Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సంఘ సభికులకు శిక్షణ నిచ్చు పనివారు

    తమ్మునుతాము ఉపేక్షించుకొను పనివారి సమూహము అనేక ప్రసంగములు చేయుట వలన ఏర్పడినది కాదని రూఢఉగుచున్నాది. ఈ యంశము గంబీర ఫలితములుగలదిగా పరిగణించబడవలెను. నిత్యజీవన సంబంధమగు మన భవితవ్యము అపాయమందున్నది. వెలుగును పిస్తరింపచేయుటలో సంఘములు తమ తలాంతులను ఉపయోగించని హేతువుచేత అవి ఎండి పోవుచున్నవి. ఎల్లరు తమకున్న వెలుగును ప్రయోజనాత్మకముగా వినియోగించులాగున జగ్రత్తగా ఉపదేశము నీయవలెను. ఇవి ప్రభువువద్ద నుండి పాఠములుగా నుండును సంఘనాకులు సామర్థ్యముగల సభికులకు ఎన్నుకోని వారికి బాధ్యతల నిచ్చి ఇతరులమధ్య సేవచేసి వారికి మేలుకరముగా జీవించుటలో ఉత్తమ మార్గములను వారికి ఉపదేవించవలేను. 146T 431;CChTel 100.4

    సాంకేతిక నిపుణులు, న్యాయవాదులు, వివిధవ్యాపారములు, వృత్తులు గలవారు తమతమ పనులయందు నైపుణ్యమును సంపాదింతురు. క్రీస్తు అనుచరులు స్వల్పజ్ఞానముగలవారై యుండవలెనా? ఆయన సేవ చేయుచాన్నామని చెప్పుకొనుచు ఉపయోగించవలసిన పద్థుతుల నిమిత్తము అజ్ఞానులము కావలెనా? నిత్యజీవన సముపార్జకార్యము ఐహిక విషయములన్నింటిని కన్న ఉన్నతమైనది. క్రీస్తు చెంతకు ఆత్మలను నడుపుటకుగాను మానవ స్వభామును గూర్చిన జ్ఞానాము, మానవ మనఃపఠనము అవసరము సత్యము అను మహత్తరంశముతో స్త్రీ పురుషులను సంధించుటకూ దూరదృష్టి, బలరత్తర ప్రార్థన ఆవశ్యకమలు. 154T 67;CChTel 101.1

    ఒక సంఘము ఏర్పడిన వెంటనే బోధకుడు సంఘస్థులకు పని పూరమాయించవలెను. విజయంతంముగా పనిచేయుట యెట్లో వారికి నేర్పవలెను. బోధించుటకన్న నేర్పించుటకు బోధకుడెక్కువ సమయమును నినియోగించవలెను. ప్రజలు తాము పోందిన జ్ఞానమును ఇతరులకు ఎట్లు ఇయ్యవలలెనో వారికాతడు నేర్పవలెను. క్రొత్తగా సంఘమందు ప్రవేశించిన వారు సనియందెక్కువ అనుభవముగాలవారికడ సలహలు పొందునట్లు తర్బీతు చేయబడవలెను అంతేకాదు, బోధకుని దేవుని స్థానమున పెట్టకుండ సభికులకు శిక్షణనియ్యవలెను. CChTel 101.2

    దేవుని కొరకు పనియేయుచు బోధకులమీదగాక దేవునిమీదనే ఆధారపడియండునట్లు నేర్పుటయే మన ప్రజలకు చేవలసిన మహత్తర సహాయయు. క్రీస్తువలె పనిచేయుట వారికి నేర్పుడి. వారాయన సేవకదళమందు జేరి ఆయన కొరకు నమ్మకముగా పనియేవలెను. 167T 19, 20CChTel 101.3

    ప్రజలమధ్య పనిచేయుటలో ఉపాధ్యాయులు ముందు నడువవలెను. వారితో కలసి పనిచేయువారు వారి మాదిరినిబట్టి నేర్చునేదురు. అనేక సద్బోధలకన్న ఒక సత్క్రియ యోగ్యమైనది. 17MH 149;CChTel 101.4

    ప్రతి సభికుడు దేవుని సేవయందు పాల్గొనుటకుగాను సంఘముపై ఆధ్యాత్మిక పర్యవేక్షనగావారు అవకాశములు కల్పిండలెను. గతమున ఇది చేయబడలేదు. సభ్యులు సామర్థ్యమును సువార్త సేవలో వినియోగించుటకుగల ఏర్పాట్లు సంపూర్ణ సాఫల్యమునకు తేబడలేదు. దీవివలన ఎంత నష్టము కలిగినదో గ్రహించగలిగినవారు చాల తక్కుమంది. CChTel 102.1

    ప్రతి సంఘమందును తలాంతు గలదు. సరియైన కృషి వలన ఆ తలాంతు ఈ పనియందు గొప్ప సహాయముగా పరిణపమించవచ్చును. సంఘాభివృద్ది కొరకును అన్యుల కొరకును సభికులు పనియేయు నిమిత్తము వారికుపదేశము నిచ్చుటకుగాను పనివారిని నియమించుటకు క్రమబద్దమగు ఏర్పాట్లు జరరుగవలెను. శిక్షణ విద్య ఆవశ్యకములు. ఎల్లరునుతమకు యుక్తమైన పని చేయుటుకు తమ్మునుతాము సమర్థులుగా జేసికొనుచు ప్రస్తుతకాల కర్తవ్యముపట్ల తమ హృదయములను, మనస్సులను వివేకవంతములు చేసికొనవలెను. CChTel 102.2

    ఇప్పుడు మన సంఘముల పురోభివృద్ది కవసరమగు తలాంతును గ్రహించి దానిని సంఘమందు పెంపుచేయుటుకుగాను తెకలివితేటలుగల పనివారి నేర్పరితనము అగత్యము. ఇది ప్రభువు సేవ నిమత్తము తర్బీతు చేయవలసిన తలాంతు. సంఘములను సందర్శించుట ద్వారా సేవజేయువారు సహోదరులు సహోదరీలు సువార్త పనిచేయు నిమిత్తము వారికి ప్రయోగాత్మకమైన పద్ధతులను నేర్పవలెను. యువజనుల శిక్షణకొరకు కూడ ఒక తరగతిని ఏర్పాటు చేయవలెను. యువకులు యువతులు తమ గృహములందును, పరిసరప్రాంతములందును, సంఘమందును పనివారుగా నుండునట్లు తర్బీతు చేయబడవలెను. 18An Appeal to Ministers and Church OfficersCChTel 102.3

    జరగవలసిన మహత్తర కార్యమందు తమతో సహకరించు నిమత్తము మానవ ప్రతి నిధుల కోరకు అనగా సంఘసభికుల కొరకు పరలోక దూతలు వేచియున్నారు. వారు మీ కొరకే వేచియున్నారు. దైవశక్తి సాధనములుగా ప్రతి పరిశుద్ద హృదయము సేవలో చేర్చు కొనబడగలిగినంత విస్తారమైనా పొలము, విస్త్రతమైనా ప్రణాళిక ఉన్నవి. 199T 46, 47; CChTel 102.4

    ఒకే కార్యసాధనకు ఒకే శక్తి మార్గదర్శకత్వము క్రింద, ఒకే త్రాటిపై పురోగమించుచు, క్రైస్తవులు సమిష్టిగా పని చేసినచో వారు ప్రపంచమును ఉర్రూత లూగించగలరు. 209T221;CChTel 102.5

    “రహదారులలో” చాటించబడవలసిన వార్తను ప్రపంచ కార్యకత్తలకు, ప్రజాగురువులకు, నాయకులకు ప్రకటించవలెను. ప్రజాజీవితంమందు గురుతర బాధ్యతను వహించు వైద్యులు, ఉపాధ్యాయులు, న్యావాదులు, న్యామూర్తులు, ఆఫీసరులు, వ్యాపారులు విరికి సుస్పష్ట వార్త మానమునందించవలెను. “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మార్కు 8ఫ36,37,CChTel 102.6

    అనదరణచేయబడు బీదలనుగూర్చి మనమెక్కవ మాట్లాడుదుము, ఎక్కువ వ్రాయదుము. అనాదరణ చేయబడు ధనికులను గూర్చికూడా కొంత యోజింపవద్దా? ధనిక వర్గమును నిరీక్షణలేని వర్గముగా కొందరు పరిగణింతురు. సైతాను శక్తి వలన మోసపోయి తను రక్షణనూగూర్చితలంచలేని భాగ్యవంతులకొరకు వారేమియు చేయరు. రక్షణకు అతీతులని తలంచి వారిని నిర్లక్ష్యము చేతురు. నిరీక్షణలేని వారిగా ఎంచబడినందున వేలకొలది ధనికులు హెచ్చరిక పొందకయే తమ సమాధులలోనికి పోయిరి. కాని రక్షణాసక్తిలేనివారిగా పైకగపడినను ఈ వర్గములో ననేకులు రక్షణకాంక్ష కలిగియున్నట్లు నాకు చూపబడిరి. వేలకొలది ధనికులు ఆత్మీయాహారము కొరకు తమతమ పడుచున్నారు. చాలమంది ఉద్యోగులు తమ కొరతను తీర్చుకొనవలసిన అవశ్యకతను గుర్తించుచున్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే గుడుకి వెళ్లుదురు. కారమేమనగా వానివాలన తమకు కలుగు లాభమే మియు లేదని వారు తలంతురు. తాము వినుబోధ వారికి అంతఃప్రేరణ కలిగించదు. వీరి పక్షము వ్యక్తిగతముగా మనము కృషిచేయక యుందుమా?CChTel 103.1

    పత్రికలతో వీరిని సంధించలేమా? అని కొందరడిగెదరు. ఈ విధముగా మనము సంధించలేనివారనేకులు కలరు. వారికి అవసరమైనది వ్యక్తిగతసేవ. ప్రత్యేక హెచ్చరిక పొందకుండగానే వారు నశించవలెనా? పూర్వకాలమున ఇది సంభవించలేదు. యేసుక్రీస్తు ప్రభువునందే తమకు శాంతి లభించగలదని ఉన్నతాధికులకు చెప్పు నిమత్తము దైవసేవకలు పంపబడిరి. CChTel 103.2

    పతిత మానవాళిని రక్షించుటకు పరలోకరాజు మన ప్రపంచమునకు వచ్చేను. ఆయన నిన్నుజాతీయుల కొరకేగాక ఉన్నత, గౌరవస్థానములందున్నవారి కొరకుకూడా పాటుపడెను. దేవుని నెరుగక ఆయన ఆజ్ఞలను గైకొనకున్న అగ్రకుస్థులకొరకు ఆయన నేర్పుతో పని చేసేను. CChTel 103.3

    క్రీస్తు ఆరోహణానంతరము కూడ ఇదే పని కొనసాగినది. కొర్నేలియసు నందు ప్రభువు చూపిన ఈఆసక్తిగూర్చి చదువునపుడునా హృదయము ఆవేవపూరితమగును. కొర్నేలియసు రోమా వటాలమందు ఒక ఉన్నతాధికారి. తనకు కలిగిన వెలుగు అంతటిని అనుసరించి అతడు కచ్చితముగా జీవించుచుండెను. పరలోకమునుండి ప్రభువాతనికొక ప్రత్యేక వర్తమానమం పెను. మరియెక వర్తమానము ఇచ్చి ఆతనిని దర్మించి వెలుగు నిచ్చుటకు ప్రభువు సేతురును పంపించెను. వెలుగు కొరకు అన్వేషంచును ప్రార్థించువారిపట్ల దేవుని ప్రేమాదరములనుగూర్చి తలంచుటలో నిది మనకు ప్రోత్సాహమునీవలెను. CChTel 103.4

    అనేకులు కొర్నేలిసువలె నున్నట్లు నాకు కనపర్చబడిరి. వారిని తన సంఘములో చేర్చవలెనని దేవుని వాంచ. ప్రభువు నాజ్ఞలు కాపాడు జనాంగముపై వారు సానుభూతి చూపెదరు. కాని వారి ప్రపంచబంధములు వారిని గట్టిగా పట్టుకొను చున్నవి. నిమ్మ జాతీయులతో కలసి యుండుటకు వారికి నైతికముగా ధైర్యము చాలకున్నది. CChTel 104.1

    వారి బాధ్యతలు శోధనలు కారణముగా వీరికొరకు మన ప్రత్యేక కృషి అవసరము. కనుక ఈ ఆత్మల కొరకు మనము ప్రత్యేక ప్రయత్నములు సలుపవలసి యున్నాము. ప్రపంచ మందు పలుకుబడి, అధికారముగా వ్యక్తులతో “ప్రభువిట్లు చెప్పుచున్నాడు” అని విస్పష్టముగా చెప్పుట అవసరమని నాకీయబడిన వెలుగునుబట్టి గ్రాహ్యమగుచున్నది. వారు దేవుని గృహనిర్వాహకులు, దేవుడు నాకీయబడిన వెలుగునుబట్టి గ్రాహ్యమగుచున్నది. వారు దేవుని గృహనిర్వకులు. దేవుడు వారికి ప్రముఖ విషయములను అప్పగించెను. ఆయన పిలుపును వారంగీకరించినచో దేవుడు వారిని తన సేవలో నుపయోగించునుCChTel 104.2

    ఆగ్రజాతీయులకొరకు పనిచేయుటకు మిక్కిలి సమర్థులగువారు కొందరున్నారు. ఈ వ్యక్తులనుట్లు కలసికొనవలెనో అను విషయమును దీర్ఘముగా ఆలోచించుచు వీరు అను దినము ప్రభువుకు ప్రార్థించవలెను. వారితో ఆషామాషీ పరిచయము కలిగించుకొనక వారి ఆత్మల విషయము ప్రగాఢ ప్రేమ ప్రదర్శించుచు వ్యక్తిగత సేవద్వారాను సజీవ విశ్వాసము ద్వారాను వారిని సంధించుచు దైవగ్రంథమందున్నరీతిగా వారు సత్యమును గ్రహించవలెనని వాస్తవమైన పట్టు దల చూపవలెను. 216T 78-81. CChTel 104.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents