Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వ్యక్తిగత తీర్మనము ఉత్తమమైనదని తలంచుట అపాయము

    తమ వ్యక్తిగత తీర్మానమే ఉత్తమమైనదని తలంచువారు గొప్ప అపాయమందునారు. భూమిపై తన పనియందు వెలుగు సాధనములుగ నుపయోగించి దేవుడు తన పనిని ఎవరిద్వారా స్థాపింఛి, వృద్ధి చేసి వెలుగునందింతురో అట్టి వారి విడదీయుట సైతాను నిర్దుష్ట కృషియై యున్నది. సత్యాభివృద్ధి కొరకు నాయకత్వ బాధ్యతలు వహించు నిమిత్తము దేవుడు నియామకము చేసిన వారిని సరకు చేయక విసర్జించుట, తన ప్రజలకు సహాయము, ప్రోత్సాహము , బలము కలుగుటక దేవుడు నిర్ణయించిన సాధనములను విసర్జించుటయే యుగును. దేవుని సేవయందున ఏపని వాడైనను తనకు నడుపుదల మరి ఎవరిద్వారా కాకండ సరాసరి దేవునివద్ద నుండే రావలెనని తలంచుట శత్రువుచే మోసగించబడి పదవీ భ్రష్టు డగుటక తావిచ్చుచున్నాడు. CChTel 159.1

    విశ్వాసులు నిలుపుకొనిన వలసిన యదార్ధ సంబంధము ద్వారా క్రైస్తవు తోను, సంఘముతోను ఏకము కావలెన ప్రభువు జ్ఞానయుగతముగా ఏర్పాటుచేస యున్నాడు. ఇట్లు దేవునితో మానవ ప్రతినిధి సపాకరించ వీలగును. దైవకృపా శుభవార్తను ప్రపంచమున కందించుటకగాను నేర్పుతో స్థాపించబడి నడిపించబడుచున్న ఉద్యమములో పాల్గొనుటక విశ్వాసులందరు ఏకము చేయడెదరు. 8A. A. 164;CChTel 159.2

    మానవు వివిధవయవములు కలిసి శరీరమై యావశ్చరీరమును పాలించు మెదడుకు లోబడి దాని దాని పనులను చేయుచున్న రీతిగా క్రీస్తు సంఘ సభ్యులు సంపూర్ణ శరీరముగా ఏకస్థమై సర్వమును పాలించు పవిత్ర కట్టడలకు లోబడి యుండవలెను. 9IT T 443;CChTel 159.3