Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకండి”

    దైవధర్మశాస్త్రమలలె నిత్యత్వముగల ఒక నియమము పై దశమాంశ పద్థతి రూపొందింపబడినది. యూదులకీ దశమాంశ పద్దతి శుభావహముగా నుండెను. లేకున్నచో దేవుడు దానిని అనుగ్రహింపక పోవును. కాక సమాస్తి దనుక దీనినాచరించు వారికి కూడ నిది శుభప్రదాయకమే. CChTel 118.2

    దైవసేవను పోషించుటలో క్రమబద్థత, ఉదారతలుగల సంఘమలే ఆత్మీయముగా వృద్ది చెందుచున్నవి. క్రీస్తు అనుచరునిలోగల దాతృత్వ స్వభావము ఆయన గుణములను వ్యక్తము చేయును. ధనమున్నవారు తాము వ్యయపరచు ప్రతి రూపాయి నిమిత్తము దేవునికి సంజాయిషి ఇయ్యవలసియున్నారు అను సత్యమును గుర్తింపగలిగినచో వారి కోరికలు చాలావరకు తగ్గును. మనస్సాక్షియున్నచో ఉదరమును, అహమును, అహంభావమును వినోద కాంక్షను సంతుష్టిపరచుటకు వారు చేసిన వ్యర్థ వ్యయమును గూర్చి సాక్షమిచ్చి ప్రభువు సేవ నిమిత్తము వినియోగించవలసిన ధనమును దుబారా చేసిరని నివేదించును. దేవుని ధనమును పాడుచేయువారు క్రమేపి తమవలంబించిన విధానము విషయము ప్రభువుకు లెక్క అప్పగించవలసి యున్నారు. క్రైస్తవులమని చెప్పుకొనుచున్నవారు శరీరలంకారము కొరకును, గృహలంకారణ నిమిత్తమును తక్కువ వెచ్చించి ఆరోగ్యమును పాడుచేయు దుబారా తిండ్లను, అధిక వ్యయముతో కూడిన వంటకములను, తగ్గించుకొన్నచో దేవుని ఖజానాలోనికి వారు అధిక ధనమును తీసుకొని రాగలరు. మనకు నిత్య సంపదలు కూర్చునిమిత్తము పరలోకమును భాగ్యములను మహిమను విడనాడి మన నిమిత్తము నిరుపేదjైున విమోచకుని వారిట్లు అనుకరింతురు. CChTel 118.3

    లోక సంపదల నార్జింప మొదలిడిన అనేకులు ఏదో కొంత సొమ్మును ఆర్జించుట కెంతకాలము పట్టునా యని లెక్కలు వేసికొనెదరు. ధన సంపాదనయందు ఆసక్తమతులై దైవ విషయములందు ధనవంతులు కాజాలకుందురు. వారి సంపాదనతో పాటు వారి ధాతృత్వము వృద్ధి చెందుట లేదు. ధనాపేక్ష పెరుగు కొలది తమ ధనమును వారి ప్రేమ గాఢముగా పెనవేసుకొనును. ఆస్తి పెరుగు కొలది ఎక్కువ సంపాదించవలెనను కాంక్ష బలపడును. అంతట ప్రభువుకు పదియవ భాగమిచ్చుట భారమైన, అన్యాయమైన పన్నుగా భావించెదరు. CChTel 119.1

    లేఖనమిట్లు వచించుచున్నది: “ధనము హెచ్చినను దానిని లక్ష్యపెట్టకుడి.” కీర్తనలు 62:10. అనేకులిట్లు అందురు: నేను అతని యంత ధనికుడనైనచో దేవుని నిధికి అధికముగా విరాళమిచ్చెదను. దైవ సేవాభివృద్ధికి నినా మరెందుకును నా ద్రవ్యమును ఉపయోగించన.” ధనము నిచ్చుట ద్వారా ఇట్టి వారిని పరీక్షించియున్నాడు. ధనముతో పాటు భయానక శోధనము వచ్చెను. తాము పేదలైయున్న దినములకంటే ఇప్పుడు వారి దానము తరుగుదల పొందెను. అధిక సంపాదనాకాంక్ష వారి మనస్సును, హృదయములను ముంచివేయగా వారు విగ్రహారాధన చేసిరి. 213T 401-405;CChTel 119.2