Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దుర్బోధ చేయువారికి హితవు

    తను స్వకీయ బాధ్యత ఒక వార్త మానమును ప్రకటించుబూనుకొని దేవుని వలన ఉపదేశించబడి నడిపించబడుచున్నామని చెప్పుకొనుచు అనేక సంవత్సరములుగా దేవుడు నిర్మించిన సేవను విచ్చిన్నము చేయుట తమ ప్రత్యక కర్తవ్యముగా ఎంచువారు దేవుని చిత్తమును జరిగించువారు కానేకారు. ఈ మనష్యులు మహావంచకుని పక్షము వారిని గ్రహింపనగును. వారిని నమ్మవలదు. CChTel 154.1

    ధనమునకును,సామర్ధ్యమునకును ధర్మకర్తలుగా నియమింపబడిన మీరు దుర్బొధలు చేయుటలో మీ ప్రభువు యొక్క సొమ్మును దుర్విని యోగ పర్చుచున్నారు. దేవుని ధర్మ శాస్త్రవిధులను ఆచరించుడని ప్రకతిన్చువారి పట్ల యావత్ర్పపంచము ద్వేష భావమును కలిగియున్నది. యోహోవాయందు బహ్క్తి విశ్వాసములుకల సంఘము అసాధారణ యుద్ధ మందు పాల్గొన వలసి. “యున్నది ఏలయనగా మనము పోరాడునది శరీరులతో ;కాదు ;పర్ధనుల తోనూ ,అధికారులతోను ,ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతొను పోరడుచున్నాము. ”ఎఫెసి 6:12. ఈ పోరాటముయొక్క భావనమును గ్రహించువారు పోరాడుచున్న సంఘముపై తమ యుద్దాస్త్రములను ప్రయోగింపక తమ యావచ్చక్తిని వినియోగించి దైవజనులతో కలిసి దుష్టుని పటాలముతో యుద్దము చేసెదరు. 102TT 356, 357. CChTel 154.2