Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రైస్తవ విద్యా ఫలితములు

    “హోసన్న ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక” అని పిల్లలు దేవాలయ ప్రాంగణమందు పాడిన విధముగా ఈ కడపరి దినములలో కూడ లోకమునకు తుది హెచ్చరికా వర్తమానము నందించుటలో పిల్లలు తమ స్వరములను ఎత్తెదరు. పెద్దవారు సత్యమును ప్రకటించుటకు వీలులేదని పరలోకవాసులు గుర్తించినపుడు చిన్న పిల్లల పైకి దేవుని ఆత్మ దిగి వచ్చును. పెద్దవారు చేయలేని పనిని చిన్న పిల్లలు చేసెదరు. ఏలయనగా పెద్దవారి మార్గమున అవరోధములుంచబడినవి. CChTel 395.1

    ఈ మహత్తర సేవకు చిన్న పిల్లలను తయారుచేయుటకే మన సంఘ పాఠశాలలు స్థాపితమైనవి. ఇక్కడ పిల్లలకు ప్రస్తుతకాల మహత్తర సత్యములు నేర్పి వారికి మిషనెరీ సేవయందు శిక్షణ నీయవలెను. వ్యాధిగ్రస్తులకు, బాధపడుచున్నవారికి ఉపచర్య చేయుటకు వారు పనివారి సిబ్బందిలో చేర్చుకొనబడవలెను. చిన్నపిల్లలు వైద్య మిషనెరీ సేవలో పాల్గొనవచ్చును. వారు తమ స్వల్ప కృషి వలన ఆ సేవను పురోగమింపజేయగలరు. వారి సాయము స్వల్పమే కావచ్చును. అయినను కొంతకు కొంత సహాయపడును. వారి కృషి ఫలితముగా అనేకులు సత్యము నంగీకరించెదరు. వారి ద్వారా దేవుని వార్తయు ఆయన రక్షణార్థమైన ఆరోగ్యమును సర్వరాష్ట్రములకు అందించబడును. కనుక మందలోని గొర్రె పిల్లల విషయము సంఘము శ్రద్ధ వహించవలెను. దేవుని సేవ చేయుటకు పిల్లలు శిక్షణను విద్యను పొందవలెను. ఏలయనగా వారు దేవుని స్వాస్థ్యమై యున్నారు. CChTel 395.2

    సక్రమముగా నిర్వహించబడుచో సంఘ పాఠశాలలు అని నెలకొల్పబడిన తావులందలి సత్యధ్వజమును పైకెత్తు సాధనములై యుండును. కారణమేమనగా క్రైస్తవ విద్య నభ్యసించు పిల్లలు క్రీస్తు కొరకు సాక్షలై యుండెదరు. యాజకులు, ప్రధానులు గ్రహించలేని మర్మమలును దేవాలయమందు యేసు విపులీకరించిన రీతిగా ఈ భూమిపై ముగించబడనైయున్న సేవలో సరిగా తర్పీదు చేయబడు పిల్లలు తమకు వచ్చిన సులభభాషలోనే “ఉన్నత విద్య” సేవలో తర్బీతు చేయబడు పిల్లలు వచ్చిన సులభ భాషలోన ే “ఉన్నత విద్య” యని ఉద్ఘాటించు మనుష్యులకు దిగ్భ్రమ కలిగించు మాటలు మాటలాడెదరు. 416T 202, 203;CChTel 395.3

    ఆత్మలను రక్షించుటయను మహత్తర కార్యము సాధించుటకు మన కళాశాలలను దేవుడు స్థాపించెనని నాకు చూపబడెను. దైవాత్మ సంపూర్ణ స్వాధీనము క్రింద నున్నపుడే ఒక వ్యక్తి యొక్క తలాంతులు సంపూర్ణ సాఫల్యమునకు తేబడును. జ్ఞాన సంపాదనమందు మత నియమములు ధర్మములు ప్రథమ సోపానములు. ఇవి వాస్తవిక విద్యకు ప్రాతిపదికలు. ఉన్నతమైన గురిని చేరుటకు జ్ఞానము, విజ్ఞానము, పరిశుద్ధతతే బలపర్చబడవలెను. జ్ఞానమును క్రైస్తవుడే సమగ్రముగా ఉపయోగించగలడు. సమగ్రముగా అభినందించుటకు విజ్ఞాన శాస్త్రమును మతము దృష్ట్యా పరిశీలించవలెను. దైవ కృపచే సమున్నతి పొందిన హృదయము విద్య యొక్క నిజమైన విలువను బాగుగా ఆకళించగలదు. సృష్టికర్తను గూర్చిన జ్ఞానము మనకు చేకూరినపుడే ప్రకృతిలో కనబడు దైవ గుణ సంపత్తిని అభినందించగలము. మన యువజనులను లోక పాపము మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల యొద్దకును సత్యపుటూటకడకును నడిపించుటకు ఉపాధ్యాయులకు సత్యము విషయమైన శాస్త్ర జ్ఞానమే గాక పరిశుద్ధతా మార్గమును గూర్చి అనుభవ జ్ఞానము కూడ కావలెను. యధార్థమైన దైవ భక్తితో కలిసినపుడు జ్ఞానము శక్తియగును. 424T 427;CChTel 395.4