Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అధ్యాయము 4 - దేవుని పరిశుద్ధా సబ్బాతాచరణ

    సబ్బతాచరణలో గొప్ప ఆశీర్వాదములు దాచబడి యున్నవి. మనకు సబ్బాతు దినము ఆనందకరమగు దినముగా నుండవలెనని దేవుని యభిలాష. సబ్బాతును స్థాపించినపుడు ఆనందము వెల్లివిరిసినది. తన హస్తకృత్యమును చూచి దేవుడు సంతృప్తి చెందెను. ఆయన చేసిన సర్వమును “మంచిది” అని ఉద్ఘాటించెను. అది 1:3. భూమ్యాకాశములు ఆనందముతో నిండెను. “ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసెను”. యోబు 38:7. పాపము ప్రపంచమున ప్రవేశించి ఆయన సృష్టిని పాడుచేసినను అనంత కృపా కనికరములు గల సర్వశక్తుడొకడు సర్వమును సృజించెనని సాక్ష్యమిచ్చుటకుగాను సుబ్బతును దేవుడు మనకనుగ్రహించియున్నాడు. సబ్బాతాచరణద్వారా మానవ హృదయములలో తన్ను గూర్చిన జ్ఞానమును భధ్రపరచవలెనని మన పరమ జనకుని యాకాంక్ష. ఆయనయే యదార్థమైనట్టియు సజీవమైనట్టియు దైవమని గుర్తించుటకు మనలను సబ్బాతు నడిపంచవలెననియు ఆయన అభిలషించుచున్నాడు. ఆయనను గుర్తెరుగట ద్వారా మనము జీవమును శాంతిని పొదగలము. CChTel 67.1

    ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినపుడు ప్రభువు వారికి తన ధర్మ శాస్త్రమునను గ్రహించి సబ్బాతు నాచరించుటద్వారా వారు విగ్రహారాధికుల నుండి కేటాయించబడవలెనని బోధించెను. దేవుని సర్వాధికారము నంగీకరించిన వారికిని ఆయనను సృష్టికర్తగాను రాజుగాను అంగీకరించ నిరాకరించిన వారికిని బేధమదే. “నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును” అని ప్రభువు సెలవిచ్చెను. “ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలను; అది నిత్యనిబంధన.” నిర్గమ 31:17,16. ఇశ్రాయేలీయుల ఐగుప్తు విడుదలకు సబ్బాతు ఎట్లు గురుతాయెనో యట్లే దైవ ప్రజలు లోకమును విడచి పరలోక కనానులో ప్రవేశించుటకు కూడ నది గురుతుగా నున్నది. సబ్బాతు దేవునికిని ఆయన ప్రజలకును మధ్యగల సంబంధము నెరుకపరచునొక చిహ్నమును, ఆయన ధర్మశాస్త్రమును వారు గౌర వింతురని తెలుపుటకది యొక సూచనయునై యున్నది. ఆయనకు నమ్మకముగా నుండు వారిని, ఆయన యాజ్ఞల నుల్లంఘించువారిని అది వేరు చేయును. CChTel 67.2

    సబ్బాతును గూర్చియే మేఘ స్తంభములో నుండి క్రీస్తు ఇట్లు ఉద్ఘాటించెను. “నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును”. నిర్గమ 31:13. దేవుడు సృష్టికర్తయన ప్రపంచము గ్రహించుటకు గురుతుగా ఇయ్యబడిన సబ్బాతే ఆయన పరిశుద్ధ పరచువాడనుటకు కూడ గురుతై యున్నది. సమస్తమును సృజింపగలిగిన ఆ శక్తే మానవుని తన స్వకీయాకారమున తిరిగి సృజించగలదు. సబ్బాతు దీపమును పరిశుద్ధముగా ఆచరించు వారికది పవిత్రీకరణకు గురుతై యున్నది. పవిత్రీకరణము, ఆయన శీలమునకు నకలు అయిన నియమములను విధేయత చూపుట ద్వారా నది లభ్యమగును. సబ్బాతు విధేయతకు గురుతు. హృదయపూర్వకముగా నాల్గవ ఆజ్ఞను గైకొనువాడు చట్టమంతటిని గైకొనితీరును. విధేయతద్వారా నతడు పవిత్ర పరచబడును. CChTel 68.1

    ఇశ్రాయేలీయులకు వలె మనకు సబ్బాతు “నిత్య నిబంధనగ” అనుగ్రహించబడినది. ఆయన పరిశుద్ధ దినమును గౌరవించువారికి అది తమ్మును తన ప్రజలుగా దేవుడు గుర్తించుచున్నాడనుటకు సూచన. దేవుడు వారియెడల తన నిబంధనను నెరవేర్చువనుటకది యొక వాగ్దాత్తము. దైవ ప్రభుత్వలాంఛనము నంగీకరించు ప్రతియాత్మయు దేవుని నిత్యనిబంధనకు తొంగియుండును. CChTel 68.2

    విధేయతయను బంగారు గొలుసునకు నతడు తన్నుతానుముడిపెట్టుకొని యుండును. ఈ గొలుసులోని ప్రతి కొక్కెము ఒక వాగ్దానమై యున్నది. 16T 349,350;CChTel 68.3