Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    టీ, కాఫీలు శరీర దార్ధ్యము కలిగించవు

    టీ ఉద్రేక పదార్ధముగా పనిచేయును. కొంతవరకు ఇది మత్తుపదార్థమును ఉత్పతి చేయును. కాఫీ తదితర పీనముల యొక్క ప్రభావము ఇట్టివే. దీని మొదటి ఫలితము చురుకుదనము, అన్నకొశపు నాడులు రెచ్చగొట్టబడును. ఇవి మెదడులో మంట పుట్టించును. ఇది తిరిగి హృదయములో అధికమయిన మంటను పుట్టించి శరీరమునకు క్షణిక ఉద్రేకమును పుట్టించును. ఆలసట మరువబడును, బలము అధికమయినట్లగపడును, వివేచన విస్త్రుదించును, ఊహ విస్పష్టమగును. CChTel 440.5

    ఈ ఫలితముల వలన అనేకులు టీ, కాఫీలు తమకు గొప్ప మేలు చేయుచున్నవని భావింతురు. కాని యిది పొరబాటు టీ కాఫీలు శరీర దార్ధ్యమునకు తోడ్సడవు. బలమువలె పైకగపడునది కేవలము నరముల ఉద్రేకము మాత్రమే. ఉద్రేక పదార్థ ప్రభావము అంతరించినప్పుడు అస్వాభావికమయిన ఆ త్రాణ అణగారి పోవును. తత్ఫలితముగా బడలిక, బలహీనత ప్రాప్తించును. CChTel 441.1

    నరములకు మంటపుట్టించు ఈ పదార్థములను నిత్యము వాడుట వలన తలనొప్పి, నిద్రలేమి, గుండెదడ, అజీర్తి, వణకు తదితర అనేక వ్యాధ్యులు సంప్రాప్తించును. కారణ మేమనగా నిని జీవశక్తులను హరించివేయును. అలసిన నరములకు విశ్రాంతి ప్రశాంతి అవసరముగాని ఉద్రిక్తత, అధిక శ్రమ అనవసరము. 18MH 326, 327;CChTel 441.2

    అనేకులు సత్యమునుండి తిరోగమించి టీ కాఫీలకు అలవాటుపడిరి. ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించు వరు మానసికముగా కన్నుగానక దైవ ధర్మశాస్త్రమును కూడ అతి క్రమించెదరు. 19Te 80;CChTel 441.3