Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సమర్పణ, ఆత్మావేక్ష స్వభావము

    దేవుని కుమారుని అపార బలిదానము వలన రక్షణోపాయము ఏర్పడినది. క్రీస్తు సిలువ నుండి ప్రకాశించు సువార్త జ్యోతి స్వార్థ ప్రియత్వమును గద్ధించి ధారాళతను, దాతృత్వమును ప్రోత్సహించును. దానము కొరకు అధికముగా పిలుపులు వచ్చుట శోచనీయము కాదు. సంకుచిత కార్యరంగము విడిచి విస్తృత కార్యరంగములలో ప్రవేశించుటకు సర్వజ్ఞుడ గు దేవుడు తన ప్రజలను ఆహ్వానించుచున్నాడు. నైతిక అంధకారము ప్రపచమును కప్పివేసిన యీ కాలమదు పరిమితిలేని కృషి అవశ్యకము. దైవజనుల ముఖ్య లక్షణములను లోక ప్రియత్వము, దురాశలు కబళించుచున్నవి. తమ ధనము నిచ్చుటకు కలుగు ఆవశ్యకతలను ఆయన కృపయే అధికము చేయుచున్నదని వారు గ్రహించవలెను. దేవదూత ధర్మకార్యములను ప్రార్థన ప్రక్కనే లిఖించును. కొర్నేలితో దూత ఇట్లు చెప్పెను. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. అ. కార్యములు 10. 4 263T 405;CChTel 123.1

    మీ గృహములలో మిత వ్యయమును అలవరచుకొనుడి. స్వప్రయోజక వినోదములను అనేకులు జపించి పూజిచుచున్నారు. మీరు దానిని విడువుడి. గృహములను అలంకరించు కొనుటలో ద్రవ్యము పాడుచేయవలదని మిమ్మును నేను బతిమాలుచున్నాను. అది దేవుని సొమ్ము. దానిని మీరు తిరిగి యియ్యవలసి యుడును. తల్లిదండ్రులారా, మీ బిడ్డల వృధా కోరికలను తీర్చుటకు ప్రభువు ధనమును ఖర్చు చేయకుడని క్రీస్తును బట్టి బ్రతిమాలుచున్నాను. ప్రపంచమందు పలుకుబడి సంపాదించు నిమిత్తము శైలి హంగులను వారికి నేర్పకుడి. ఏ ఆత్మల కొరకు క్రీస్తు మరణించెనో వారిని రక్షించుటలో బిడ్డలకిది తోడ్పడునా? అట్లు గాక అది ద్వేషమును, అసూయను, దురాలోచనలను కలిగించును. డంబమునదును దుర్వ్యయ మందును వారు ప్రపంచముతో పోటీపడి ఆరోగ్యమునకు గాని, ఆనందమునకు గాని, అవసరముగాని వస్తువుల కొరకు దేవుని ద్రవ్యవమునకు గాని , అవసరముగాని వస్తువుల కొరకు దేవుని ద్రవ్యమును వ్యయము చేసెదరు. CChTel 123.2

    మీ బిడ్డల పట్ల మీకుగల ప్రేమ తమ దురహంకార కార్యములను, దుర్వ్యయమును డంబప్రీతిని తీర్చుటద్వారా సమర్ధించునని వారు తలచునట్లు తర్బీతు చేయకుడి. ద్రవ్యమును ఖర్చు చేయు మార్గములను అన్వేషించుటకిప్పుడు వ్యవధిలేదు. ద్రవ్యము పొదుపు చేయు విధానములను కనుగొనుటలో మీ మేధస్సును వినియోగించుడి. మీ యోచనాశక్తు లను నాశనము చేయు వస్తువులను ధనమునకు వ్యయమును చేయుటద్వారా మీ స్వీయయెచ్చ లను తిర్చుకోనుటకు బదులు ప్రదేశములలో సత్య ప్రమనమును పెంచుటకు కొంత ధనము మీ యొద్ద నుండుటకు గాను ఆత్మోపేక్ష విధానములను నేర్చుకొనుడి. ప్రజ్ఞ ఒకతలాంతు. ఆత్మను రంక్షించుటలో మీ ధనము ఉపయోగించుటకు ఉత్తమ మార్గములను నేర్చుకొనుటయందు ప్రజ్ఞనుపయోగించుడి. 276T 450, 451;CChTel 123.3

    ఇతరులకు మేలు చేయుటకు తమ్మను తాము ఉపేక్షించుకొని తమ సర్వస్వమును క్రీస్తు సేవకే ఉపయోగించువారికి స్వార్ధపరునుకి అలవిగాని ఆనందమును చేకూరును. మన రక్షకుడిట్లు సెలవించెను :“మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడుకానేరడు.” లూకా 14:33. ప్రేమ “స్వప్రయోజనమును విచారించు కొనదు. “క్రీస్తు జీవితమంది మిదియున్న నిస్స్వార్ధ ప్రేమోదార్యములు ఫలమిదియే. మన హృద్యయములండలి ధర్మశాస్త్రము మన స్వకీయాంశములను ఉన్నతమైన ,నిత్యమైన ఆలోచనలకు లోను చ్చేయును. 283T 397CChTel 124.1