Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మీ విడుదల సమీపించు చున్నది.

    వార వారము జరుగుచున్న విప్పత్తులను గూర్చి వినుచుండగా దీని భావమేమి అని నన్ను నేను ప్రశ్చించుకొనెదను. అతి భయంకరమైన విపత్తులు ఒకదాని వెంట మరొకటిగా వచ్చుచున్నవి. భూకంపములు గాలి వానలు. అగ్ని ప్రమాదములు, వరదలు వీని వలన కలుగు ఫ్రాణనష్టము, ధననష్టమును గూర్చి మనమెంత తరుచుగా వినుటలేదు. ఈ ఉపద్రవములు క్రమబద్దత వీడిన స్వాధీనము తప్పిన శక్తు ల వలన ఏర్పడిన వాని పూకి అగపడును. అయినను వీనియందు దేవిన వుద్దేవ్యములు బహిర్గతములులకు చున్నవి. స్త్రీ పురుషులు తమ అపాయమును గుర్తించుటకు మేల్కొల్పు సాధనములలో ఇది ఒకరకము. CChTel 527.1

    మనము సత్యము నంగీకరించినప్పటికన్నా నేడు క్రీస్తురాక సమీపముగా నున్నది. ఈ మహా సంఘర్షణ అంతము కానున్నది. దేవుని తీర్పులు లోకముపై పడుచున్నవి. ఇది ఇట్లు గంభీరముగా హెచ్చురించు చున్నది. మీ రనుకొనిని గడియలో మనుష్య కుమారుడు వచ్చును మీరు సిద్దముగా ఉండుడి మత్తయి 24:44. CChTel 527.2

    ప్రస్తుతకాల సత్యముయొక్క నిజభావము తెలియని వారు అనేకులు మన సంఘములలో గలరు. కాలసూచనల నెరవేర్పును అలక్షము చేయవలదని నేను వారికి విజ్ఞప్తి చేయుచున్నాను. ఈ సూచనలు అంతయు సమీపముగా నున్నదని తెల్పుచున్నవి. తమ ఆత్మరక్షణ విషయము కషిచేయు వారనేకులు ఈ విధముగా విలపింతురు. కోత కాలము గతించియున్నది. గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయే యున్నాము. CChTel 527.3

    లోక చరిత్రయొక్క అంత్యదశలో మనము నివశించుచున్నాము. ప్రవచనము వేగముగా నెరవేరుచున్నది కృపకాల ఘడియలు వేగముగా గతించుచున్నవి. వృర్ధపుచ్చుటకు మనకు సమయములేదు. కావలికాయుచున్న మనము నిద్రించకుందముగాక. తన హృదయమందు గాని క్రియల మూలమున గాని యెవరును నా యజమాని ఆలస్యము చేయుచు అని పలుక కుండునుగాక. క్రీస్తు త్వరితాగమన సందేశమును పట్టుదలతో ప్రకటించవలెను. స్త్రీ పురుషులు పశ్చాత్తాపపడి తానున్న ఉగ్రత నుండి తప్పించుకొనునట్లు వారికి హితవు చేయుదుము. వెంటనే సిద్దపడుటకు వారికి మేల్కొల్పుదుము కారణమేమనగా ముందే మున్నదో మనకు తెలియదు. బోధకులు స్యయంపోషక సువార్తికులు పండిన పొలములలోనికి వెళ్లి ఆలక్ష్య స్వభావాలతో వ్యక్తులను ప్రభువు దొరకు సమయమందే ఆయనను వెదకుడని హెచ్చరించవలెను. విస్మరించ బడిన బైబిలు సత్యములను తామెక్కడ ప్రకటింతురో ఆన్కడనే బోధకులను పంట లభించును. సత్యము నంగీకరించి ఆత్మలను క్రీస్తు చెంతకు చేర్చుటకు తమ జీవితములను అంకితము చేసికొను వ్యక్తులు వారికి లభించెదరు. CChTel 527.4

    ప్రభువు త్యరలో రానైయున్నాడు. సమాధానమందు ఆయనను కలిసికొనుటకు మనము సిద్దపడవలెను. మనచుట్టు ఉన్నవారికి వెలుగు నందించుటకు మన శక్తి కొలది కృషిచేయుటకు తీర్మానించు కొందము. మనము విచారము నుండక సంతోషముగా నుండవలెను. మన ప్రభువైక యేసును ఎల్లప్పడు ముందుంచు కొనవలెను. ఆయన త్వరలో వచ్చుచున్నాడు. మనము సిద్దముగా నుండి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడవలెను. ఆయనను చూచుట ఆయనచే నిమోచించబడిన వారిగా ఆహ్వానించబడుట యెంత ముదావహము మనము దీర్ఘకాలము వేచియున్నాము. అయితే మన నిరీక్షణ సన్నగిల్లరాదు. రాజును తన సౌందర్యస్ధితిలో మనము చూడగలిగినచో మనము నిత్యము ధన్యులమే. ఇంటికి వెళ్చుచున్నాము. అని కేకవేయవలెనని అనిపించుచున్నది. నిమోచించబడిన వారిని తను నిత్యనివాసమునకు తోడుకొని పోవుటకు గొప్ప మహిమతోను శక్తితోను క్రీస్తు వచ్చుసమయమును మనము సమీపించు చున్నాము. CChTel 528.1

    ముగింపు పనిలో మనకగోచరములగు సమస్యలు మనకు తారసపడును. పరలోక త్రత్వము పనిచేయుచున్నదనియు, చక్రముపై దైవహస్తమున్నదనియు దేవుడు తన వాగ్దాత్తమును నెరవేర్చుననియు మరువుకుందము. ఆయన భూమి నుండి ఒక ప్రజను పోగుచేయును. వారు ఆయనకు నీతియందు సేవ చెసెదరు. 28T 252-254;CChTel 528.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents