Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    క్రయ శిక్షణలో క్రీస్తు పద్ధతులు

    తప్పులు చేయు సంఘస్తుల విషయము దైవ ప్రజలు మత్తయి 18వ అధ్యాయమందు రక్షకుడొసగిన ఉపదేశమును కడు జాగ్రత్తగా అనుసరించి వ్యవహరింపవలెను. CChTel 173.1

    మానవులు క్రీస్తు హక్కైయున్నారు. అపార ధనముతో వారినాయన కొనెను. వారి యెడల ఆయన, ఆయన తండ్రి కనపరచిన ప్రేమచే వారాయనతో జతపర్చబడిరి. మనము ఒకరితో నొకరు మెలగుటలో ఎంత జాగ్రత్తగా నుండవలెను! తమతోడి మానవులను గూర్చి చెడుగు తలంచు హక్కు మానవులకు లేదు. తప్పు చేసిన సభ్యులపట్ల తమ తోడి సంఘసభ్యులు తమ అభిప్రాయముల ననుసరించి తమ చిత్తమొచ్చినట్లు వర్తించ వీలులేదు. తప్పులు చేయు వారిని గూర్చి తమ ద్వేశాభిప్రాయములను అసలు వెలువరించరాదు. ఇట్లు చేయుటద్వారా వారు ఇతరుల మనస్సులలోనికి పాపమును పులిసిన పిండిని ఎక్కించెదరు. సంఘమందలి యొక సహోదరునికిగాని, సహోదరికిగాని ఇష్టములేని ఉదంతములు ఒక సభ్యుని యొద్దనుండి మరొయొకని యొద్దకు ప్రాకును. ఎవరో ఒకరు యేసు ప్రభువు ఒసగిన ఆదేశముల ననుసరించుట కిష్టపడనందున ఈ తప్పులు జరుగును. అనాయము సంధిల్లును. CChTel 173.2

    “మరియు నీ సహోదరుడు నీ యెడల తప్పిదము చేసిన పక్షమున నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు గద్దించుము.” మత్తయి 18:15. ఈ తప్పిదమును గూర్చి ఇతరులకు చెప్పకుడి. ఒక వ్యక్తికి చెప్పినది మరియొకనితో చెప్పబడుట ద్వారా ఈ ఉదంతము నిత్యము పెరుగును. దీని వలన చెడుగు అధికరించును. తత్పర్యవసానముగా సంఘమంతయు కష్టపడుట జరుగును. “నీవును అతడును ఒంటరిగా” దీనిని పరిష్కరించుకొనుడి. ఇదియే దేవుని సంకల్పము. “ఆలోచనలేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగు వాడు నిన్నవమానపరచి ` దాని అంతమున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో! నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును. గాని పరుని గుట్టు బయటపెట్టకుము.” సామెతలు 25:8,9. మీ సహోదరుని పైకి కీడు రానీయకుడి. కాని యాతని రచ్చకీడ్చి తద్వారా తన కష్టము నధికము చేసి ఆ గద్దింపు కక్షగా అగపడునట్లు చేయకుడి. దేవ వాక్యమును చూచించబడిన రీతిగా అతని సరిచేయుడి. CChTel 173.3

    కోపమును, ద్వేషముగా పరివర్తన జెండనీయకుడి. గాయము చీము పట్టి చిదికి విషము మాటగా మారునట్లు చేయకుడి. వినువారి మనసుల నా మాటలు చెరచును. ద్వేషపు ఆలోచనలతో మీ మనసు అతని మనసు నిండుకొన నీయకుడి. మీ సహోదరుని కడకు ఏగి నమ్రతతతోను, యధార్తతోను ఆ విషయమును గూర్చి యతనితో సంప్రదించుడి. CChTel 174.1

    తప్పిదమేదయినను కానిండు,కక్షలను అపోమలను పరిష్కరించుకొనుటకు దేవుడు చేసిన యేర్పాటును అది మార్చదు. తప్పిదమందున్న వానిలో కేవలం మాటలాడుట వలననే తరచు అది సరియగును. తప్పు చేయు వారి యొద్దకు క్రీస్తు ప్రేమతోను, సానుభూతితోను నిండిన హృదయముతో వెళ్లి, వెళ్లి, విషయమును సరిజేయపూనుకొనుడి. అతనితో ప్రశాంతముగాను నెమ్మదిగాను మాటలాడుడి. అతడు సదాలోచనకు వచ్చునట్లు మాటలాడుడి. ఈ మాటలను జ్ఞాపకముంచుకొనుడి. “పాపిని తప్పుడు మార్గము నుండి మళ్ళించువాడు మరణమునుండి యొకని ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.” యాకోబు 5:20. CChTel 174.2

