Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అందరు సంఫీుభపరచి చేయవలసిన పని

    సువార్త సేవకులు వైద్యసేవతో ఏకీభవించవలెను. ఇట్టి సేవ మన ప్రపంచ మందు సత్యమునకు వ్యతిరేకముగా నిలచిన ద్వేషమును పొగొట్టుగలదని నాకు చూపబడెను. CChTel 461.1

    వైద్య మెరిగినచో సువార్తికుడు తన పనియందు రెండురెట్లు జయమును సంపాదించవచ్చును. CChTel 461.2

    వారి హోదా యేమయినను వారి పరిస్థితి యెట్లున్నను ప్రజలను ఉన్నరీతిగనే సంబందించి, సాధ్యమైనంత సహాయము చేయుటకు నేను సిద్ధముగా నున్నాను. నేను చేయగలిగినదతయు చేయుదును. నేను వైద్యుడన కాను, సువార్తికుడను. వ్యాధిగ్రస్తులకు, బాధపడుచున్న వారికి నేను సేవ చేసెదను. శరీర వ్యాధిగల వారికి ఆధ్యాత్మిక వ్యాధి కూడా ఉండును. ఆత్మ వ్యాధిగ్రస్త మగునపడు శరీరము కూడా వ్యాధిగ్రస్తమగును. CChTel 461.3

    వైద్య సేవకును సువార్త సేవకును మధ్య వేరుపాటుండరాదు. వైద్యుడు సువార్తికునితో సమముగా ఆత్మలను రక్షించుటకును స్వస్థత కూర్చుటకును పట్టుదల కలిగి కృషి చేయవలెను. యువజనులు మనస్సు, శరీరములకు వైద్యులవునట్లు విద్య నిచ్చుట యందలి లాభమును గ్రహించని కొందరు తమ సమయమును రోగులకు చికిత్స చేయుటయందు గడువ వైద్య సేవకులన పోషించు నిమిత్తము దశమ భాగమునపయోగించరాదనెదరు. ఇట్టి మాటలకు సమాధానముగా మనస్సు వాస్తవ పరిస్ధితిని గ్రహించలేనత సంకుచితము కారాదని చెప్పవలసినదిగా నేనుపదేశించబడితిని సువార్తికుడు భౌతిక రగ్మతలన కూడ నయమ చేయగల వైద్య సేవకుడైనచో వైద్యమెరుగని సువార్తికునికన్న అత్యధిక ప్రావీణ్యము కలిగియుండును. అతని సువార్త మరెక్కువ జయప్రదముగా నుండును. CChTel 461.4

    విద్యావంతుడైన వైద్యుడు ఇతర వ్యక్తులు ప్రవేశింప వీలులేని నగరములలోనికి ప్రవేశించగలడని ప్రభువు వచించెను. ఆరోగ్య, సంస్కరణ, సందేశమును అదించుడి. తద్వారా ప్రజలయద పలుకుబడి ఏర్పడును. వివేకవంతుడైన వైద్యుడు చేయు ఉపదేశము యొక్క ప్రభావము చాల గొప్పది. తన పని యందు వైద్యసేవను సువార్త సేవన మిళితమ చేయగలవాని శక్తి నైపుణ్యములు అమోఘములు. ఆ వ్యక్తి చేయు పని ప్రజల నాకర్షించును. CChTel 461.5

    మన వైద్యులిట్లు పనిచేయవలెను. ఆత్మను యేసుప్రభువెట్లు స్వస్థపర్చగలదోయను దానిని గూర్చి ఉపదేశము నిచ్చును సువార్తికులు పని చేయునపుడు వారు ప్రభువు సేవ చేయుచున్నారు. రోగికి చికిత్స చేయుట ఎట్లు తెలియునో అట్లే విశ్వాసమతో ప్రార్ధించుట కూడ ఎరిగి ఉండవలెను. అదియునుగాక పశ్చాత్తాపము, మారు మనస్సు, ఆత్మరక్షణ, శరీర రక్షణలను గూర్చి బోధించుచు నతడు దేవుని సువార్తికులలో నొకనిగా పని చేయవలెను. ఇట్టి సంయుక్త కృషి అతని యనుభవమును విశాలపరచి యాతని పలుకుబడిని అధికము చేయును. 8MM 237-247;CChTel 462.1