగ్య సంస్కరణ క్రైస్తవ ఆశనిగ్రహము సందర్బముగా ఉన్నత స్థాయికి వచ్చి దానిని గూర్చి ప్రజలకు కచ్చితముగా బొధించవలెను. మనము నిత్యమూ మన మాటలద్వారానే గాక క్రియలద్వారాకూడా ప్రజలకు శిక్షణ నిచ్చుటకు ప్రయత్నించవలెను. ఉపదేశము ఆచరణము కలిసినచో వాని ప్రభాషము అమోఘమై యుండును. 86T 110,112. CChTel 404.1