Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    కుటుంబము యొక్క మిక్కిలి పరిశుద్ధ ఘడియలు

    సబ్బాతుబడి ఆరాధన కూటములు సబ్బాతులోనొక భాగము మాత్రమే. ఇక మిగిలిన సమయము సబ్బాతంతటిలోను మిక్కిలి పవిత్రమైనట్టియు, ప్రశస్తమైనట్టి కార్యముగా చేయబడవచ్చును. ఈ సమయములో నెక్కువ భాగము తల్లిదండ్రులు తమ బిడ్డలతో గడపవలెను. అనేక కుటుంబములలో చిన్నపిల్లలు తమకు తామై ఆడుకొనుటకు విడువబడుదురు. అట్లు ఏకాంతముగా నున్న పిల్లలు అచిరకాలములో అల్లరి చేయ నారంభింతురు. ఇట్లు సబ్బాతు పరిశుద్ద ప్రభావమును వారు గుర్తించలేరు. CChTel 72.2

    వాతావరణము మనోహరముగా నున్నవేళలయందు తల్లిదండ్రులు తమ బిడ్డలతో పంట పొలములలోను, చెట్ల తోపులతోను వాహ్వాళి చేయవలెను. ప్రకృతి సుందరవస్తుజాలము మధ్య సబ్బాతును స్థాపించుటకు గల కారణమును గూర్చి వారికి విశదపరచుడి. దేవుని మహత్తర సృష్టి కార్యమును గూర్చి వారికి సవివరంగా దెల్పుడి. ఆయన హస్తములనుండి వచ్చినపుడు భూమి పరిశుద్ధముగను మనోహరముగను నుండెనని వారికి చెప్పుడి. ప్రతి పుష్పయే. గుల్మము, వృక్షము, తమ సృష్టికర్త చిత్తమును నెరవేర్చినవి. కంటికి కను పించినదంతయు మనోజ్ఞమై దేవుని ప్రేమా సంబంధమగు తలంపులతో మనస్సును నింపెను. ప్రతి శబ్దము దైవ స్వరమును బోలిన సంగీతమై యుండెను. దేవుని సంపూర్ణ కార్యమును పాడుచేసినది పాపమనియు, అవిధేయతా ఫలితముగా ముండ్లుపొదలు, విచారము, బాధ, మరణము సంప్రాప్తమాయెననియు వారికి ఎరుకపర్చుడి. పాపశాపమునకు లోనైనప్పటికిని, పచ్చని పొలములు, ఎతైనచెట్లు, చక్కని ఎండ మేఘములు, మంచు, ప్రశాంతమగు రాత్రి, ఆకాశ నక్షత్రముల శోభ, అందాల జాబిలి ` ఇవన్నియు సృష్టికర్తను గూర్చి సాక్షమిచ్చుచున్నవి. కృతఘ్నులమైన మనపై పడు ప్రతి వర్ష బిందువును, సూర్యకిరణమును దేవుని దీర్ఘ శాంతమును ప్రదర్శించుచున్నవి. CChTel 72.3

    రక్షణ మార్గమును గూర్చియు, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించి” నదెట్లో దానిని గూర్చియు వారితో చెప్పుడి. యోహాను 3:16. బెత్లెహేము మధురకథను గూర్చి వారితో పదే పదే ముచ్చటించుడి. బాల్యమందు తన తల్లిదండ్రులకు విధేయుడుగాను, యౌవనమందు నమ్మకముగానుండి కుటుంబ పోషణకు కష్టపడి పనిచేసిన వానిగాను యేసును వారికి చూపుడి. బాలల కష్టములను, సమస్యలను, శోధనలను, నిరీక్షణలను, సంతోషములను, రక్షకునికి ఎరుకయే యనియు, వారికి ఆయన సానుభూతి చూపి సహాయమీయగలడనియు మీరిట్లు వారికి బోధించ వీలగును. బైబిలు చరిత్రయందలి ఆశాజనకములగు కథలను వారికి అప్పుడప్పుడు చదివి చెప్పుడి. సబ్బాతుబడిలో వారేమి నేర్చుకొనరో ప్రశ్నించి మరుసటి సబ్బాతుబడి పాఠమును వారితో కలసి పఠించుడి. 56T 358,359;CChTel 73.1

    సబ్బాతు దినమున కుటుంబములోనివారందరు తమ్మును తాము దేవునికి సమర్పించు కొనవలెను. మన యిండ్లకు వచ్చు అతిథులేమి మన కుటుంబ సభికులేమి ఎల్లరును తమలోక వ్యవహారములను ఒక ప్రక్క నుంచి యీ పరిశుద్ద సమయమును ధ్యానము కొరకుపయోగించవలెనని ఆజ్ఞ చెప్పుచున్నది. తన పరిశుద్ద దినమందు మన ఉత్సాహ పూరితసేవద్వారా ప్రభువును సమిష్టిగా గౌరవించుదము. 62TT 185;CChTel 73.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents