Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 57 - రాజ్యధికారులతోను చట్టములతోను మన సంబంధము

    రాజ్యాధికారుల యెడల విశ్వాసులు చూపవలసిన మనస్తత్వమును గూర్చి అపొస్తలులీ నిష్పష్ట సూచన చేసిరి. “మనుష్యులు (నియమించు) ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తము లోబడి యుండుడి. రాజు అందరికిని అధిపతి యనియు నాయకులు దుర్మార్గులకు ప్రతి దండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి యుండిడి. ఏలమనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులనోరు మూయుట దేవుని చిత్తము. స్వతంత్రులై యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్య్రమును వినియోగపరచక, దేవుని దాసులమని(లోబడి యుండుడి). అందరిని సన్మానించుడ సహోదరులను ప్రేమించుడి. దేవునికి భయపడి రాజును సన్మానించుడి” 1 పేతురు 2:13`17. 1A A 522;CChTel 467.1

    మనపై నధికారులు నియమించబడిరి. ప్రజలను పాలించుటకు చట్టములు రూపొందించబడినవి. ఈ చట్టము లేకపోయినచో లోక పరిస్థితి యిప్పటికన్న అధ్వాన్నముగా నుండియుండును. వీనిలో కొన్ని చట్టములు మంచివి. కొన్ని చెడ్డవి. చెడ్డవి ఎక్కువగుచున్నవి. మనకింకను కష్టపరిస్థితులు రానున్నవి. అయినను తన ప్రజలు బలముగా నుండి తన వాక్యమందలి నియమముల ప్రకారము జీవించుటకు దేవుడు సాయము చేయును. 2IT 201;CChTel 467.2

    దేవుడు గంభీరముగా సీనాయి పర్వతము మీద నుండి పలికిన పిదప తన సొంత వ్రేలితో రాతి పలకల మీద వ్రాసిన ఉన్నతమైన చట్టమునకు విరుద్ధముగా నుండిన తప్ప దేశమందలి చట్టములకు లొంగి యుండుట మన విధియని నేను చూచితిని. “నాధర్మశాస్త్ర విధులను వారి మనస్సులలో ఉంచి వారి హృదయములమీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై యుందును. వారు నాకు ప్రజలై యుందురు”. దైవధర్మశా స్త్రము హృదయమందు వ్రాయబడిన వ్యక్తి మనష్యులకు కాని దేవునికి లోబడి యుడను. దైవాజ్ఞ నుండి కొద్దిగా తొలగుటకు బదలు త్వరలో సర్వమానవుల ఆజ్ఞలన అతిక్రమించును. సత్యావేశముచే బోధించబడిర, దేవుని ప్రతిమాట చొప్పున జీవించుటకు మంచి మనస్సాక్షిచే నడిపించబడ దైవ ప్రజలు తమ హృదయములయద వ్రాయబడిన ధర్మశాస్త్రాధికారమనే ఒప్పుకొని దానిని గైకొనుటకగీకరింతురు. దైవ ధర్మశాస్త్రమ యొక్క జ్ఞానము, అధికారము ఉత్కృష్టమయినవి. 3IT 361;CChTel 467.3

    క్రీస్తు కాలమందన్న ప్రభుత్వము చెడ్డది, కఠినమైనది. ఎక్కడ చూచినను మోసము, అసహనమ, కూృరత్వము మున్నగ దరాచారములే యున్నవి. అయినను రక్షకుడు రాజకీయ సంస్కరణములకు ప్రయత్నించలేదు. జాఈయ దరాచారముల నాయక గర్హించలేదు. జాతీయ శత్రువులను విమర్శించలేదు. అధికారుల అధికారముతోకాని, కార్యనిర్వహణముతోగాని ఆయన జోక్యము కలిగించుకొనలేదు. మనకు మాదిరి పురుషుడైన ఆయన భూలోక రాజకీయమలకు దూరముగా నిలచెను. 4D A 509;CChTel 468.1

    శాస్త్రీయ, రాజకీయ సమస్యలను పరిష్కరించవలసినదిగా క్రీస్తును ప్రజలు పదేపదే అడిగెడివారు. లౌకికమయిన యీ విషయములందు జోక్యము కలిగించుకొనుటకాయన సమ్మతించలేదు. క్రీస్తు ఈ లోకములోనికి నీతి రాజ్యమును స్థాపించుటకు వచ్చెను. ఆధ్యాత్మిక రాజ్యాధిపతిగా ఆయన యీ లోకమున నిలువబడెను. ఈ రాజ్యపాలన యందలి ఉదాత్త పరిశుద్ధ సూత్రములను ఆయన బోధల సుస్పష్టపరచినవి. యోహోవా రాజ్యమందు న్యాయమ, కృప ప్రేమ ఇవే ప్రధాన శక్తులని ఆయన చూపించెను. 59T 218; CChTel 468.2

    గూఢచారులాయన యొద్దకు వచ్చి యధార్థవంతులుగా పైకగడుచు తమ విధియేదో తెలిసికొనగోరిన వారివలె నటించచు ఇట్లడిగిరి, “బోధకుడా, నీవ సత్యవంతడవై యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవ ఎవనిని లక్ష్యపెట్టననిఉ మోమాటములేనివాడవనిఉ ఎరుగుదుము. నీకేమి తోచు చన్నది? కైసరుకు పన్నిచ్చుట న్యామా కాదా?” క్రీస్తిచ్చిన జవాబ తప్పించుకొనుటకిచ్చినది కాదు. ఆయన యిచ్చిన సమాధానము ఆ ప్రశ్నకు తగినది. కైసరు ముద్రయు విగ్రహమను గల రోమా నాణెమును పట్టుకొని తాము రోమా రాజ్య రక్షణ క్రింద జీవించుచున్నదున ఆ ప్రభుత్వమునకు చెందు దానిని, దేవునిపట్ల తమకుగల విధికిది వ్యతిరేకమ కానంతవరకు, చెల్లించవలెనని వారితో చెప్పెను. CChTel 468.3

    పరిసయ్యులు క్రీస్తిచ్చిన సమాధానము నాలకించినపుడు “ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయిరి”. వారి వేషధారణను, దురభిప్రాయమును ఆయన గద్దించెను. ఇట్లు చేయుట ద్వారా ఆయన ఒక మహత్తర నియమమును బలపరచెను. ప్రభుత్వము నెడల దేవుని యెడల మానవుడు నిర్వర్తించవలసిన బాధ్యత యొక్క హద్దుల నీ నియమము సూచించుచున్నది. 6D A 601-603; CChTel 469.1