Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సాక్షములు`పఠికుడు

    దేవుడు తనకు ప్రత్యక్ష పరచిన సంగతులను శ్రీమతి ఎలెన్‌ జి. వైటమ్మగారు డెబ్బది సంవత్సరముల పర్యంతము బోధించిరి, రచించిరి. బైబిలు సత్యములను వీడి తప్పులు చేసిన వ్యక్తులను సరిదిద్దుటకు గాను అనేక పర్యాయములు తన ప్రజలవలభించినవి. కొన్ని సార్లు సాక్ష్యములు గృహ సంఘ జీవిత విధానములను గూర్చి భాషించినవి. ఈ వర్తమానములను సభ్యులెట్లు అంగీకరించిరి?CChTel 46.1

    ఆమె పని ప్రారంభమునుండియు నాయకులు ఆమె ప్రవచనము యధార్థమైనదో కాదో తెలిసికొనుటకు ఆమె పనిని పరీక్షించిరి. అపాస్తలుడగు పౌలిట్లు హెచ్చరించుచున్నాడు. “ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి.” 1 థెస్స 5:19-21. ప్రవక్త విషయమైన బైబిలు పరీక్షల వలన శ్రీమతి వైటమ్మగారి పని పరీక్షించబడినది. ఇట్లు చేయవలెనని ఆమె కోరినదికూడ. ఆమె యిట్లు వ్రాసెను:CChTel 46.2

    “ఈ పని దేవుని సంబంధమైనది. లేదా అది దేవుని సంబంధమైనదే కాదు. సాతనుతో కలిసి దేవుడు దేనిని చేయడు. గత ముప్పది సంవత్సరములుగా నేను చేయుచున్న పని దేవుని ముద్ర కలిగియున్నది. లేదా అతి సాతాను ముద్రను కలిగియున్నది. ఇందు మధ్యేమార్గములేదు.” ప్రవక్తను పరీక్షించుటకు బైబిలు నాలుగు పరీక్షలను ప్రతిపాదించిచున్నది. ప్రతి పరీక్షకు వైటమ్మగారి పని అనుగుణ్యముగా నున్నది. CChTel 46.3

    1. యధార్థ ప్రవక్త యొక్క వర్తమానము దైవ ధర్మశాస్త్రమునకు, ప్రవక్తల వచనములకు అనుగుణ్యముగా నుండవలెను. (యెషయా 8:20. )CChTel 47.1

    ఇ. జి. వైటమ్మగారి రచనలు దైవ ధర్మశాస్త్రమును సమున్నతపరచి ప్రజలను బైబిలు సమగ్ర పఠనమునకు నడుపుచున్నవి. విశ్వాసమునకు, ఆచారములకు బైబిలు ప్రమాణమనియు, గొప్ప వెలుగనియు “చిన్న వెలుగై”న తన రచనలు చదువు వారిని ఆ వెలుగునకు నడిపించుననియు ఆమె వ్యక్తము చేయుచున్నది. CChTel 47.2

    2. యధార్థ ప్రవక్త ప్రవచనములు నెరవేరవలెను. (ఇర్మియా 28:9) ప్రజలకు నాయకత్వము వహించి వారిని నడిపించుటలో శ్రీమతి వైటమ్మగారి సేవ మోషే చేసిన సేవ వంటిదైనను అనేక భావి సంభావములను గూర్చి ఆమె ప్రావచికముగా వ్రాసెను. 1848లో మన ప్రచురణసేవ ప్రారంభమైనప్పుడు ఆ సేన ఎట్లు వృద్ధి చెంది ప్రపంచమును వెలుగుతో నింపునో ఆమె ప్రవచించెను. నేడు సెవెంతుడే ఎడ్వెంటిస్టులు 200 భాషలలో సాహితీ ప్రచరుణ గావించుచున్నారు. ఈ సాహిత్యపు మూల్యము సాలీనా 10,00,00,000 రూపాయలు. CChTel 47.3

    1890లో ఇక యుద్ధములు సంభవించవు, వెయ్యేండ్ల పరిపాలన ఆరంభము కానున్నది అని ప్రపంచము ప్రకటించినప్పుడు ఎలెన్‌ వైట్‌ ఇట్లు వ్రాసెను: “తుఫాను వచ్చుచున్నది. దాని భీభత్సము నెదుర్కొనుటకు మనము సిద్ధముగా నుండవలెను.. .. అన్ని మూలల శ్రమ మనకు గోచరించును. వేలకొలది నౌకలు సముద్రపు అగాధములలోనికి క్రుంగిపోవును. నౌకాదళములు మునిగిపోవును. లక్షల కొలది మానవులు తమ అసువులను బాసెదరు.” ఇది ప్రథమ ద్వితీయ సంగ్రామములలో నెరవేరినది. CChTel 47.4

    3. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని దేవుడు నరావతారమెత్తెనని యధార్థ ప్రవక్త ఒప్పుకొనును. (1 యోహాను 4:2). CChTel 47.5

    “డిజైర్‌ ఆఫ్‌ ఏజస్‌” అను గ్రంథపఠనము ఎలెన్‌ జి. వైటు ఈ పరీక్షయందు నెగ్గినట్లు వ్యక్తము చేయును. ఈ మాటలను పరిశీలించుడి. CChTel 47.6

    “క్రీస్తు భూలోకమునకు రాకుండ తన తండ్రి యొద్ద ఉండెడివాడే. పరలోక మహిమను దూతల మన్ననలను ఆయన త్యజింపకుండెడివాడే. కాని రాజదండమును తండ్రి కప్పగించి పరలోక సింహాసనము దిగి చీకటియందున్న వారికి వెలుగు, నశించుచున్న వారికి జీవము ఇచ్చుటకు ఆయన తీర్మానించుకొనెను. CChTel 47.7

    “సుమారు రెండు వేల సంత్సరముల క్రిందట ఒక అవ్యక్త ప్రాముఖ్యత గల స్వరము పరలోకమందు దైవ సింహాసనం వద్ద నుండి ‘ఇదిగో నేను వచ్చుచున్నాను’ ‘బలియు అర్పణము నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితిని.. . (గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము) దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను. హెబ్రీ 10:5-7. యుగయుగములనుండి దాచబడిన మర్మము యొక్క నెరవేర్చు ఈ మాటలతో వ్యక్తము చేయబడుచున్నది. నరావతారమెత్తి మన ప్రపంచమును దర్శించుటకు క్రీస్తు సిద్ధముగా నుండెను.. . లోకము దృష్టిలో ఆయన యందు సౌందర్యం లేదు. అయినను ఆయన నరావతారమునందున్న దైవము. ఆయన పరలోక భూలోకములకు వెలుగు. ఆయన మహిమ మరుగు చేయబడినది. శోధనలు విచారములతో సతమతమగు మానవాళికి సమీపముగా నుండు నిమిత్తము ఆయన మహిమౌన్నత్యములు మరుగుపర్చబడినవి.”CChTel 48.1

    4. బహుశా యధార్థ ప్రవక్త యొక్క నిశిత పరీక్ష అతని జీవితము నందు, పనియందు, అతని బోధల ప్రభావమందు కనబడును. ఈ పరీక్షను మత్తయి 7:15, 16లో క్రీస్తిట్లు నిర్దేశించెను: “వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొదురు”. CChTel 48.2

    ఎలెన్‌ జి. వైటమ్మ గారి జీవితమును పరిశోధించగా ఆమె తన బోధల ప్రకారము ప్రవక్తకు తగినట్లు సత్‌ క్రైస్తవ జీవితమును, జీవించునట్లు మనము ఒప్పుకొనవలెను. ప్రవచనసారపు సలహాలను అనుసరించి జీవించినవారి జీవితములలో కనపర్చబడిన ఫలములు మనము పరీక్షించగా అవి సత్పలములైనట్లు మనము కనుగొనుచున్నాము. ఆమె సాక్ష్యములు సత్ఫలములు ఫలించినవి. ఈ ఉపదేశముల వలన మనము ఆయా కార్య కలాపముల లోనికి నడిపింపబడితిమని గుర్తించి సంఘమును పరిశీలించినపుడు శ్రీమతి వైటమ్మగారి పని ఈ పరీక్ష మేరకు సరిపోయినదని మనము ఒప్పుకొనక తప్పదు. 70 సంవత్సరముల పాటు రచించబడిన గ్రంథముల బోధ యందలి ఏకత్వము ఈ వరము యొక్క నిజాయితీకి ప్రబల సాక్షమై నిలిచి యున్నది. CChTel 48.3