Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 18 - దేవుని యందు నమ్మిక

    తీర్పు దినమందు ప్రతి వ్యక్తిని దేవుడు పేరు పేరు వరుసగా ఎరిగి యున్నాడని బయలుపడును. జీవితమందలి ప్రతి కార్యమునకు అదృశ్య సాక్షమొకటి కలదు. “నీ క్రియలు నేనెరుగుదును” అని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు సెలవిచ్చుచున్నాడు. (ప్రకటన 2:1) ఏతరుణములను అలక్ష్యము చేసితిమో మనకు యెరుక. దుర్మార్గములలో సంచరించువారిని తిరిగి శాంతి సుక్షేమముల మార్గమునకు దెచ్చుటకు మంచి కాపరి ఎట్లు క్రమపడెనో మనకు విదితమే. భోగాసక్తులను దేవుడు చర్విత చర్వణముగా హెచ్చరించెను. అపాయము గుర్తించి దాని నుండి తప్పించుకొనుటకు వారి మార్గమందాయన తన వాక్య జ్యోతిని చర్విత చర్వణముగా వెలిగించెను. కాని తమ కృపకాలము సమాప్తమగు వరకు వారు విశాల మార్గమున కులుకుచు, పరిహసించుకొనుచు సాగిపోవుచునే యుందురు. దేవుని మార్గములు న్యాయమైనవి. సమానమైనవి. అపరాధులకు శిక్ష విధించబడినపుడు అందరి నోళ్లకు మూతలు పడును. 15T4 3 5;CChTel 193.1

    సృష్టి ద్వారా పని చేయుచు సర్వమును పోషించు సర్వశక్తుడు కొందరు రసాయనిక శాస్త్రవేత్తలు నుడువు చున్నట్లుగా ప్రాణదాయక, సర్వవ్యాపితశక్తి మాత్రమే కాదు. దేవుడొక ఆత్మ; అయినను ఆయన ఒక వ్యక్తియే. ఏలయనగాసమానవుడాయన పోలికయందు సృజించబడెను. CChTel 193.2

    సృష్టి దైవ హస్తకృత్యమేకాని దైవము కాదు. సృష్టియందలి వస్తుజాలములు ఆయన గుణశీలమును ప్రదర్శించుచున్నవి. వీని ద్వారా మనమాయన ప్రేమను, శక్తిని, మహిమను గ్రహింపగలము. కాని సృష్టిని దైవమని పరిగణింపరాదు. మానవ కళానైపుణి, నేత్రమునకు ఇంపైన వస్తుజాలమును తయారుచేయగలదు. ఈ వస్తువుల ద్వారా మనము శిల్ప ఉద్దేశ్యమును కొద్దిగా గ్రహింపగలము. కాని చేయబడిన వస్తువు మానవుడు కాదు గదా? కనుక సృష్టి దేవుని ఉద్దేశ్యమును బయలు పరచు ఒక పనియై యుండగా గౌరవింప వలసినది సృష్టికర్తనుగాని సృష్టమును కాదు. CChTel 193.3

    మానవుని సృజించినపుడు దేవుడు జీవవాయువు ఊడగా మానవుడు జీవము, శ్వాసము, ఉపజ్ఞగలవాడాయెను. మానవ శరీరావయవములన్నియు పనిచేయనారంభించినవి. గుండె దమనులు, రక్తనాళములు, నాలుక, చేతులు, కాళ్లు, జ్ఞానేంద్రియములు, మనస్సు యొక్క అవగాహనాశక్తి అన్నియు చట్టముననుసరించి వాని వాని పనులను చేయ నారంభించెను. మానవుడు జీవాత్మ ఆయెను. వ్యక్తిత్వముగల దేవుడు యేసు క్రీస్తు ద్వారా మానవుని సృజించి అతనికి జ్ఞానమును, శక్తిని ఇచ్చెను. CChTel 194.1

    మనము రహస్యముగా సృజింపబడినవాడు మన శరీరము నాయన యెరుగక పోలేదు. మన శరీరమునకు సంపూర్ణాకారము రాకమునుపు ఆయన నేత్రములు దానిని చూచినవి. మన అవయవములు ఏర్పడకముందే అవి ఆయన గ్రంథమందు దాఖలైయున్నవి. తన సృష్టికి మకుటాయమానమైన మానవుడు సకల క్షుద్ర జీవులపై అధికారియై తన చిత్తమును మహిమను CChTel 194.2

    కనపర్చవలెనని దేవుడు సంకల్పించెను. అంతేగాని మానవుడు తన్ను తాను దేవునిగా హెచ్చించుకొనరాదు. 28T 263—273. CChTel 194.3