    అసంతృప్తిని నయము చేయు జౌషధమును మీ సహోదరుని కడకు కొనిపోవుడి. అతనికి సాయము చేయుటలో మీ భాగమును మీరు నిర్వహించుడి. సంఘశాంతికి ఐక్యతకు ఇది చేయుట ఒక తరుణమనియు, విద్యుక్త ధరమమనియు భావిఒచుడి. మీ యుపదేశముల నతడాలకించెనా యతడు మీకు స్నేహితుడగును. CChTel 174.3

    తప్పిదమందున్న వానికి నష్టం కలిగిన వానికి మధ్య జరుగు సంభాషణయందు పరలోకవాసులందరు ఆశ కలిగి యుందురు. తప్పిదమందున్న వానిని క్రీస్తు ప్రేమతో గద్దించినపుడు అతడు తన తప్పిదమును గుర్తించి దేవునిని, తన సహోదరుని క్షమాపణ యడిగినచో పరలోక కిరణములతో అతని హృదయము నింపబడును. నినాదము సమాప్తమగును. స్నేహము వృద్ధియగును. విశ్వాసము నెలకొనును. తప్పిదము వలన కలిగిన గాయమును ప్రేమయను తైలము మాన్పివేయును. దైవాత్మ హృదయమునకు, హృదయమునకు సమైక్యత కూర్చును. ఈ సమైక్యత విషయము పరలోకమందు ఉప్పతిల్లును. CChTel 174.4

    క్రైస్తవ సహవాసము నందిట్లు సమైక్యత పొందిన వారు దేవునికి ప్రార్థించి న్యాయముగా ప్రవర్తింతుమనియు, కృపను ప్రేమించి, వినయము కలిగి దేవునితో నడుతుమనియు వాగ్దానము చేయుచో వారికి గొప్ప ఆశీర్వాదములు వచ్చును. ఇతరులకు అన్యాయము ఏసినచో వారుపశ్చాత్తాపము పొందుట పాపము ఒప్పుకొనుట, నష్టపరిహారము ఇచ్చుట ఈ పనులు చేయుచు ఒకరినొకరు మేలుచేసికొనుటకు సంపూర్ణముగా పూనుకొనవలెను. క్రీస్తు ధర్మశాస్త్రమును నెరవేర్చుట యనగా నిదియే. CChTel 174.5

    “అతడు వినిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షులనోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము.” (మత్తయి 18:16) భక్తి ప్రవత్తులు గల వారిని అతని యొద్దకు తీసికొని వెళ్లి తప్పిదమందున్న అతనితో తన తప్పిదమును గూర్చి మాట్లాడుడి. తన సహ విశ్వాసుల సమిష్టి విజ్ఞాపనలకతడు లొంగవచ్చును. ఆ విషయమందు వారికున్న ఒప్పుదలను అతడు గుర్తించు కొలది అతని మనసు ఉత్తేజితము కావచ్చును. “అతడు వారి మాట వినిన యెడల” ఏమి చేయవలెను? బోర్డు మీటింగులోని కొందరు వ్యక్తులు ఆ నేరస్తుని సంఘములోనుండి తొలగించుటకు పూనుకొనుట యుక్తమా? “అతడు వినని యెడల ఆ సంగతి సంఘమునకు తెలియ పెప్పుము.” 17వ వచనము. తన సభ్యుల విషయము సంఘము చర్యపుచ్చుకొనవలెను. CChTel 175.1

    “అతడు సంఘపు మాట వినని యెడల అతనిని నీకు అన్యునుగాను, సుంకరిగాను ఎంచుకొనుము”. 17వ వచనము. సంఘ స్వరము నతడు వినకున్నచో; తనను తిరిగి సంపాదించుటకు సంఘము చేయు ప్రయత్నముల నతడు నిరాకరించినచో, అతనిని సంఘమునుండి తొలగించు బాధ్యత సంఘముపై గలదు. సంఘ పట్టికలలో నుండి యతని పేరు అప్పుడు కొట్టివేయ వలెను. 47T 260-262;CChTel 175.2