Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 30 - ఆనందముతో నొప్పు జయప్రదమైన భాగస్వామ్యము

    వివాహ సంబంధముతో ప్రవేశించువారి మధ్య సంపూర్ణ ప్రేమ ఏకీభావములుండవలెనని దేవుడు సంకల్పించెను. దైవ CChTel 276.1

    సంకల్పానుసారము ఒకరినొకరు ప్రేమించుకొనెదమని వధూవరులు పరలోక వాసుల యెదుట ప్రమాణము చేయవలెను. భార్య తన భర్తను గౌరవించవలెను. భర్త తన భార్యను ప్రేమించి ఆదరించవలెను. వివాహ జీవిత ప్రారంభమందే స్త్రీ పురుషులు దేవునికి తమ్మును తాము తిరిగి సమర్పించుకొనవలెను. CChTel 276.2

    వివాహము ఎంత జాగ్రత్తగాను వివేకముతోను జరిగించబడినను వివాహ కార్యము ద్వారా సంపూర్ణముగా ఐక్యపర్చబడు దంపతులరుదు. దంతులకు నిజమైన ఐక్యత వివాహము తరువాత సంవత్సరములలో సంఘటించును. CChTel 276.3

    నూతన దంపతులు క్లిష్ట సమస్యలతోను విచారములతోను నిండిన జీవితము నెదుర్కొనగా వివాహపు ఊహజని తానందము మాయమగును. భార్యభర్తలు తమ లోగడ సహవాసమునందు గ్రహించుటకు అసాధ్యమైన ఒండొరుల శీలములను యిప్పుడు గ్రహించెదరు. ఇది వారి యనుభవమున గొప్ప క్లిష్ట సమయము. తమ యావద్భావి జీవితానందము. ప్రయోజనము ఇప్పుడు వారలవంభించు సన్మార్గముపై నాధారపడియుండును. తరచు ఒకరియందొకరికి లోగడ తాము తలంచని బలహీనతలు, దోషములు అగపడును. కాని ప్రేమచే ఐక్యపర్చబడిన హృదయములు ఇతఃపూర్వము తమకు గోచరించని సలక్షణములు కూడా ఉన్నట్లు గ్రహించును. లోపములను వెదకుటకన్న అందరును ఇతరుల ఔన్నత్యమును ఉగ్గడిరచుట మంచిది. ఇతరులలో మనకేమి కనబడునో దానిని తరచు మనయందుండు మన వైఖరియే నిర్ణయము. CChTel 276.4

    అనేకులు ప్రేమాప్రత్యక్షతను బలహీనతగా గ్రహించి వారితో మాట్లాడక మౌనముగా నుందురు. ఈ స్వభావము వలన ఇతరులు దూరస్తులగుదురు. ఈ స్వభావము సానుభూతిని అంతరింపజేయును. కలిసి మెలసి కలివిడిగా నుండు విశాల భావము క్రమేపి ఎండి శుష్కించును, వారి హృదయము మందకొడిగను శూన్యముగను తయారగును. ఈ తప్పిదమును గుర్తించి మనము జాగ్రత్తగా నుండవలెను. ప్రేమను కనపర్చకున్నచో అది ఎక్కువ కాలము జీవించజాలదు. నీతో జతపర్చబడిన వ్యక్తి యెడల దయ, సానుభూతులను ప్రదర్శించ నిర్లక్ష్యము చేయకుము. CChTel 276.5

    ప్రతి వ్యక్తియు ప్రేమను సేకరించుటకన్న బహూకరించుట ఉత్తమము. ఉత్తమమైన దానిని అలవరచుకొని మీ అన్యోన్య సలక్షణములను సత్వరముగా గుర్తించుడి. నేను అభినందించబడుచున్నాను అని గుర్తించుట యందు ఉద్రిక్తత సంతృప్తి కలవు. కృషి చేయుచున్న వ్యక్తికి జయము కలిగిన పిమ్మట సానుభూతి, మర్యాదలు ప్రోత్సాహము నొసగును. ఉత్తమాశయములు కలిగి యుండుటకు యుండుటకు ప్రోత్సహించు ప్రేమ వృద్ధి యగునున. CChTel 277.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents