Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆహారరేచ్చలను అదుపులో నుంచుట

    మానవుడెదుర్కోనవలసిన బలవత్తర శోధనలలో ఆహారేచ్చయొకటి. మనసుకును శరీరమునకును మధ్య ఒక అగోచరమైన , అద్భుతకరమైన సంబందము కలదు. అని ఒక దానిపై నొకటి పని చేయును. CChTel 416.3

    శరీరావయవములన్నియు సమిష్టిగా పనిచేయుటకుగాను ,శరీరము బలమును ఉత్పన్నము చేయునిమిత్తము దానిని ఆరోగ్యవంతముగా నుంచుట మన ప్రధమ కర్తవ్యము కావలెను. శరీరమును అలక్ష్యము చేయుట యనగా మనసును అలక్ష్యము చేయట యగును. దేవుని పిల్లలు రోగపీడిత దేహములు సంకుచిత మనస్సులు కలిగి యుండుట దేవునికి మహిమకరము కాజాలదు. రుచికి ఆరోగ్యమును బలిపెట్టుట జ్ఞానేంద్రియములను దుర్వ్నియోగము చేయుట యగును. తిండి కుడుపులయందు అమిత భొగముననుభవించువారు తమ శరీరశక్తులను వ్యర్ధపుచ్చెదరు. నైతిక శక్తులను బలహీనమొనర్చుకొనెదరు. దేహపు చట్టములను ఉల్లంఘించుట వలన కలుగు ప్రతిఫలమును వారు గ్రహించెదరు. 273T 485, 486;CChTel 416.4

    తిండిబోతు తినము వలన శరీరేచ్చలను తిర్చుకొనుట వలన అనేకులు కాయికమైన ,మానసికమైన పనిని చేయుటకు అసమర్ధులగుచున్నారు. మృగేచ్చలు బలపడుచున్నవి. నైతిక ,ఆధ్యాత్మిక స్వభావము దుర్భలమగుచున్నది. మహత్తరమగు తెల్లవి సింహాసనము చుట్టూ మనము నిలువబడునపుడు అనేకులు జీవితముల విషయము దాఖలైయున్నవి సంగతులు బయలుపర్చబడును. . దేవుడిచ్చన శక్తులను తాము దుర్వినియోగము చేయకున్నచో తామేమి చేయగలిగి యుండెడివారో అప్పుడు వారు చూచెదరు. తమకు దేవుడిచ్చిన మానసిక ,శారీరిక బలమును దేవునికిచ్చియున్నచో తామెట్టి మానసికౌన్నత్యమును పొందియుండెడివారో వారు గ్రహించెదరు. పరితప్త హ్యదయముతో వారు మరల జీవితము ప్రారంభించిన బాగుండునని తలంతురు. 285T 135;CChTel 417.1

    ప్రతి క్రైస్తవుడు తన ఆహారేచ్చను ,కోరికను అదుపు చేసికొనును. ఆహారరెచ్చయొక్క దాస్యమునుండి స్వతంత్రత పొందితేనే తప్ప అతడు క్రీస్తుకు యదార్ధ విధేయ సేవకుడు కాజాలడు. ఆహారవాంఛయు శారిరేచ్చలును హృదయముపై సత్యము చేయు పనిని నిరర్ధకము చేయుచున్నవి. ఆహారవాంఛ ,దురేచ్చలకు పశుడైన మనుజుని మనస్సును ,శరీరమును ,ఆత్మను సంపూర్ణముగా పవిత్రపరచుట పరిశుద్ధాత్మకును సత్యముయొక్క శక్తి కిని అసాధ్యమగును. 293T 569, 570;CChTel 417.2

    అరణ్యమందు క్రీస్తు దీర్ఘ ఉపవాసమును చేసినది మనకు ఆత్మోపేక్ష ,ఆశానిగ్రహముల ఆవశ్యకతను భొధించుటకే. ఇది మన భోజనపు బల్లయొద్ద ప్రారంభమై జీవిత ప్రతి కార్యమందును కచ్చితముగా నిర్వహించబడవలెను. మానవుడు తన బలహీనతను అధిగమించుటకు సాయము చేసి తానిచ్చు శక్తిద్వారా అతడు బలము పొంది రుచిని శరీరేచ్చలను జయించి అన్ని విషయములలోను విజయుడగునట్లు చేయుటకు రక్షకుడు లోకమునకు వచ్చెను. 303T 488. CChTel 417.3