Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ప్రవక్తకు వెలుగు వచ్చిన విధము

    తన చిత్తమును ఇశ్రాయేలియులు ప్రజలకు ప్రవక్త ద్వారా తెలియపర్చెదనని మనము గుర్తించిమి. CChTel 20.5

    “మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసికొనునట్లు కలలో అతనితో మాటలడుడును ” సంఖ్యా కాండము 12:6. CChTel 20.6

    చివరి అధ్యయమందు మహా సంఘర్షణా దర్శనములను వారికీ సంబంధించిన కొన్ని భౌతిక ప్రదర్శనములను గూర్చి మీరు చదువగలరు. దర్శనము లీవిధముగ ఎందుకీయ బడినవి యను జ్ఞానయుతమైన ప్రశ్న పుట్ట వచ్చునా. ప్రభువు ప్రవక్తతో మాటలాడు చున్నాడనునమ్మకము నిశ్చతాభిప్రాయము ప్రజలకు కలిగించుటకే ఇట్లు జరుగచున్న దనుట నిస్సందేహము. దర్శనమందున్నపుడు కాయిక స్థితిని గూర్చు వైటమ్మ గారు ఎక్కువ చెప్పలేదు. కాని ఒకసారి మాత్రము ఆమె ఇట్లు అనెను. “ఈ అంత్య దినములలో ప్రవచనసారమందు మన విశ్వాసము బలపర్చుటకు ఈ వర్తమానము ఇట్లు ఈయ బడినది.”CChTel 20.7

    “మీరు వారి ఫలములు వలన వారిని తెలిసి కొందురు.”CChTel 21.1

    వ్రుద్ధియగుచున్న వైటమ్మగారి పని బైబిలు పరీక్షతో పరిక్షించబడ వచ్చును. ఫలములు వృద్ధియగుటకు కొంత కాలము పట్టున. ఆదిలోనే దర్శన మిచ్చు సందర్భముగా ప్రభువు కొన్ని నిదర్శనముల నిచ్చెను. ప్రజలామెను నమ్ముటలో ఈ నిదర్శనములు తోడ్పడినవి. CChTel 21.2

    శరీర ప్రదర్శనముతో కూడిన దర్శనములతో కూడిన దర్శనములన్నియును బహిరంగముగా నీయబడలేదు. ఈ అధ్యాయారంభమందలి వచనములతో ”ప్రవక్తకు దర్శనము&edquo; ద్వారా తన్ను తానూ తెలియపర్చుకొనుటయేగాక “కలలో కూడ అతనితో మాటలాడున” ని మనము చదివితిమి. దానియేలు ప్రస్తావించుచున్న ప్రవచన సంబంధమైన కల ఇట్టిదే. CChTel 21.3

    “బాబెలు రాజగు బెల్షాసారుయొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దాని యేలుకు దర్శనములు కలిగెను: అతడు తన పడక మీద పరుండి యొక కల కానీ ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను.” దానియేలు 7:1. CChTel 21.4

    తనకు ప్రత్యక్ష పర్చబడిన దర్శనములు సంగతులను గూర్చి వివరించుచు దానియేలు అనేక పర్యాయములు “రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తెరిచుచితిని” అని వచించెను. శ్రీమతి వైటమ్మ గారి యనుభవమునందుకూడ తరుచు రాత్రి సమయమందు తన మనస్సు ప్రశాంతముగా నుండు వేళలలో ఆమెకు దర్శనములు కలిగెను. ఇట్టి వచనములను మనము చదువగలము ”రాత్రి దర్శనములో కొన్ని సంగతులు నాకు స్పష్టముగా కనపర్చ బడెను.” అనగా దేవుడు తరుచు ఈ ప్రవక్ర్తితో ప్రావచనిక దర్శనములయందు మాటలాడెను. ప్రవచన సంబంధమైన కలకును సామాన్యమైన కలకును గల సంబంధమును గూర్చి అనేక ప్రశ్నలు పొడచూపవచ్చును. దీనిని గూర్చి శ్రీమతి వైటమ్మగారు 1868 లో ఇట్లు వ్రాసిరి:CChTel 21.5

    “జీవితసామాన్యవిషయముల వలన కలుగు కలలు చాల కలవు. వీనితో దేవుని ఆత్మకు సంబంధమేమియు లేదు. సాతాను కలుగజేయు కలలు దైవవక్యమందు దర్శనములుగా పేర్కొనబడినవి. వానిని పొందు వ్యక్తులను అని ఎ సందర్భములయందు ఇయ్యబడెనో వానిని ఎంచి చూచునాచో అట్టికలలు నిజానిజములను అవే నిరుపించుకోనును.”CChTel 21.6

    వైటమ్మగారి వృద్ధాప్యమందు ఒకసారి ఆమె కుమారుడగు డబ్ల్యు. సి. వైటు గారు ఆమెను గూర్చి ఎక్కువ ఎరుగనివరికి సహాయముచేయు నభిలషతో తల్లి నిట్లు ప్రశ్నించెను: “అమ్మా ,నీవు రాత్రియందు ప్రత్యక్ష పర్చబడిన విషయములను గూర్చి తరుచు చెప్పుచున్నవు. మరి మాకందరకు కలలువచ్చుట కద్దు. నీవు తరుచు ప్రస్తావించుచున్న ఈ కలలయందు దేవుడు నీతొ మాటలాడుచున్నట్లు నికెట్లు తెలియును?”CChTel 22.1

    “ఎలయనగా ,పగటి దర్శనములలో నా ప్రక్క నిలువబడి నాకుపదేశమిచ్చు దూతయే రాత్రి దర్సనమందు కూడ నాకు ఉపదేశమిచ్చుచున్నాడు” అని ఆమె ప్రత్యుత్తరమిచ్చెను. ఈ పరలోక వ్యక్తిని ఆమె అనేక పర్యాయములు “దెవదూత.” “నా మార్గదర్శి ,” “నా ఉపదేశకుడు ” అనియు వ్యవహరించిరి. CChTel 22.2

    ప్రవక్ర్తి మనస్సు ను గలిబిలచేయునదేదియు లేదు. రాత్రి వచ్చిన దర్శనము విషయము ఎ సంశయమును లేదు కారణమేమనగా ఆ దర్శనమునకు సంబంధించిన విషయములే అది దేవుని వద్ద నుండి వచ్చిన ఉపదేశమని స్పష్టపరచినవి. CChTel 22.3

    మరికొన్నిసార్లు శ్రీమతి వైటమ్మగారు ప్రార్దించుచున్నప్పుడో ,మాటలాడుచున్నప్పుడో ,వ్రాయుచున్నప్పుడో ఆమెకు దర్శనములీయబడుట సంభవించెడివి. బహిరంగముగా మాటలడుచున్నప్పుడుగాని ,ప్రార్ధించుచున్నప్పుడుగాని ఆమె కొంత తడవు ఆగితేనే ఆమె చుట్టునున్నవారు ఆమె దర్శనమందున్నట్లు గుర్తించలేదు. ఒకసారి ఆమె ఇట్లు వ్రాసిరి:CChTel 22.4

    “ఆసక్తి తో ప్రార్ధించుచుండగా మై మరచితిని ,నేనున్న గది వెలుగుతో నిండెను. జనరల్ కాన్ఫ రెన్సువలె గోచరించిన ఒక సభయందు చేయబడుచున్న ప్రసంగమును వినుచుంటిని.”CChTel 22.5

    డెబ్బది సంవత్సరములు సేవచేసిన ఆమె సుదీర్ఘ జీవితములో శ్రీమతి వైటమ్మ గారికి కలిగిన దర్శనములలో అతి దీర్ఘమైన దర్శనము నాలుగు గంటలసేపు ,అతి హ్రస్వమైన దర్శనము ఒక నిముసము సేపు ఉండెను. తరుచు దర్శనములు అర్ధగంట లేక కొంచెము ఎక్కువ సేపు ఉండెడివి. కాని అన్ని దర్శనములకు వర్తించు ఒక నిబంధనను ప్రతిపాదించలేము. ఇదే సత్యమును పౌలు కూడ ఈ దిగువ మాటలతో నివరించుచున్నాడు:CChTel 22.6

    “నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. .. .” హెబ్రీ 1:1. CChTel 23.1

    ప్రవక్తకు దర్శనమందున్నపుడే ప్రవక్త దానిని వ్రాయలేదు. ఆతడు చేయవలిసినది యాంత్రికమైన పని గాదు. అపురూప సమయములందు తప్ప మాటలాడవలసిన మాటలను దేవుడు ప్రవక్తకు ఇచ్చినవాడు కాదు. లేక వ్రాయవలసిన మాటలను దూత ప్రవక్త యొక్క చెయ్యి పట్టి వ్రాయించలేదు. దర్శనముల ద్వారా జ్ఞానాభివృద్ధి నొందిన మనస్సు కలిగి ప్రవక్త వ్రాయుటగాని మాటలాడుటగని జరిగెను. ఈ వర్తమానమును చదువు పాఠకులకు,భోధాలను విను శ్రోతలకు ఈ రచనలు మాటలు వెలుగును ఉపదేశమును అందించును. CChTel 23.2

    ప్రవక్త యొక్క మనస్సు ఎట్లు దివ్యగ్ననముతో నింపబడెను ?ప్రజలకందించవలసిన సమాచారమును,ఉపదేశమును అతడెట్లు పొందెను ? అని మనమడుగవచ్చును. దర్శనము లను ఒక నిర్దిష్ట శాసనమేట్లు లేదో అట్లే ఆత్మ ప్రేరణతో నిండిన వర్తమానమును పర్వక్త పొందు విధము కూడ ఒక నిర్దిష్ట నిబంధన లేదు. ప్రతి సందర్భమందును కలిగిన అనుభవము స్పష్టమైనదే ప్రవక్త మనస్సునందు చిరస్మ్ర తులను ఎర్పరచునదిగా నుండును. మనము వినుదానికన్న మనము కండ్లారచుచి యనుభవించు నది మన మనస్సు నందు చిరస్థాయిగా నిలుచురీతిగా ప్రవక్తలకు దర్శనములందు జరుగుచున్నట్లు చూపబడు విషయములు వారి మనస్సులలో చిరస్థాయిగా నుండును. CChTel 23.3

    మహా సంఘర్షణా దర్శనమును గూర్చిన వృత్తాంతముగల వెనుకటి అధ్యములో చారిత్రకసంఘటనలను గూర్చిన సమాచారము తనకు వచ్చిన విధమును గూర్చి వైటమ్మ గారి చెప్పు మాటలను ఉల్లేఖించినాము. మరియొకసారి తనకు వెలుగు వచ్చిన విధమును గూర్చి వివరించుచు తానూ దర్శనమందు “భూమిపై సంభవించు సంగతుల వైపు తరుచు నా ధ్యానము ట్రిప్ప బడినది. కొన్నిసార్లు నేను అనాగతమునకు కొనిపో బడితివి. అప్పుడు నాకు భవిష్యత్సంభవములు చూపబడెను. మరల గత కాలమందు సంభవించిన విషయములు అవి జరిగిన రీతిగా చూపబడెను ” అని పలికిరి. CChTel 23.4

    ఎలెన్ వైటమ్మ గారు ఈ సంఘటనలను కాండ్లా ర చూచినట్లు దీని ద్వారా ద్యోతక మగుచున్నది. దర్శనమందు ఆ సంభవములు పూనః ప్రదర్శనము చేయబడినవి. ఇట్లు ఆమె మనస్సునందని స్థిరపర్చబడినవి. CChTel 23.5

    కొన్ని మారులు తనకు ప్రత్యక్షపర్చబడుచున్న దృశ్య మందు తాను పాల్గొనచున్నట్లు ,దానిని అనుభావిన్చుచున్నట్లు ,చూచుచున్నట్లు,వినుచున్నట్లు ,దాని ప్రకారము చేయుచున్నట్లు ఆమెకు అనిపించెను. కాని వాస్తవముగా ఆమె అందు పాల్గొనుట లేదు మరువరాని విధముగా వానిని గూర్చిన తలంపు ఆమె యందు స్థిరపడిపోయినది. మొదటి అధ్యాయములో కూర్చబడిన ఆమె ప్రధమదర్శనము ఇట్టిదే. CChTel 24.1

    మరికొన్ని సమయములయందు దర్శనమందున్నప్పుడు శ్రీమతి వైటమ్మగార్కి దూర ప్రదేశములయందున్న కూటముయందును,గృహములయందును ,సంస్థల యందును ఆమె యున్నట్లు అగపడినది. అ స్థలములో ఆమె ఉనికిని గూర్చి వైటమ్మ గారి కెంత జ్ఞాపకమున్నదనగా ఆయా వ్యక్తుల మాటలను ,క్రియలను వివరముగా ఆమె చెప్పాగ ల్గెదడిది. ఒకసారి దర్శనమందున్నపుడు శ్రీమతి వైటమ్మ గారు మన వైద్య సంస్థలలో నొకదానిని సందర్శిoచ నేగి గదులన్నింటిని సందర్శించి అచ్చట జరుగుచున్న ప్రతి విషయమును చుచు చున్నట్లు అగపడెను. ఈ యనుభవమును గూర్చి ఆమె ఎట్లు రచించెను. CChTel 24.2

    “తుచ్ఛ ప్రసంగము ,బుద్ధిహినమైన పరియాచాకములు ,అర్ధములేని నవ్వులు చెవికి భాదకరముగా. .. వినబడెను వారికున్న అసూయను చూచి నేనశ్చర్యపడితిని. వారి ద్వేశావచానములను ,నిర్లక్ష్యపు మాటలను నేను వింటిని. ఇవి దేవదూతలకు సిగ్గును కలిగించినవి.”CChTel 24.3

    అదే సంస్థ యొక్క ఇతర సద్విషయములు ఆమెకు. చుపబడెను ఆమె గదులలో నికి. నడిపించాబడెను “వాణి నుండి ప్రార్ధననాస్వరము వచ్చుచుండెను. ఆ శబ్ద మత్యంత ఆనందదాయకము !”ఈ సందర్శనమును గూర్చియు ,ఆయాశాఖలకు,గదులకి తనను నడిపించిన దూతను గూర్చియు ఆమె ఒక వర్తమానము రచించెను. CChTel 24.4

    తరుచు వైటమ్మగారి సుస్పష్ట సంకేతమూల ద్వారా వెలుగు ఇయ్యబడినది. అపాయ మందున్న ఒక ప్రముఖ సువార్తికునికి పంపబడిన వ్యక్తిగత వర్తమానము నుండి గ్రహించబడిన ఈ దిగువ నాల్గు వచనములలో అట్టి పరిభాష వివరించబడినది. CChTel 24.5

    “మరియొకసారి మీరు ఒక జెండా పట్టుకొని,గుఱ్ఱము పై నెక్కిన ఒక యోధుని వలె నాకు చూపబడితిరి. ‘దేవుని ఆజ్ఞలను యేసునుగూర్చిన విశ్వాసమును ‘ అను మాటలుగల పతాకమును ఒకడు వచ్చి మీ చేతులలోనుండి లాగుకొనెను. అది మన్నులో వేసి త్రొక్కబడెను. మిమ్మును లోకముతో జతపరచు చున్న మానవుల మధ్య మీరు న్నట్లు నేను చూచితిని.”CChTel 24.6

    రెండు వేర్వేరు దృక్పథములు వై టమ్మగారికి అనుగ్రహించబడిన సమయములున్నవి-కొన్ని సంకల్పములను, విధానములను అవలంబించినచో సంభవించగల దానిని ఉదాహరించునదొకటి; ఇతర ఏర్పాటులను విధానములను అమలుపర్చవలెనను ధృక్పథము మరి యొకటి. అమెరికా పశ్చిమ భాగములోని లోమలిండాలో ఆరోగ్యాహార కర్మాగార నిర్మాణమును గూర్చిన ఉదంతము దీనికి ఉచితమైన ఉదాహరణము. వైద్యశాలకు అతి సమీపముగా ఒక పెద్ద కర్మాగారమును నిర్మించుటకు మేనేజరు అతని సహచరులు ఏర్పాట్లు చురుకుగా సాగుచుండగా వందలాది మైళ్ళ దూరమునన్ను శ్రీమతి వైటమ్మగారికి తన గృహమునందు రెండు దర్శనములు కలిగినవి. ఈ రెంటిలో మొదటిదానిని గూర్చి ఆమె ఇట్లు అభిభాషించిరి:CChTel 25.1

    “రకరకములయిన ఆహారములు తయారు చేయబడు పెద్ద కర్మాగారము నాకు చూపబడెను. రొట్టెల కర్మాగారము నాకు చూపబడెను. రొట్టెల కర్మాగారమునకు ప్రక్క కొన్ని చిన్న కట్టడములు కూడా నున్నవి. అక్కడ నేను నిలువబడగా అక్కడ చేయబడుచున్న పని విషయము వాదోడువాదములాడుకొనుచున్న పెద్ద స్వరములు నాకు వినపడెను. కార్మికులలో సంఫీుభావము లేదు. దాని ఫలితముగా అల్లకల్లోలము చెలరేగెను.”CChTel 25.2

    విచారగ్రస్తుడైన మేనేజరు కార్మికులను సమైక్యపర్చుటకు కృషి చేయుచున్నట్లు ఆమె చూచెను. ఈ లావాదేవీలను విని వైద్యశాలకు అతి సమీపముగా “ఆహార కర్మాగారము నిర్మించబడుటను గూర్చి సంతాపపడుచున్నరోగులను” ఆమె చూచెను. అప్పుడు “ఒక వ్యక్తి వచ్చిఫ ‘కొన్ని ఏర్పాటులను కొనసాగించుట ద్వారా కలుగు ఫలితములను గూర్చి మీరు వస్తుపాఠము నేర్చుకొనుటకు గాను ఇదంతయు జరిగించబడినది’ ” అని చెప్పెను. CChTel 25.3

    అప్పుడాదృశ్యము మారినది. “రైలు మార్గము వైపునకు పోవు మార్గము ప్రక్క వైద్యశాలకు దూరముగా ఆహార కర్మాగారము ఉన్నట్లు” ఆమె చూచెను. ఇక్కడ పని చక్కగాను దైవ సంకల్పానుసారముగా సాగుచున్నది. దర్శనమైన కొన్ని గంటలలోనే వైటమ్మగారు లోమలిండాలోని పనివారికి ఉత్తరములు వ్రాసిరి. ఆహార కర్మాగారము ఎక్కడ నిర్మించబడవలెనను సమస్యను ఇది పరిష్కరించినది. వారి మొదటి ఏర్పాటు కొనసాగించబడియున్నచో తరువాత సంవత్సరములో వైద్యశాల ప్రక్క పెద్ద కర్మాగారముండుటవలన చాల నగుబాట్లపాలై యుండును. CChTel 25.4

    రాత్రి దర్శనముల నుండియు, పగటి దర్శనముల నుండియు వేర్వేరు విధములుగా ప్రభువు యొక్క రాయబారిణి ఇట్లు వర్తమానము పొంది ఉపదేశమును ఇచ్చినట్లు కానన గును. వెలుగులో నింపబడిన మనస్సుతో ప్రవక్త మాటలాడి, లేక, వ్రాసి ఈ వర్తమానమును, ఉపదేశమును ప్రజలకందించెను. ఈ కార్యమందు శ్రీమతి వైటమ్మగారు దైవాత్మ సహాయము పొందిరి. కాని ఆమె యంత్రము వలె నడుపబడలేదు. వర్తమానమును తెలియజేయుటకు ఆమె తన సొంత మాటలను ఉపయోగించిఎను. ఆమె సేవ యొక్క ప్రారంభదశలో మన సంఘ పత్రిక యందిట్లు వ్రాసిరి:CChTel 25.5

    “విషయములను అందుకొనుటలో దేవుని ఆత్మ సహాయముపై నేను ఆధారపడిన రీతిగానే వానిని వ్రాయుటయందుకూడ దైవాత్మపై ఆధారపడినను నేను చూచిన దానిని వివరించుటకు నేను ఉపయోగించు మాటలు నా సొంత మాటలే. దేవదూత నాతో చెప్పిన మాటలు మాత్రము అనువాద చిహ్నములలో నుంచితిని.”CChTel 26.1