Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents
సంఘమునకు ఉపదేశములు - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    గద్దింపును అంగీకరించుట యెట్లు

    దేవుని ఆత్మచే గద్దింపబడు వారు మానవ మధ్యవర్తిపై తిరుగుబాటు చేయరాదు. వారిని నాశనమునుండి రక్షించుటకు గాను హెచ్చరిక నిచ్చినవాడు దేవుడు కాని మానవుడు కాడు. గద్దింపును అంగీకరించుటకు మానవ నైజము ఇష్టపడదు. దైవాత్మచే ఉత్తేజ పరచబడని మానవ హృదయము గద్దింపుయొక్క ఆవశ్యకతనుగాని, దాని వలన కలుగు ఆశీర్వాదమునుగాని గ్రహించుట దుస్సాధ్యము. మానవుడు శోధనకు లొంగి పాపము చేసినపుడు అతని మనస్సు చీకటిమయమగును. నైతిక భావము చెడిపోవును. మనస్సాక్షిచేయు హెచ్చరికలు తృణికరింపబడును. అంతఃస్సాక్షి శబ్దము స్పష్టముగా వినిపించదు. అతడు క్రమేణ మేలు కీడులు తెలుపు శక్తిని కోల్పోయి కడకు దేవుని ముందు నిలుచుటకు యధార్థబుద్ది కలిగి యుండడు. మతాచారములను గైకొని మతసిద్దాంతముల విషయము ఆసక్తితో వాదించవచ్చును. కాని యతని యందు మతసారముండదు. సత్యసాక్షి అభివర్ణించిన పరిస్థితిలో నతడుండును. “నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక`లనేను ధనవంతుడను ధనవృద్ధి చేసికొని యున్నాను,నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.” ఈ గద్దింపు వర్తమానము కలిగి దేవుని ఆత్మ మానవుని పరిస్థితి యిదియని వచించినపుడు అది యధార్ధమైన వార్త యని యతడు నమ్మడు. కనుక అతడీ సందేశమును తృణీకరించ వచ్చునా? తృణీకరించరాదు. CChTel 212.2

    సాక్ష్యముల నిజాయితీని కనుగొనుటకు పరీక్షింప అభిలషించు వారదరు సంతృప్తి చెందుటకు చాలినంత నిదర్శనమును దేవుడనుగ్రహించి యున్నాడు. అవి దైవదత్తములనిగుర్తించిన పిదప తామవలంబించు మార్గముగా తమకు ఆగపడక పోయినను గద్దింపును గైకొనుట వారివిధియై యున్నది. తమ స్థితిని వారు సంపూర్ణముగా గ్రహించి యున్నచో గద్దింపు ఏల అగత్యమగును? వారికి తెలియదు గనుక కృపతో దేవుడు దానిని వారికి కనపరచుచున్నాడు. హెచ్చరికలను తృణీకరించు వారు అంధత్వమందు విడువబడెదరు. వానికి ఆత్మవంచన తథ్యము. కాని దానిని ఆలకించి కావలసిన కృపను పొందుటకుగాను పట్టుదలతో తమ పాపములను విసర్జించు కార్యమందు నిమగ్నులైనవారు ప్రియరక్షకుడు లోనికి వచ్చి తమతో అది వసించు నిమిత్తము హృదయద్వారము తెరచెదరు. దేవునితో సన్నిహితసబంధము కలవారే ఆన మాటలాడునపుడు ఆన స్వరమును గర్తించగలరు. ఆత్మ సంబంధులు ఆధ్యాత్మిక విషయములను గ్రహించగలరు. ప్రభువు తమ తప్పిదములను బయలుపరచినందుకు అట్టి వారు కృతజ్ఞులై యుందురు. CChTel 213.1

    తనతో దేవుడు వ్యవహరించిన విధమునుబట్టి దావీదు వివేకము పొంది సర్వోన్నతుని గద్దింపుని గైకొని విధేయుడ్యెను. దావీదు నిజస్థితిని గూర్చి ప్రవక్తయగు నాతాను వ్యక్తపర్చగా దావీదు తన పాపములను గుర్తించి వానిని విసర్జించెను. హితవును సాత్వీకముతో అంగీకరించి దేవుని యందు వినయమనస్కుడై యుండెను. “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల జేయును” (కీర్త 19:7)CChTel 213.2

    “కుమారులైన వారు శిక్షలో పాలు.. .. పొందనియెడల దుర్బీజులే గాని కుమారులు కారు. (హెబ్రీ 12:8) “నేను ప్రేమించు వారందరిని గద్దించి, శిక్షించు చున్నాను.” అని ప్రభువు వచించు చున్నాడు. (ప్రకటన 3:19) “మరిఉ ప్రస్తుత మందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని, సంతోషకరముగా కనబడదు. అఇనను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” (హెబ్రీ 12:11) దుఃఖకరముగానున్నను “మనము పరిశుద్దులతో పాలుపొందవలెనని మనమేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు.” 115T 682, 683. CChTel 213.3