Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంఘ బాధ్యత

    రాత్రివేళ ఒక పెద్ద కూట మందు నేను ఉంటిని. హాజరైన వారి, మనస్సులను విద్యా సమస్య ఆందోళనను కలిగించుచున్నది. దీర్ఘకాలము మన అధ్యాపకుడుగా నున్న ఒక వ్యక్తి ప్రజలకు ఉపన్యాసమిచ్చు చుండెను. “సెవెంతుడే ఎడ్వంటిస్టు సంఘమునకు విద్య ముదావహమైన అంశముగా నుండవలెను” అని అభి భాషించిరి. 76T 162;CChTel 383.2

    విద్య నభ్యసించునపుడు ఇతరులతో సావాసము చేయునపుడు దురభ్యృాసములకు గురి కాకుండునట్లు పిల్లల విద్యా సందర్బముగా సంఘము నిర్వహించ వలసిన ప్రత్యేక కార్యమొకటి కలదు. లోకము పాపముతో నిండి యున్నది. దైవ విధులను లోకము గౌరవించుట లేదు. నగరములు సొదోనూ వలె తయారైనవి. మన బిడ్డలు అను దినము చాలా కీడులకు గురియగుచున్నారు. పబ్లిక్ పాఠశాలలకు వెళ్ళువారు తమ కన్న ఎక్కువ చెడిన వారితో స్నేహము చేసెదరు. బడిలో నేర్చిన విద్యలే కాక వీధి విద్యలను కూడా నేర్చుకొనెదరు. పిల్లల హృదయములు సులభముగా మంచి చెడ్డలను సేకరించును. వారి పరిసరములు మం చినైతేనే తప్ప అలక్ష్యము చేయబడు ఈ పిల్లలను చెరచుటకు వీనిని ఉపయోగించును. సబ్బాతు నాచరించు తల్లిదండ్రులు ఏమి జరుగుచున్నదో గుర్తించక ముందే పిల్లలిట్లు చెడుగు నేర్చుకొనెదరు. వారి పిల్లలు చెడిపోయెదరు. CChTel 383.3

    అనేక కుటుంబములు పిల్లల విద్య నిమిత్తము మన పెద్ద పాఠశాల లుండు తావులకు వలస పోవుట పరిపాటియై నది. అట్లు గాక వారు తామున్న స్థలమందే యుండుట ద్వారా ప్రభువుకు గొప్ప సేవ చేయగలరు. వారే సంఘమునకు చెందెదరో ఆ సంఘ మొక ప్రాథమిక పాఠశాలను స్థాపించుటకు ప్రోత్సహించవలెను. అక్కడనున్న ఈ సంఘ ప్రాథమిక పాఠశాల యందు సర్వార్థ సాధకమైన, ప్రాయోగికమయిన క్రైస్తవ విద్యను పొందవచ్చును. తమ సహాయము అవసరమగు చిన్న సంఘములలోనే వారుండుట మేలు. తను అవసరములేని పెద్ద సంఘములకు వెళ్ళినచో వారా సంఘ కార్య క్రమములో పాల్గొనుటకు తగిన అవకాశ ముండదు. CChTel 384.1

    కొంత మంది సబ్బాతీయులున్న చోట తల్లి దండ్రులలందరు కలసి తమ బిడ్డలు, యౌవనస్థులు చదువుకొనుటకు గాను ఒక దిన పాఠశాలను స్థాపించవలెను. వారు ఒక క్రైస్తవ ఉపాధ్యాయుని ఆ పాఠశాల యందు పనిచేయుటకు మిషనెరీ అయిన ఆ యుపాధ్యాయుడు ఆబిడ్డలకు మిషనెరీ అగుటకు తర్బీతు చేయవలెను. 8CT 173, 174;CChTel 384.2

    మన బిడ్డలను ఆయన కొరకు పెంచెదముగాని ప్రపంచము కొరకు గాదని మనము దేవునితో గంభీరముగాను పవిత్రముగాను ఖరారుపడితిమి. లోకము యొక్క చేతిలో వారు తమ చేయి వేయక దేవుని ప్రేమించి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను గైకొనునట్లు వారికి నేర్పెదమని మనము ఒడంబడితిమి. తాము సృష్టికర్త పోలికలను చేయబడితిమనియు క్రీస్తు తామనుసరించవలసిన మాదిరి పురుషుడనియు వారికి నేర్పించవలెను. రక్షణ జ్ఞానము కలిగించి జీవితము శీలము దైవాదర్శముతో అనుబంధపడునట్లు చేయు విద్య వారికి నేర్పుటకు శ్రద్ధ వహించవలెను. 96T 127;CChTel 384.3

    పని వారిని సరఫరా చేయుటకు గాను విద్యా సంస్థలు ఆయా దేశములలో నెలకొల్పబడవలెననియు అందు తెలివిగల విద్యార్థులు ప్రయోజనకరమైన ఆయా విద్యలయందును బైబిలు సత్యము నందును శిక్షణ పొందవలెనని దేవుడు కోరుచున్నాడు. ఈ వ్యక్తులు పనియందు ప్రవేశించినప్పుడు ప్రస్తుతకాల సత్యమును వారు నూత్న భూభాగములలో ఇతోధికముగా ప్రచారము చేసెదరు. CChTel 384.4

    మన ప్రాచిన మాట సంస్థల నుండి విష నెరీలుగా విదేశములు వెళ్లు వారికి శిక్షణ నిచ్చుటఏ గాక లోకములో ఆయ ప్రాంతముల యందున్న వ్యక్తులు తమ స్వజనుల కొరకు ఇరుగు పొరుగు వారి కొరకు పనిచేయు నిమిత్తము శిక్షణ పొందవలెను. సాధ్యమైనంత వరకు వారు తా మే పొలములో పనిచేయుచున్నారో ఆ పొలమందలి పాఠశాల విద్యనభ్యసించుట. శ్రేయము; క్షేమము కూడ. విద్య నిమిత్తము దూర దేశములకు వెళ్లుట పని వానికి గాని దైవసేవాభ్యున్నతికి గాని క్షేమకరము కాదు. 106T 137; CChTel 385.1

    తీర్పు దినమునందు నిర్దోషులముగా కనబడవలేనన్న మనకప్పగించ బడిన మహత్తర సేవ యందు ఆయా శాఖలలో పని చేయుటకు ఇతోధికముగా కృషిచేయవలసి యున్నాము. తమ పనిని పట్టుదలతోను నమ్మకముగా చేయు విదేశీయు పని వారు క్రీస్తు సేవకు అంతరాయము కలుగకుండునట్లు సమర్ధత గల వారి స్థాయిని ప్రతిభను బలపరచి ,క్రమ పరచి వున్నత స్థాయి ననుసరించి దానికి మెరుగుపెట్టుటకు మనము జ్ఞానయుతమయిన యేర్పాట్లు కావించవలెను. 11CT 43;CChTel 385.2