Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సౌశీలాభివృద్ధి యొక్క ప్రాముఖ్యత

    దేవుడు తల్లిదండ్రులకు తమ పనిని నియమించియున్నాడు. దైవాదర్శము ప్రకారము వారు తమ బిడ్డల శీలమును తీర్చిదిద్దుటయే యీ పని. ఆయన కృపద్వారా వారి కార్యమును సాధించగలరు. వారి చిత్తమును నడిపించి వారి యాశలను అదుపు చేయుటకు ఓరిమి, విశేష కృషి, పట్టుదల, ధృఢసంకల్పము అవసరము. సాగుచేయని పొలము పండ్లతోను, ముండ్ల పొదలతోను నిండియుండును. పంటను ప్రయోజనము కొరకు రమ్యత కొరకు పండిరచదలచినవాడు ముందు భూమిని దున్ని, విత్తనములు విత్తి, మొలకల చుట్టూ త్రవ్వి కలుపు తీసి భూమిని మెత్తపరచవలెను. అప్పుడు మొక్కలు ఏపుగా పెరిగి తన కృషికి తగినట్లుగా పుష్కలముగా ఫలించును. CChTel 376.1

    మానవుల కీయబడిన ప్రవర్తనా నిర్మాణము విశేష ప్రాముఖ్యత గలది. దీని విషయము శ్రద్ధ వహించవలసిన అగత్యము ముందెన్నటికన్న ఇప్పుడు అధికముగా ఏర్పడినది. ఇంతటి క్లిష్ట సమస్యలు మరే యుగమందును పొటమరించలేదు. నేటి యువకులను యువతులను అవహించిన అపాయములు ఇతఃపూర్వము ఏ యువకులను యువతులను ఆవహించియుండలేదు. 26CG 169;CChTel 376.2

    చిత్తశక్తి, ఆత్మ నిగ్రహశక్తి ఈ రెండును శీలధారుడ్యమునకు ప్రాతిపదికలు. అదుపుచేయజాలని బలవత్తరమయిన శరీర శ ప్రవర్తనా ధారుడ్యమని అనేక యువజనులు అపోహపడుచున్నారు. వాస్తవమేమనగా శరీరేచ్ఛలకు లొంగువాడు బల హీనుడు. ఒక మనుజుని గొప్పతనము, అతడు స్వాధీనపరచుకొను ఉద్రిక్తతను బట్టి బయలుపడునుగాని అతనిని స్వాధీనపరచుకొను ఉద్రిక్తతను బట్టి కాదు. తనకు జరిగిన అన్యాయమును గుర్తించకుండ కోపమును స్వాధీనమందుంచి తన శత్రువులను క్షమించువాడే బలాఢ్యుడు. అట్టివారే నిజమయిన శూరులు. CChTel 376.3

    ఎదుగు బొదుగులు లేక సంకుచితబుద్ది కలిగి యుండుట వలన వారికి రాగల స్థితిని గూర్చి అనేకులు ఎక్కువగా తలంచరు. అట్లుగాక దేవుడనుగ్రహించిన శక్తులను వృద్ది చేసి కొన్నచో మంచి శీలము సాధించి క్రీస్తు చెంతకు ఆత్మలను చేర్చగల ప్రభావమును వారు కలిగియుండవచ్చును. జ్ఞానమే శక్తి; హృదయశుద్ధి లేనిజ్ఞాని హానికరుడగును. CChTel 376.4

    దేవుడు మనకు ప్రతిభాశక్తిని నైతిక శక్తులను అనుగ్రహించెను. కాని యెక్కువ భాగము ప్రతి వ్యక్తి తన స్వీయ గుణశీల నిర్మాణకుడై యున్నాడు. అనుదినము ఈ నిర్మా ణము వృద్ధిగాంచును. మన నిర్మాణ విధమును గూర్చి జాగ్రత్తగా నుండవలెననియు నీ కట్టడమును యుగ యుగముల శిలపై నిర్మించవలెననియు దేవుని వాక్యము హెచ్చరించుచున్నవి. మన పని ఉన్నదున్నట్టుగా ప్రత్యక్షమగు సమయము ఆసన్నమగుచున్నది. ఇక్కడ ఉపయోగకరముగానుండి తదనంతర ఉన్నత జీవితము కొరకు ఉపకరించు శీలములను సాధించుటలో దేవుడిచ్చిన శక్తులను ఉపయోగించుటకిదే అనుకూల సమయము. CChTel 376.5

    ఎంత కొరగానిదైనప్పటికిని ప్రతి కార్య ప్రభావము శీలశుద్ధికి తోడ్పడును. లోక సంపదలకన్న సచ్ఛీలము ఎక్కువ నిలువగలది. అట్టి శీల సాధన ప్రక్రియ ఉత్తమమైనది. దీని యందెల్లరును పాల్గొనుట శ్రేయస్కరము. CChTel 377.1

    పరిస్థితుల వలన ఏర్పడిన ప్రవర్తనలు మారి పరస్పర విరుద్ధమైన భాగములతో నిండుకొనియుండును. అట్టి శీలములు కలవారికి తమ జీవితమునందు ఉన్నతాదర్శము కాని లక్ష్యముగాని యుండదు. ఇతరుల శీలములను సమున్నతములు చేయు పలుకుబడిని వారు కలిగియుందురు. అవి అర్థ రహితములును శక్తి శూన్యమలునునై యున్నవి. CChTel 377.2

    ఇక్కడ మనకనుగ్రహించబడిన అల్పాయువును మనము జ్ఞానయుతముగా వినియోగించుకొనవలెను. తన సంఘము సజీవమైనదై, భక్తి కలదై పనిచేయవలెనని దేవుని వాంఛ. కాని మన ప్రజలు దీనిని చేయుటలేదు. మాదిరి పురుషుని అవలభించుచు దేవుని గూర్చి సత్యమును గూర్చి తమ పలుకుబడి ద్వారా సాక్ష్యమిచ్చు చురుకైన, సజీవ క్రైస్తవులుగా నుండుటకు బలమైన ధైర్యముగల వ్యక్తులను దేవుడాహ్వానించుచున్నాడు. ప్రభువు మనకు అతి ముఖ్యమైన గంభీరమయిన సత్యములను ఒక పవిత్ర విధిగా అప్పగించియున్నాడు. ఆ సత్య ప్రభావమును మనము మన జీవితములలోను ప్రవర్తన యందును కనపర్చవలెను. 274T 656, 657;CChTel 377.3