Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పాకశాస్త్రము

    పాకశాస్త్రము సామాన్యమై నదికాదు. అనుదిన జీవిత ప్రాముఖ్య విషయములలోనిది యొకటి. ఇది స్త్రీలందరు నేర్చుకొనవలసిన ఒక శాస్త్రము. బీద ప్రజలకు లభదాయకముగా నుండునట్లు ఇది బోధించబడవలెను. ఆహారమును రుచికరముగాను సామాన్యముగను బల నర్థకముగను తయారు చేయుటకు నైపుణ్యము అవసరము. ఇది సాధ్యమే. సామానాృహారమును సామాన్య విధముగాను ఆరోగ్యకరముగాను రుచికరముగాను హితకరముగను ఎట్లు తయారు చేయవలెనో వంట చేయువారు తెలిసికొనవలెను. 4MH 302, 303;CChTel 410.6

    మన ఆహారమును సామాన్యముగా తయారు చేసికొనుట జ్ఞానయుతముగా వృద్దిగాంచవలెను. శరీరపోషణకు అవసరమగు ఆహార పదార్ధములు దైవసంకల్పానుసారము ప్రతి దేశము నందును ఉత్పత్తియగును. వీనితో ఆరోగ్యదాయకమైన, రుచికరమైన వంటకములు చేయవచ్చును. 5CD 94; CChTel 411.1

    అనేకులు ఇదియొక విధియని భావించరు. కనుక ఆహారమును సరిగా తయారు చేయుటకు వారు యత్నించరు. క్రొవ్వు, వెన్న, మాంసము లేకుండగనే యిది సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన, సులభమైన విధముగా తయారు చేయబడవచ్చును. సామాన్యతతో నైపుణ్యము మిళితము కావలెను. ఇది చేయుటకుగాను స్త్రీలు పఠించి పిదప తాము పఠించు విషయములను ఆచరణలో పెట్టవలెను. 6IT 681;CChTel 411.2

    పండ్లు, పప్పుదినుసులు, కూరగాయలు, తాళింపు సరకులు, ఆయా విధములైన చమురులు తగులకుండ పాలతోగాని మీగడతోగాని తయారుచేయబడినచో అది అత్యంత ఆరోగ్యదాయకమైన ఆహారము కాగలకు. 7CH 115;CChTel 411.3

    నెయ్యిగాని, నూనెగాని లేకుండ సాధ్యమైనంత స్వాభావికముగా తయారు చేయబడు పప్పు దినుసులు, పండ్లు పరలోకమునకు ఎత్తబడవలెనని కోరువారికి ఆహారమై యుండవలెను. 82T 352;CChTel 411.4

    ఆహారములో చక్కెర ఎక్కువగా వాడబడుచున్నది. కేకులు, పుడ్డింగులు, మిఠాయి, జిలేబిలు, జాములు ఇత్యాది వివిధ పదార్థములు అజీర్తికి ముఖ్యకారణములగు చున్నవి. చక్కెరతో చేసిన వివిధములగు వంటకములు ఎక్కువ హానికరములు, పాలలో పంచదార కలిపి విశేణముగా వాడరాదు. 9MH 302;CChTel 411.5

    వేసవి కాలమందు ఆహారములో ఎంత తక్కువ చక్కెర కలుపుకొని ఉపయోగించిన అంత తాపము తగ్గును. 10CD 95;CChTel 411.6

    పాలను బాగుగా కాచి సేవించవలెను. ఇట్లు ముందు జాగ్రత్తతో దానిని సేవించిన దాని ఉపయోగము వలన రాగల జబ్బులు చాలమట్టుకు తగ్గును. 11MH 302;CChTel 411.7

    పాలు ఉపయోగించుటకు క్షేమకరము కాని దినములు రావచ్చును. కాని ఆవులు ఆరోగ్యముగా నుండి పాలు బాగుగా పొంగించబడినచో కష్ట కాలమును ముందే తెచ్చిపెట్టు కొనవలసిన అగత్యముందడు. 12CD 357;CChTel 412.1