Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 50 - మాంసాహారములు

    దేవుడు మన మొదటి తల్ల్లి దండ్రులకు మానవ సంతతి భుజించ వలెనని తానూ సంకల్పించిన ఆహరమునే యిచ్చెను. ఏ ప్రాణియు చనిపోవుట ఆయన కిష్టము లేదు. ఏదేను వనములో మరణము సంభవించుట ఆయన సంకల్పము కాదు. ఆ వనమందలి వ్యక్ష ఫలములు మానవుని కవసరమైన ఆహారము యుండెను. జల ప్రలయానంతరము వరకు మానవుడు మాంసము భుజించుటకు దేవుడు అనుమతించలేదు. మానవుడు భుజింపగల దంతయు నశించెను. కనుక తనతో ఓడలోనికి కొనిపోయిన పవిత్ర జంతువులు మాంసమును భుజింప వచ్చునని దేవుడు నోవహతొ చెప్పెను. కాని మాంసాహారము మానవుని ఆరోగ్యమునకు మంచిది కాదు. CChTel 418.1

    జల ప్రళయనంతరము పరజలు విరివిగా మాంసమునే భుజించిరి. మానవుని విధానములు చెడ్డవనియు సృష్టి కరతకు విరోధముగా నాతడు తన్ను తానూ హెచ్చించుకొని తన హృదయవాంఛలను అనుసరించు కొన్నట్లు దేవుడు చూచెను. దీర్ఘయువు కలిగి ఆ జనాంగము మాంసము తిని టం పాపభూయిష్టమైన ఆయుః ప్రమాణమును తగ్గించు కొనుటకు దేవుడంగికరించెను. జలప్రళయము తరువాత జనుల యెత్తు ,ఆయుర్ధయము క్షిణించెను. 1CD 373;CChTel 418.2

    మానవుడు తినవలసిన ఆహారమును ఏదేను వనములో నియమించుటద్వారా దేవుడు ఉత్తమాహార మేదో తెలియజేసెను. ఇశ్రాయేలీయులకు అరణ్యములో నియమించిన ఆహారము ద్వారా కూడ ఇదే పాఠమును ఆయన నేర్పించెను. వారిని ప్రపంచమునకు దివెనగను పాఠముగను నిలిపెను. ఈ కార్యసాధనకు ఆయన వారికి మాంసము కాక “ఆకాశములో నుండి ఆహారమును “అనగా మన్నాను అనుగ్రహించెను. వారి అసంతృప్తి వలన ఐగుప్తులో తాము తినని మాసము కొరకు వారు నణుగుకొనుటవలననే వారికి మాంసాహార మీయబడినది. ఇది కూడ స్వల్ప కాలమే ఇయ్యబడినది. అందువలన వేల జనులకు వ్యాధియే మరణములు సంప్రాప్తము లాయెను. అయినను మాంసాహార విసర్జనను వారు హృదయ పూర్వకముగా అం గీకరించలేదు. అది లోపాయ కారిగాసో బహిరంగముగానో సణుగుకొనుటకు అసంతృప్తి తెలుపుటకు కారణమైనది. కనుక అది స్థిరముగా బారికీయ బడలేదు. CChTel 418.3

    కావానులో స్థిరసివాసము లేర్పరుచుకొన్న పిదప ఇశ్రాయేలీయులకు మాంసాహారమియబడినది. కాని కొన్ని నిషేదములేర్పరచబడెను. ఈ నిషేదములు మాంసాహార దుష్ప లితములను కొంతవరకు తగ్గించినవి. పంది మాంసము, అపవిత్రములని యొంచబడిన యితర జంతువులు, పక్షులు, చేపల మాంసము నిషేధించబడెను. భుజించుటకు అనుమతించబడిన జంతువుల క్రొవ్వు, రక్తము నిషేధించబడెను. CChTel 419.1

    ఆరోగ్యముగానున్న జంతువులే ఆహారముగా ఉపయోగించబడెను. చీల్చబడిన జంతువు, తనంతట తానే చచ్చిన జంతువు లేక రక్తము చిందించబడని జంతువును భుజించరాదు. ఆహార విషయము దేవుడు చేసిన యేర్పాటును ఉల్లంఘించుట వలన ఇశ్రాయేలీయులు గొప్ప నష్టమునకు గురియై రి. వారు మాంసాహారమును ఆపేక్షించి వాని ఫలితములను అనుభవించిరి. వారు దేవుని శీల ప్రామాణ్యమును చేరిలేకుండిరి. ఆయన సంకల్పమును కొనసాగించలేకపోయిరి. “వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను” కీర్తి. 106:15. ఇహలోక విషయములను పసలోక విషయములకన్న వారెక్కువగా భావించి ఆయన వారి కొరకు సంకల్పించిన పవిత్ర ప్రాధాన్యతను సంపాదించలేక పోయిరి. CChTel 419.2

    మాంసము భుజించు వారు పరోక్షముగా పప్పు దినుసులను మాత్రమే భుజించుచున్నారు, ఏలయనగా జంతువులు వాని నుండి పెరుగుదలకు కావలసిన ఆహారమును సేకరించు చున్నవి. గింజలలోను కూరగాయలలోను ఉన్న జీవము భుజించు ప్రాణియందు ప్రవేశించును. ఆ జంతు మాంసము తినుటద్వారా దానిని మనము పొందుట యెంత ఉత్తమము! 2MH 311-313;CChTel 419.3