Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మృదువైన ప్రేమ సంరక్షణల క్రమము

    పిల్లలు తమ తల్లిదండ్రులకు అప్పగించబడిన ప్రశస్తమైన భాగమై యున్నారు. ఏదోఒక దినమున దేవుడు వారిని గూర్చి తల్లిదండ్రులను ఆరా అడుగును. కనుక పిల్లలకు శిక్షణనిచ్చుటలో మనము ఎక్కువ సమయము గడిపి ఎక్కువ శ్రద్ధ వహించి యెక్కువ ప్రార్థించవలెను. సముచితమైన ఉపదేశము వారి కెక్కువ అవసరము. CChTel 292.2

    అనేక సందర్భములలో పిల్లలు పొందు శిక్షణ యందలి దోషములను బట్టి వారికి రోగములు వచ్చుచున్నవి. క్రమము తప్పి భుజించుట, చలిగానున్నప్పుడు సరిగా దుస్తులు ధరించకుండుట, రక్త ప్రసరణకు సహాయముచేయు వ్యాయామము లేకపోవుట, లేక రక్తము శుద్దిపడుటకు చాలినంత గాలి లేకపోవుట ఇవి రోగ కారణములు. రోగ కారణములను కనుగొని వెంటనే వానిని అరికట్టుటకు తల్లిదండ్రులు ప్రయత్నించవలెను. CChTel 292.3

    పిల్లలు ఊయలలో పసిపాపలుగా నున్నప్పటికి నుండియు రుచికి అలవాటుపడి తాము తినుటకే జీవించు చున్నట్లు తయారు చేయబడెదరు. బాల్యమునందు పిల్లలు ప్రవర్తనా నిర్మాణంలో తల్లి బాధ్యత యెక్కువ కలదు. అభిరుచులను స్వాధీనపరుచుకొనవలెనని ఆమె వారికి నేర్పగలదు. లేదా తిండిబోతులగునట్లు వారి నామె తర్ఫీదు చేయగలదు. దినములలో కొన్ని పనులు చేయుటకు తల్లి ఒక కార్యక్రమమునకు ఏర్పాటు చేసికొనును. పిల్లలు ఆమెను తొందరచేయగా వారిని కుదురుబెట్టి చక్కజేయుటకు బదులు వారి మారాము కుదుర్చుటకు గాను వారికేదో చిరుతిండి ఇచ్చును. అది తాత్కాలికముగా ఆ మారామును అవును గాని క్రమేపి దాని పర్యవసానము హానికరముగా నుండును. కడుపు నిండుగా ఉన్నను పిల్లలకు ఆహారము పెట్టెదరు. అసలు అవసరమైన దేమనగా తల్లియొక్క సమయములో కొన్ని నిముషములు శ్రద్ధ మాత్రమే. తన పిల్లల ఆనందమునకు తన ప్రశస్త సమయము వెచ్చించ బడరాదని ఆమె తలంచినది. తన బిడ్డల ఆనందము, ఆరోగ్యం కన్నా అతిధులు తన గృహమును మెచ్చకొనునట్లు గృహమునందలి వస్తువులను అవర్చుట, ఆహారమును ఇంపుగా నుండుట ` ఇవి బహుశ ఆమెకు ప్రాముఖ్యములై యుండవచ్చును. CChTel 292.4

    బిడ్డల దుస్తులను తయారు చేయునపుడు వీలు, సౌఖ్యము ఆరోగ్యములను గూర్చి యోచింపవలెను. గాని ఫేషను గూర్చి గాని మెప్పును గూర్చి గాని, ఆలోచించరాదు. తన స్వకీయారోగ్యమును తన బిడ్డ యొక్క ఆరోగ్యమును కోల్పోయి చక్కని అల్లికలు, మనోహరమైన కుట్టుపనులు చేయుటలో తల్లి తన కాలమును గడపరాదు. తనకు ఎక్కువ విశ్రాంతి, వ్యాయామము అవసరమైన సమయమందు, తల్లి శ్రమపడి కుట్టు కుట్టరాదు. ఇది ఆమె కండ్లకు, నరములకు హానికలిగించును. తనపై మోపబడిన విధులను నిర్వర్తించుటకు గాను ఆమె తన ఆరోగ్యమును కాపాడుకొనవలెనని గుర్తించవలెను. CChTel 293.1