Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అప్పుడు దేవుడు దీవించగలడు

    నిత్యము తినుటయందు ఆసక్తులగు బోధకులు తమ ముందున్న గురిని కోల్పోవుచున్నారు. వారు ఆరోగ్య సంస్కర్తలు కావలెనని దేవుని కోరిక. CChTel 433.1

    ఈ అంశములపై నీయబడిన వెలుగు ప్రకారము వారు జీవించవలెనని దేవుడు కోరుచున్నాడు. ఆరోగ్య సూత్రముల విషయము ఆసక్తి ప్రదర్శించవలసిన వారు ఇంకను సమగ్జీనిత సరణి ననుసరించక పోవుట శోచనీయము. తాము గొప్ప నష్టమును పొందుచున్నామని వారు గ్రహించునట్లు చేయుమని నేను ప్రభువుకు ప్రార్థన చేయుచున్నాను. మన సంఘస్థుల గృహములు ఉండవలసిన విధముగ నున్నచో దేవుని కొరకు మనము రెట్టింపు పని చేయగలము. CChTel 433.2

    పరిశుద్ధ పర్చబడిన మీదట పరిశుద్ధముగ నిలచియుండుటకు సెవెంతుడే ఎడ్వెంటిస్టులు తమ హృదయములలోను గృహములలోను పరిశుద్ధాత్మను కలిగియుండవలెను. నేటి ఇశ్రాయేలీయులు తన ముందు అణకువగా నుండి దేవాలయమగు తమ ఆత్మలయందలి సకల అపవితత్రాత్మను శుభ్రము చేసికొన్నచో రోగుల విషయము వారు చేయు ప్రార్థనలను ఆలకించి రోగ నివారణకు ఉపయోగించబడు జౌషధములను ఆశీర్వదింతునని ప్రభువు నాకు వ్యక్తము చేసెను. దేవుడిచ్చిన సామాన్యమగు చికిత్సలను ఉపయోగించుచు తాను చేయగలిగినదంతయు మానవుడు విశ్వాసముతో చేసినచో దేవుడాతని యత్నములను దీవించును. CChTel 433.3

    ఇంత వెలగీయబడిన పిదప కూడ దైవ ప్రజలు దురభ్యాసముల వీడక స్వార్థపరాయణచిత్తులయి సంస్కరణకియ్యకొనయున్నచో అతిక్రమఫలమును వారు నిశ్చయముగా పొందెదరు. ఏమి సంభవించినను కూడని ఆహారమును భుజింపదలచినచో తమ దుష్క్రియా ఫలితము నుండి దేవుడు వారిని అద్భుతరీతిగా రక్షింపజాలడు. వారు వేదనగలవారై పండుకొనెదరు.” యెషయా 50:11. CChTel 433.4

    తమకై దేవుడు దాచియుంచిన మహత్తరారోగ్యమును ఆధ్యాత్కి పరములను పొగొట్టుకొనుచున్న వారెందరున్నారు! ఏదో ఒక గొప్ప కార్యమును సాధించు నిమిత్తము ప్రత్యేక జయముల కొరకు పోరాటము సల్పు ఆత్మలనేకములున్నవి. ఈ లక్ష్యము సాధించుటకు కన్నీటితో ప్రార్ధన ద్వారా పోరవలెనని వారు ఎల్లపుడును తలంతురు. దైవ చిత్తమును తెలిసి కొనుటకు ఈ వ్యక్తులుCChTel 433.5

    ప్రార్ధన పూర్వకముగా లేఖనములను పరిశోధించి అప్పుడు సంపూర్ణ హృదయముతో ఆయన చిత్తమును నేరవేర్చినచో వారికి విశ్రాంతి దొరుకును. తాము వాంఛించిన దీవెనను ,వారు అనుభవించిన శ్రమ ,కార్చిన కన్నీ ళ్లు సల్పిన పోరాటము తేజాలవు. స్వార్ధమును పూర్తగ విసర్జించవలెను. విశ్వాసముతో అడుగు వారందరికిని వాగ్దత్తము చేయబడిన దైవ కృప ద్వారా వారు తమ పనులను చేయవలెను. CChTel 434.1

    “ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతానూ ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలివను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ” అని యేసు సెలవిచెను. లూకా 9:23. సామాన్యతలోను ,ఆత్మోపేక్షతోను రక్షకుని అనుకరింతము. మాటలద్వారాను ,పరిశుద్ధ జీవితముద్వారాను క్రీస్తు ను పైకెత్తుదము. తమ్మున తాము దేవునికి సమర్పించు కొనువారి చెంతకు రక్షకుడు వచ్చును. మన హృదయములలోను ,జీవితములలోను దైవాత్మ పనిచేయవలసిన అగత్యత ఇప్పుడె క్కువగా నున్నది. ఈ దైవ శక్తిని పరిగ్రహించి తద్వారా పరిశుద్ధమయిన ,క్రీస్తుకు లొంగియుండు జీవితము జీవించుటకు బలమును పొందెదము. 19T 153-166. CChTel 434.2