Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆరోగ్య సంస్కరణ సూత్రముల అవలంబన

    భోజన సంస్కరణమందు నిజముగా విజ్ఞతయున్నది. ఈ యంశమును విస్తృతము గాను గాముగాను పఠించ వలెను. అన్ని విషయములలోను ఇతరుల అభ్యాసములు తన అభ్యాసముల వలె నుండనందున ఎవరును ఇతరులను ఆక్షేపించరాదు. అందరి అలవాటులు ఒకే విధముగ నుండవు. ఏ వ్యక్తియు ఇతరులకు తానే ప్రామాణిక వ్యక్తినని తలపరాదు. CChTel 414.1

    అందరు ఒకే విధమైన ఆహారమును భుజించలేరు. ఒకనికి రుచికరముగను, ఆరోగ్యకరము గను ఉండు ఆహారము మరియొకనికి రుచిలేనిది కావచ్చును. ఇంకొకనికది హానికరము కూడ కావచ్చును కొందరు పాలనుపయోగింపజాలరు: మరికొందరికి పాలు ఆరోగ్యదాయకముగనుండును. కొందరు బఠాణీలను, చిక్కుడు కాయలను జీర్ణించుకొనలేరు. మరి కొందరికవవి ఆరోగ్యదాయకములు. కొందరికి దంపుడు, ముతక బియ్యము పప్పుదినుసులతో తయారు చేయబడు ఆహారము బాగుండును, ఇంకొక తెగకది సరిపడదు. 23MH 319, 320;CChTel 414.2

    ఆహారము విషయము దురభ్యాసములున్నచో వానిని వెంటనే సరిదిద్దుకొనుట మేలు, చెడు తిండ్ల ఫలితముగా అజీర్తిరోగము ప్రాప్తించినచే ఎక్కువ భారము కలిగించు ఆహార పదార్థాములను మానుటద్వారా మిగిలిన త్రాణను కాపాడుకొనవలెను. దీర్ఘకాలము అక్రమ భోజనము వలన చెడిన అన్నకోశమునకు తిరిగి ఆరోగ్యమును సంపూర్ణముగా సంప్రాప్తనుగుట సాధ్యముకాక పోవచ్చును. కాని ఆహారమందు సరియగు విధానమవలంబించినచో ఇంగుట సాధ్యముకాక పోవచ్చును. పెక్కురు దాదాపు సంపూర్ణారోగ్యమును సంపాదించెదరు. CChTel 414.3

    కూర్చోని పనిచేయు వారివలె బలము కలిగి కాయకష్టముచేయు వ్యక్తులు తామే యాహారము భుజింపవలెనో యెంత ఆహారము భుజింపవలెనో అను విషయమందు ఒత్తిడి చేయబడనక్కరలేదు. వీరు కూడ ఆహారపానీయముఖలయందు ఆత్మ నిగ్రహము కలిగి యున్నతో మారోగ్యమును పొందవచ్చును. CChTel 414.4

    తమ ఆహారము విషయము ఒక కచ్చితమగు నియమము ఏర్పరచిన బాగుండునని కొందరు తలంచెదరు. ఒక వ్యక్తి మరియొక వ్యక్తి నిమిత్తము నిష్కర్షయగు నిబంధనచేయజాలడు. ప్రతి వ్యక్తి తన వివేచనము ఆత్మనిగ్రహమును ఉపయోగించి ఒక నియమమునకు కట్టుబడి యుండవలెను. 24MH 308, 310;CChTel 415.1

    భోజన సంస్కరణము క్రమక్రమముగా పురోగమించవలెను. జంతువులలో రోగము అధికమగుకొలది పాలు, గ్రుడ్లు ఉపయోగించుట క్షేమకరము కాదు. చౌకయగు, ఆరోగ్య దాయకములగు పదార్థములను వానిబదులు ఉపయోగించవలెను. సాధ్యమైనంత వరకు పాలు గ్రుడ్లు లేకుండగనే ఆరోగ్యదాయకమయిన. రుచికరమయిన ఆహారమును తయారుచేయు విధానమును ప్రజలందరికి నేర్పించవలెను. CChTel 415.2

    శరీరమును అలక్ష్యము చేసినపుడు లేక దుర్వినియోగము చేసినపుడు దేవునికి అగౌరవము కలుగుచున్నది. ఇట్లు అది ఆయన సేవకు ఆయోగ్యమగు చున్నది. రుచికరమూన, బలవర్థకమయిన ఆహారము నిచ్చుటద్వారా శరీరమును గూర్చి శ్రద్ద వహించుట గృహస్థుని ప్రథమ కర్తవ్యము, ఆహారమును తగ్గించుకొనుటకన్న విలువగల దుస్తులనుగాని సామగ్రిని గాని కొనదుండుట యెంతయో ఉత్తమము. CChTel 415.3

    అధిక ధనము వ్యయించి అతిథులకు సత్కారము చేయుటకు కొందరు తమ కుటుంబాహారమును తగ్గించెదరు. ఇది అవివేకము, అతిథులను సత్కరించుటలో నెక్కువ సామాన్యతను ప్రదర్శించవలెను. కుటుంబావసరములను ముందు తీర్చవలెను. CChTel 415.4

    అధిక ధన వ్యయము అస్వాభావికాచారములు అవసరమగుచోట్ల దయాళుత్వము చూపుటకు వీలు లేకుండ చేయుచున్నవి. తలవని తలంపుగా అతిథి వచ్చినపుడు అతని కొరకు ఆహరమును తయారు చేయుటకు భార్య శ్రమపడనక్కరలేకుండ సరిపోవు ఆహరము మన గృహములందె అదనముగా నుండవలెను. CChTel 415.5

    ఆహారమును గూర్చి జాగ్రత్తగా యోచించండి. కారణ ఫలితములను గూర్చియోచన చేయండి. ఎక్కువ తినుటద్వారా అన్నకోశము నెన్నడును దుర్వినియోగము చేయకుడి. కాని ఆరోగ్యసూత్రములను మంచి ఆహారమును చాలినంత భుజించండి. CChTel 415.6

    ఆరోగ్య సూత్రములను గ్రహించి నియమమునకు కట్టుబడువారు అనుభూతియందును, నిర్భంధములయందును అమితముగా నుండరు. కేవలము రుచి కొరకుగాక శరీర క్షేమము నిమిత్తము వారు ఆహారమును ఎన్నుకొనవలెను. దేవునికి మానవులకి ఉత్తమ సేవ చేయుటకు వారు తమ ప్రతిశక్తిని కాపడుకోనేదరు. వారి ఆహార వాంఛ వివేచన, మన స్సాక్షి అదుపులో నుండును. తత్ఫలితముగా వారికి శారీరిక మానసిక ఆరోగ్యము లభ్యమగును. ఇతరులకు ఎవగించునంతగా తమ ద్రుక్పధమును వెల్లడించరు గనుక సత్యసూత్రముల తరపున వారి ఆదర్శము ఒక సాక్ష్యముగ నుండును. ఈ వ్యక్తుల పలుకుబడి యితరుల మేలుకు దోహదకరముగ నుండును. 25MH 319-323;CChTel 415.7

    ఇతర దినములకన్న సబ్బాతు దినమున మనము ఎక్కువ వంటకములను తయారు చేసి కొనరాదు. దీనికి బదులు ఆహారము అతిసామాన్యముగా నుండవలెను. ఆ దినమందు తక్కువ భుజించవలెను. ఇట్లు చేసినచో ఆధ్యాత్మిక విషయములను గ్రహించుటకు మనసు నిర్మలముగను బలవత్తరముగను ఉండును. CChTel 416.1

    సబ్బాతు దినమున వంట చేయుట మానవలెను. అయినను కాహ్ల్లని భోజనము తిన వలసిన ఆగత్యములేదు. చలికాలమందు ముందటి దినమున తయారు చేయబడిన ఆహారము వేడిచేయబడవలెను. భోజనము సామన్యమైనను రుచికరముగను, ఆకర్షకముగను ఉండవలెను. ముఖ్యముగ పిల్లలున్న కుటుంబములలో అనుదినము సాధారణముగా వుందని ఒక ప్రత్యేకమయిన వంటకమును సబ్బాతు దినమున తయారు చేయుట మంచిది 26MH 307;CChTel 416.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents